One way one way jeevitaaniki


One way One way జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదే మరి సాగిపొయే ప్రయాణం

runway లాంటిది కాదుగా ఇది ఎన్నో ఎన్నో మలుపులున్నది
ఎగుడు దిగుదు చూసుకోదిది పరుగు తీసే ప్రవాహం

నీ దారిలోన నవ్వు చిలకరించే మల్లెపువ్వులు
తీయతీయగానే నిన్ను గాయపరిచే తేనెటీగలెన్నో
ఎంత వింతని తెలుసుకో ప్రపంచం
అంతుతేలని సృస్టి లో రహస్యం

ఎంత వింతని తెలుసుకో ప్రపంచం
అంతుతేలని సృస్టి లో రహస్యం

One way One way జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదే మరి సాగిపొయే ప్రయాణం

జగమే ఒక మాయ,బ్రతుకే ఒక మాయ
అని అన్నది ఎవరో, అది విన్నది ఎవరో
మనసునే పట్టిలాగే ప్రేమెంత మాయ అనుకున్నా
ఒక్క చూపుకై బ్రతికే ఆ మాయలో హాయి లేదా
ఇప్పుడిక్కడ రేపు ఎక్కడ అన్న ఈ mystery కి
బదులు ఎవ్వరు చెప్పలేరుగా
అందుకే నేటి రోజే నీది

ఎంత చిన్నదో తెలుసుకో జీవితం
అంతకన్న అతి చిన్నది యవ్వనం

ఎంత చిన్నదో తెలుసుకో జీవితం
అంతకన్న అతి చిన్నది యవ్వనం
తను పుట్టిన చోటే ఉంటుందా చినుకు
తను వెళ్ళే చొటే తెలుసా మరి తనకు

నిన్న అన్నది ఇక రాదు
గతమంటె ఎందుకా మోజు
రేపు అన్న ఆ రోజు
కలలాంటిదే కదా మనకు
ఎన్ని వేల చిరు వేషాలో కలిపి మనిషి అవతారం
కళ్ళు మూసి తెరిచేలోగా మారిపోతుంది నాటకరంగం
ఎంత చిత్రమో తెలుసుకో ఈ ప్రపంచం
తెలుసుకుంటే నీ సొంతమే సమస్తం

ఎంత చిత్రమో తెలుసుకో ఈ ప్రపంచం
తెలుసుకుంటే నీ సొంతమే సమస్తం

One way One way జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదే మరి సాగిపొయే ప్రయాణం
ఎగుడు దిగుదు చూసుకోదిది పరుగు తీసే ప్రవాహం

నీ దారిలోన నవ్వు చిలకరించే మల్లెపువ్వులు
తీయతీయగానే నిన్ను గాయపరిచే తేనెటీగలెన్నో

ఎంత వింతని తెలుసుకో ప్రపంచం
అంతుతేలని సృస్టి లో రహస్యం
ఎంత వింతని తెలుసుకో ప్రపంచం
అంతుతేలని సృస్టి లో రహస్యం

Comments

Anonymous said…
Chaala baavundi ee pata..vinta thappakunda
Swapna said…
okkkk..movie lo songs and movie kooda chaala baagundhi..different story.
Sarath said…
Thank you very much for your effort in giving the lyrics for such beautiful songs.
I like especially the song one way one way. It was so informative and inspirational. This was one of the best songs of sirivennela. I hope you will continue your good work.
why dont you include enthavaraku song lyrics too?
Swapna said…
Thanku very much Sarath garu..I will post the lyrics of that song soon..

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki