Posts

Showing posts from March, 2011

E Shwasalo Cherithe

Image
వేణుమాధవా వేణుమాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో(2) ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై నిను చేరని మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువున నిలువున తొలిచిన గాయమునే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది వేణు మాధవా నీ సన్నిధి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలు వైపుల నడి రాతిరి ఎదురవదా అల్లన నీ అడుగులు సడి వినబడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా ఆ.. ఆ..ఆ ..ఆ...ఆ.. నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది నివాళిగా నా మది నివేదించు నిమిషమిది వేణు మాధవా నీ సన్నిధి గ గ రి గ రి స రి గ గ రి రి స రి గ ప ద సా స ద ప గ రి స రి గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా గ ప ద స స గ ప ద స స ద ప ద రి రి ద ప ద రి రి ద స రి గ రి స రి గ రి స రి గ రి గ రి స రి గా రి స ద ప గ గ గ పా పా ద ప

venuvai vacchanu bhuvanaaniki

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి (2) మమతలన్నీ మౌన గానం వాంఛలన్నీ వాయులీనం వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మాతృదేవోభవ(2) పితృదేవోభవ(2) ఆచార్యదేవోభవ(2) ఏడుకొండలకైన బండ తానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే (2) నీ కంటిలోని నలక లో వెలుగునీ కనక నేను మేననుకుంటే ఎద చీకటే హరే హరే హరే రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఏ నాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి (2) నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో (2) ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరే హరే హరే రేప్పనై ఉన్నాను నీ కంటికి పాపనై వస్తాను నీ ఇంటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికి http://www.youtube.com/watch?v=kyk71etu5mA

naalo nenenaa edho annaana

Image
నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా అలా సాగిపోతున్న నాలోనా ఎదేంటిలా కొత్త ఆలొచన మనసే నాది మాటే నీది నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా అవునో కాదో తడబాటుని అంతో ఇంతో గడి దాటనీ విడివిడిపోని పరదాని పలుకై రానీ ప్రాణాన్ని ఎదంతా పదల్లోన పలికేనా నా మౌనమే ప్రేమ ఆలాపన మనసే నాది మాటే నీది ఇదే మాయో నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా దైవం వరమై దొరికిందని నాలో సగమై కలిసిందని మెలకువ కాని హృదయాన్ని చిగురైపోని శిశిరాన్ని నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు నూరేళ్ళుగా ఎదిగిపొయాయిలా మనమే సాక్ష్యం మాటే మంత్రం ఇదే బంధం నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా http://www.youtube.com/watch?v=Te5TMx2BtF8

Desamate matham kaadoey

Image
దేశమంటే దేశమంటే మతం కాదోయ్ గతం కాదోయ్ అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ క్షుధ్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్రవ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్ దేశమంటే..... గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్ చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్ రాజధానుల రాజభవనపు రాసలీలలు కాదు కాదోయ్ అబలపై ఆంలాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్ పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్ సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బంధు కాదోయ్ ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్ దేశమంటే... దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ ఝరన ఝరన తరన తరన ఝరన ఝరన తరన తరన ప్రేమించు ప్రేమపంచు ప్రేమగా జీవించు (2) ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరునిగ ఆదరించు ప్రేమించు ప్రేమపంచు ప్రేమగా జీవించు హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు ప్రేమించు ప్రేమపంచు ప్రేమగా జీవించు క్రోధమెందుకు కరుణపంచు స్వార్ధమెందుకు సహకరించు పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు ప్రేమించు ప్రేమపంచు ప్రేమగా జీవించు మల్లెపూల వంటి బాలల తెల్లకాగితమంటి బ్రతుకులు రక్త చరితగ మారకుండ రక్ష

Mutyamanta pasupu

Image
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ(2) ముద్దు మురిపాలొలకు ముంగిళ్ళలోనా మూడు పువ్వులారు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ ఆరనైదోతనము ఏ చోటనుండు అరుగులలికే వారి అరచేతనుండు(2) తీరైన సంపద ఎవరింటనుండు (2) దినదినము ముగ్గున్న ముంగిళ్ళనుండు ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ కోటలో తులిసమ్మ కొలువున్న తీరు కోరి కొలిచే వారి కొంగు బంగారు(2) గోవు మలచ్మికి కోటి దండాలు (2) కోరినంత పాడి నిండు కడవల్లు ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ మొగడు మెచ్చిన చాల కాపురం లోన మొగలి పూల గాలి ముత్యాల వాన (2) ఇంటి ఇల్లలికి ఎంత సౌభాగ్యం(2) ఇంటిల్లిపాదికి అంత వైభొగం ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ ముద్దు మురిపాలొలకు ముంగిళ్ళలోనా మూడు పువ్వులారు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ http://www.youtube.com/watch?v=B0UG1gc3eCs

Vintunnava Vintunnava

0" alt="" /> పలుకులో నీ పేరే తలచుకున్నా పెదవుల అంచుల్లో అనుచుకున్నా మౌనముతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా విన్నా వేవేల వీణల సంతోషల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా తొలిసారి నీ మాతల్లో పులకింతల పదనిసలు విన్నా చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్నా(2) ఏమో ఏమో ఏమౌతుందో ఏదేమైనా నువ్వే చూసుకో విడువను నిన్నే ఇకపైనా వింటున్నావా ప్రియా గాలిలో తెల్ల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే నన్నే ఆపి నువ్వు రాసిన ఆ పాటలనే వింటున్నా తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా ఆధ్యంతం ఏదో అనుభూతి(2) అనవరతం ఇలా అందించేది గగనం కన్నా మునుపటిది భువనం కన్నా ఇది వెనుకటిది ప్రాణంతో పుట్టింది ప్రాణంగా మారే మనసే లేనిది ప్రేమా రా ఇలా కౌగిల్లలో నిన్ను దాచుకుంటా నీలో నెనై నిన్నే దారి చేసుకుంటా ఎవరీ కలువని చోటు

Chinukai varadai

Image
చినుకై వరదై సెలయేటి తరగై ఉరికే మదిని కడలల్లే కరిగించి కలిపేసుకున్నావు వరమై వలపై అనుకోని మలుపై కలలే చూపి కనుపాప కల మీద తొలి వేకువైనావు తీసే ప్రతి శ్వాస నీ తలపౌతున్నది రేగే ప్రతి ఆశ నువ్వు కావాలన్నది నా నీడ నను వీడి నిను చేరుకున్నది(2) చినుకై వరదై సెలయేటి తరగై తడిలేని నీరున్నదేమో సడిలేని ఎద ఉన్నదేమో నువులేక నేనున్న క్షణమున్నదా ? నాలోని ఏనాటి చెలిమో నిను చేరి మనిషైనదేమో ఈ వేళ నిన్నొదిలి రానన్నదా?? ఏ రూపము లేని అకాశమే నీవు ఆ నీలి వర్ణాలు నిను వీడలేవు ఏ బంధములేని ఆనందమే నీవు తోడొచ్చి నాకిపుడు తొలి బంధువైనావు ఆకాశమే నీతో అడుగేయమన్నది(2) చినుకై వరదై సెలయేటి తరగై మన వలపు కధ విన్నదేమో ఆ కలల కబురందెనేమో ప్రతి ఋతువు మధుమాసమౌతున్నది పసి తనపు లోగిళ్ళలోకి నీ మనసు నను లాగెనేమో నా వేలు నిను వీడనంటున్నది ఆరారు కాలాలు హరివిల్లు విరియని ఆ నింగి తారల్లే మన ప్రేమ నిలువనీ ఈ మనసు కొలువైన తొలి చోటే నీదని ఈ నా కలలు నిజమవగ ఆ నింగి నైన గెలవనీ లోకాలు కనలేని తొలి జంట మనదని(2) చినుకై వరదై సెలయేటి తరగై వరమై వలపై అనుకోని మలుపై http://www.youtube.com/watch?v=bE-thsaolNo

Ninne ninne koraa

Image
నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరచా (2) ప్రతి జన్మలోనా నీ ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే నచ్చావులే హో నచ్చావే నచ్చావులే అనుకొని అనుకోగానే సరాసరి ఎదురౌతావు వేరే పనే లేదా నీకు నన్నే వదలవు నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను మరువలేనే నిన్ను నేను గుర్తురానే నాకు నేను ఈ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగ నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరచా నీతో ఏదో చెప్పాలంటు పదే పదే అనిపిస్తుంది పెదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నది మనసునేమో దాచమంటే అస్సలేమి దాచుకోదు నిన్ను చూసి పొద్దు పోదు చూడకుంటే ఆశపోదు ఈ వైనం ఇంతకాలం నాలోనే లేదుగా నువ్వు చేసే ఇంద్రజాలం బరించేదెలా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరచా (2) ప్రతి జన్మలోనా నీ ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే నచ్చావులే హో నచ్చావే నచ్చావులే http://www.youtube.com/watch?v=zgKhE2JIK5U

Ninne ninne allukuni

Image
నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని నన్నే నీలొ కలుపుకొని కొలువుంచే మంత్రం నీవవని ప్రతి పూట పువ్వై పుడత నిన్నే చేరి మురిసేలా ప్రతి అనువు కోవెలనౌతా నువ్వే కొలువు తీరేలా నూరెళ్ళు నన్ను నీ నివేధనవని నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే తాళి కట్టి ఏలవలసిన దొరవూ నువ్వే రమణి చెరను దాటించే రామచంద్రుడా రాధ మదిని వేధించే శ్యామ సుందరా మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించె గంధం నేనవని ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా గంగ పొంగునాపగలిగిన కైలాసమా కొంగు ముడులలోన ఒదిగిన వైకుంఠమా ప్రాయమంత కరిగించి దారపొయనా ఆయువంత వెలిగించి హారతియ్యనా నిన్నే నిన్నే నిన్నే ఓ నిన్నే నిన్నే నిన్నే http://www.youtube.com/watch?v=pej59h5fmR4

Chinuku Chinuku

Image
చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికే సెలయేరు కలతో ఇలని దివితో భువిని కలిపేసే ఊహల జోరు నదులైనా ఎదలైనా స్వేచ్చలో ఒకే తీరు చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికే సెలయేరు కలతో ఇలని దివితో భువిని కలిపేసే ఊహల జోరు నదులైనా ఎదలైనా స్వేచ్చలో ఒకే తీరు చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికే సెలయేరు కలతో ఇలని దివితో భువిని కలిపేసే ఊహల జోరు నురగలు తరగలు తేలే ప్రవాహంలో కరిగిన కలువల తేనే సదా పంచుతూ ఒడుపులు మలుపులు తిరిగే ప్రయాణంలో కలిసిన వాగులతోనే జతై సాగుతూ పెరిగే పెరిగే నదిలా చిలిమే చేయగా ఎదిగే మనసే మనిషై మమతే పెంచగా అందించి ఆశించే స్నేహమే సుధాశ్రావం చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికే సెలయేరు కలతో ఇలని దివితో భువిని కలిపేసే ఊహల జోరు గలగల గమకం పాడే గళం తానై బిరబిర పరుగులు తీసే మహా పాదమై సరిసరి నటనలు ఆడే నదీ కాంత చివరికి కడలి అలల్లో అలా చేరదా ఉలుకై పలుకై కులుకై పులకింతై ఇలా గడిచే బ్రతుకే ఎపుడు చెరితై మోగదా తన గమ్యం తెలిసుంటే జీవితం అదే ధన్యం చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికే సెలయేరు కలతో ఇలని దివితో భువిని కలిపేసే ఊహల జోరు ఆఅ ఆఆ ఆఆ ఆఆ ఆఆ చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికే సెలయేరు కలతో ఇలని దివితో

Priya ninu chudalekha

Image
ప్రియ నిను చుడలేక ఊహలో నీ రూపు రాక నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా(2) ప్రియ నిను చుడలేక ఊహలో నీ రూపు రాక వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం ఉదయించే సూర్యున్నే నేనడిగాను నీ కుశలం అనుక్షణం నా మనసు తహతహలాడే ప్రతిక్షణం నీ కోసం విలవిలలాడే అనుదినం కలలలో నీ కధలే కనులకు నిదురలే కరువాయే ప్రియ నిను చుడలేక ఊహలో నీ రూపు రాక కోవెలలో కోరితిని నీ దరికి నను చేర్చమని దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని లేఖతో ముద్దయైన అందించరాద నిను గాక లేఖలనే పెదవంటుకోదా వలపులో నీ దరి చేరుటెలా ఊహల పడవలే చేర్చునులే ప్రియ నిను చుడలేక ఊహలో నీ రూపు రాక నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా(2) ప్రియ నిను చుడలేక ఊహలో నీ రూపు రాక http://www.youtube.com/watch?v=ZR8gVS43J9g

Konda konallo loyallo

Image
కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో (2) కోరి కోరి కూసింది కోయిలమ్మ కోరి కోరి కూసింది కోయిలమ్మ ఈ కోయిలమ్మా కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో గోదారి గంగమ్మా సాయల్లో నేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మోగంగా నీలి మబ్బు ఆడంగా నవ్వే మువ్వై మోగంగా ఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలె ఊరంగా (2) ఊపిరి ఊయలలూగంగా రేపటి ఆశలు తీరంగా తెనుగుతనం నోరూరంగా తేటగీతి గారాభంగా (2) తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో గోదారి గంగమ్మా సాయల్లో ఝుమ్మని తుమ్మెద తియ్యంగా కమ్మని రాగం తీయంగ జాజిమల్లె సంపెంగ జానపదాలే నింపంగా కమ్మని రాగం తీయంగ జానపదాలే నింపంగా చెట్టు పుట్టానెయ్యంగా చెట్టా పట్టాలెయ్యంగా (2) చిలక పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా(2) స్వరాలన్ని దీవించంగా సావాసంగా కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో లోయల్లో సాయల్లో లోయల్లో సాయల్లో http://www.youtube.com/watch?v=2e6DJwFS5Wc

Pranathi pranathi pranathi

Image
సరిగమ గమపమ గమ సరిరిస పమ గమ సరిస సరిగమ గమపమ గమ సరిరిస ప్రణతి ప్రణతి ప్రణతి ప మ ప మ గ మ స రి సా ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాధ జగతికి మ ప మ ప మ ప ని ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రథమకళా సృష్టికీ ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాధ జగతికీ పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా (2) పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి గ్రీం కారమా గ్రీం కారమా గిరుల శిరస్సులను జారే ఝరుల నడల అలజడి శ్రీం కారమా శ్రీం కారమా ఆ బీజాక్షర వితటికి అర్పించే జ్యోతలివే ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాధ జగతికీ పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొంగిన పదస్పందనా అది కవనమా మగమపపప మపపప నిపపప నిపపమమ మపపమమ అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా కంటి తుదల హరివింటి పొదల తళుకందిన రస వర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా మౌన శిలల చైతన్యమూర్తులుగా మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాధ జగతికి ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రథమకళా సృష్టికి ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాధ జగతికి http://www.youtub

Aanati neeyaraa

Image
ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతినీయరా దొరా సన్నిది చేరగా ఆనతినీయరా హరా (2) నీ ఆన లేనిదే గ్రహింప జాలునా వేదాల వాణితో విరించి విశ్వ నాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగ మాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమై (2) కదులునుగా సదా శివ ఆనతినీయరా హరా నినిస నిపనిపమగసగ ఆనతినీయరా హరా అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా పమపని పమపని పమపని గమపని సనిసగ సనిసగ సనిసగ పనిసగ గమగస నిపమ గమగస మగసని ఆనతి నీయరా జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా సాష్టాంగమున దండము చేతురా ఆనతినీయరా సానిప గమపనిపమ గమగ పప పప మపని పపప గగమ గస సస నిసగ సస సస సగ గస గప పమ పస నిస గసని సగ సగ సని సగ సగ పగ గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ ఆనతి నీయరా శంకర శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకుని విషపు నాగులను చంకనెత్తుకుని నిలకడ నెరుగని గంగ నేలియై వంక లేని నా వంక ఒక్క కడగంటి చూపు పడనీయవేమి ఈశ్వరుడా ఇంక సేవించుకొందురా ఆనతినీయరా పప పమప నినిపమగస గగ పప పమప నినిపమగస గగ గమపని గ మపనిస మ పనిసగ ని స ప ని మ ప గ మ స పప పమప నినిపమగస గగ గమపని గ మపనిస మ పనిసగ ని స ప ని మ ప గ మ స గ మ పప పమప నినిపమగస గగ గమపని గమపని స మ

Sruthi neevu gati neevu

Image
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి (2) ధృతి నీవు ధ్యుతి నీవు శరణాగతి నీవు భారతి (2) నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిఘమార్థ నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు నిధుల పెన్నిధి తప్ప చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ధ్యుతి నీవు శరణాగతి నీవు భారతి శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్పూర్థులే అల అన్నమాచార్య తలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే త్యాగయ్య గళసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీ భవ తారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ధ్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి http://www.youtube.com/watch?v=J-q-bAWQpvw

Pallavinchu toli raagame

Image
లలలలలలలల లలలల లలలల పల్లవించు తొలి రాగమే సుర్యోదయం పరవసించు ప్రియ గానమే చంద్రోదయం సరి కొత్తగ సాగు ఈ పాట విని గాలులు ఆడే సయ్యాట ఒక చల్లని చేయి చేయూత నా పాటల తీగ తొలి పూత నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం పల్లవించు తొలి రాగమే సుర్యోదయం పరవసించు ప్రియ గానమే చంద్రోదయం పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి కదిలే కలల సరిగమలే పాటలో మాధురి కలిసినవి కోయిలలెన్నో శ్రోతల వరుసలలో శిలలైన చిగురించును నా పల్లవి పలుకులలో ఇంద్రధనుస్సు సైతం తనలో రంగులని ఇప్పటికిప్పుడు సప్తస్వరాలుగ పలికెను నాతోనే పల్లవించు తొలి రాగమే సుర్యోదయం పరవసించు ప్రియ గానమే చంద్రోదయం బ్రతుకే పాటగా మారి బాటనే మార్చగా వెతికే వెలుగు లోకాలే ఎదురుగా చేరగా అణువణువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే అడుగడుగు ఆ స్వరములలో సిరులెన్నో చిలికే ఆలకించెనే కాలం నా ఆలాపననే పాటల జగతిని ఏలే రాణిగా వెలిగే శుభవేల పల్లవించు తొలి రాగమే సుర్యోదయం పరవసించు ప్రియ గానమే చంద్రోదయం సరి కొత్తగ సాగు ఈ పాట విని గాలులు ఆడే సయ్యాట ఒక చల్లని చేయి చేయూత నా పాటల తీగ తొలి పూత నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం రె