Sruthi neevu gati neevu
శృతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతి (2)
ధృతి నీవు ధ్యుతి నీవు
శరణాగతి నీవు భారతి (2)
నీ పదములొత్తిన పదము ఈ పదము
నిత్య కైవల్య పదము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు
నిఘమార్థ నిధులున్న నెలవు
కోరిన మిగిలిన కోరికేమి
నిను కొనియాడు నిధుల పెన్నిధి తప్ప
చేరిన ఇక చేరువున్నదేమి
నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప
శృతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ధ్యుతి నీవు
శరణాగతి నీవు భారతి
శ్రీనాధ కవినాధ శృంగార
కవితా తరంగాలు నీ స్పూర్థులే
అల అన్నమాచార్య తలవాణి అలరించు
కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గళసీమ రావిల్లిన
అనంత రాగాలు నీ మూర్తులే
నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం
జననీ భవ తారక మంత్రాక్షరం
శృతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ధ్యుతి నీవు
శరణాగతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతి
http://www.youtube.com/watch?v=J-q-bAWQpvw
Comments