Thursday, March 24, 2011

Chinukai varadai


చినుకై వరదై సెలయేటి తరగై
ఉరికే మదిని కడలల్లే కరిగించి
కలిపేసుకున్నావు

వరమై వలపై అనుకోని మలుపై
కలలే చూపి కనుపాప కల మీద
తొలి వేకువైనావు

తీసే ప్రతి శ్వాస నీ తలపౌతున్నది
రేగే ప్రతి ఆశ నువ్వు కావాలన్నది

నా నీడ నను వీడి నిను చేరుకున్నది(2)

చినుకై వరదై సెలయేటి తరగై

తడిలేని నీరున్నదేమో
సడిలేని ఎద ఉన్నదేమో
నువులేక నేనున్న క్షణమున్నదా ?

నాలోని ఏనాటి చెలిమో
నిను చేరి మనిషైనదేమో
ఈ వేళ నిన్నొదిలి రానన్నదా??

ఏ రూపము లేని అకాశమే నీవు
ఆ నీలి వర్ణాలు నిను వీడలేవు
ఏ బంధములేని ఆనందమే నీవు
తోడొచ్చి నాకిపుడు తొలి బంధువైనావు

ఆకాశమే నీతో అడుగేయమన్నది(2)

చినుకై వరదై సెలయేటి తరగై

మన వలపు కధ విన్నదేమో
ఆ కలల కబురందెనేమో
ప్రతి ఋతువు మధుమాసమౌతున్నది
పసి తనపు లోగిళ్ళలోకి
నీ మనసు నను లాగెనేమో
నా వేలు నిను వీడనంటున్నది

ఆరారు కాలాలు హరివిల్లు విరియని
ఆ నింగి తారల్లే మన ప్రేమ నిలువనీ
ఈ మనసు కొలువైన తొలి చోటే నీదని
ఈ నా కలలు నిజమవగ ఆ నింగి నైన గెలవనీ

లోకాలు కనలేని తొలి జంట మనదని(2)

చినుకై వరదై సెలయేటి తరగై
వరమై వలపై అనుకోని మలుపై
http://www.youtube.com/watch?v=bE-thsaolNo

0 comments: