
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోనా
ఎదేంటిలా కొత్త ఆలొచన
మనసే నాది మాటే నీది
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
అవునో కాదో తడబాటుని
అంతో ఇంతో గడి దాటనీ
విడివిడిపోని పరదాని
పలుకై రానీ ప్రాణాన్ని
ఎదంతా పదల్లోన పలికేనా
నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాది మాటే నీది
ఇదే మాయో
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
దైవం వరమై దొరికిందని
నాలో సగమై కలిసిందని
మెలకువ కాని హృదయాన్ని
చిగురైపోని శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు
నూరేళ్ళుగా ఎదిగిపొయాయిలా
మనమే సాక్ష్యం మాటే మంత్రం
ఇదే బంధం
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
http://www.youtube.com/watch?v=Te5TMx2BtF8

0 comments:
Post a Comment