Vintunnava Vintunnava

0" alt="" />
పలుకులో నీ పేరే తలచుకున్నా
పెదవుల అంచుల్లో అనుచుకున్నా
మౌనముతో నీ మదిని బంధించా
మన్నించు ప్రియా

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
వింటున్నావా వింటున్నావా

విన్నా వేవేల వీణల సంతోషల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాతల్లో పులకింతల పదనిసలు విన్నా

చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా(2)

ఏమో ఏమో ఏమౌతుందో
ఏదేమైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైనా
వింటున్నావా ప్రియా

గాలిలో తెల్ల కాగితంలా
నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వు రాసిన
ఆ పాటలనే వింటున్నా

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
వింటున్నావా వింటున్నావా

ఆధ్యంతం ఏదో అనుభూతి(2)
అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భువనం కన్నా ఇది వెనుకటిది

ప్రాణంతో పుట్టింది ప్రాణంగా
మారే మనసే లేనిది ప్రేమా

రా ఇలా కౌగిల్లలో నిన్ను దాచుకుంటా
నీలో నెనై నిన్నే దారి చేసుకుంటా
ఎవరీ కలువని చోటులలోనా
ఎవరిని కలువని వేళలలోనా

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
వింటున్నావా వింటున్నావా

విన్నా వేవేల వీణల సంతోషల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాతల్లో పులకింతల పదనిసలు విన్నా

చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా(2)

http://www.youtube.com/watch?v=Bdta4heRIZQ

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu