Monday, March 28, 2011

venuvai vacchanu bhuvanaaniki



వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి (2)

మమతలన్నీ మౌన గానం
వాంఛలన్నీ వాయులీనం

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

మాతృదేవోభవ(2)
పితృదేవోభవ(2)
ఆచార్యదేవోభవ(2)

ఏడుకొండలకైన బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే (2)

నీ కంటిలోని నలక లో వెలుగునీ కనక
నేను మేననుకుంటే ఎద చీకటే

హరే హరే హరే

రాయినై ఉన్నాను ఈ నాటికి
రామ పాదము రాక ఏ నాటికి

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి (2)

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో (2)

ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు

హరే హరే హరే

రేప్పనై ఉన్నాను నీ కంటికి
పాపనై వస్తాను నీ ఇంటికి

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోయాను గగనానికి
http://www.youtube.com/watch?v=kyk71etu5mA

0 comments: