Mutyamanta pasupu
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ(2)
ముద్దు మురిపాలొలకు ముంగిళ్ళలోనా
మూడు పువ్వులారు కాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ
ఆరనైదోతనము ఏ చోటనుండు
అరుగులలికే వారి అరచేతనుండు(2)
తీరైన సంపద ఎవరింటనుండు (2)
దినదినము ముగ్గున్న ముంగిళ్ళనుండు
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ
కోటలో తులిసమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచే వారి కొంగు బంగారు(2)
గోవు మలచ్మికి కోటి దండాలు (2)
కోరినంత పాడి నిండు కడవల్లు
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ
మొగడు మెచ్చిన చాల కాపురం లోన
మొగలి పూల గాలి ముత్యాల వాన (2)
ఇంటి ఇల్లలికి ఎంత సౌభాగ్యం(2)
ఇంటిల్లిపాదికి అంత వైభొగం
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ
ముద్దు మురిపాలొలకు ముంగిళ్ళలోనా
మూడు పువ్వులారు కాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ
http://www.youtube.com/watch?v=B0UG1gc3eCs
Comments