Sirimalle puvva

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా.......

తెల్లరబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళారా చూద్దమంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు,నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడ నా సందమామ రాడే

చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడే

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా......

కొండల్లో కోనల్లో కూయన్న ఓ కొయిల
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెద
వయసంతా వలపై మనసే మైమరపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలై రేగేనే

చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడే

సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా .. .

http://youtube.com/watch?v=kY2cigdBuhQ

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu