Pallavinchu toli raagame
లలలలలలలల లలలల లలలల
పల్లవించు తొలి రాగమే సుర్యోదయం
పరవసించు ప్రియ గానమే చంద్రోదయం
సరి కొత్తగ సాగు ఈ పాట
విని గాలులు ఆడే సయ్యాట
ఒక చల్లని చేయి చేయూత
నా పాటల తీగ తొలి పూత
నాలుగు దిక్కుల నా చిరు పాటలు
అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కల సీమకు
సాగెను నా పయనం
పల్లవించు తొలి రాగమే సుర్యోదయం
పరవసించు ప్రియ గానమే చంద్రోదయం
పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి
కదిలే కలల సరిగమలే పాటలో మాధురి
కలిసినవి కోయిలలెన్నో శ్రోతల వరుసలలో
శిలలైన చిగురించును నా పల్లవి పలుకులలో
ఇంద్రధనుస్సు సైతం తనలో రంగులని
ఇప్పటికిప్పుడు సప్తస్వరాలుగ పలికెను నాతోనే
పల్లవించు తొలి రాగమే సుర్యోదయం
పరవసించు ప్రియ గానమే చంద్రోదయం
బ్రతుకే పాటగా మారి బాటనే మార్చగా
వెతికే వెలుగు లోకాలే ఎదురుగా చేరగా
అణువణువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే
అడుగడుగు ఆ స్వరములలో సిరులెన్నో చిలికే
ఆలకించెనే కాలం నా ఆలాపననే
పాటల జగతిని ఏలే రాణిగా వెలిగే శుభవేల
పల్లవించు తొలి రాగమే సుర్యోదయం
పరవసించు ప్రియ గానమే చంద్రోదయం
సరి కొత్తగ సాగు ఈ పాట
విని గాలులు ఆడే సయ్యాట
ఒక చల్లని చేయి చేయూత
నా పాటల తీగ తొలి పూత
నాలుగు దిక్కుల నా చిరు పాటలు
అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కల సీమకు
సాగెను నా పయనం
http://www.youtube.com/watch?v=Q5ZX6izEm80
Comments