Wednesday, March 9, 2011

Pranathi pranathi pranathi


సరిగమ గమపమ గమ సరిరిస
పమ గమ సరిస
సరిగమ గమపమ గమ సరిరిస

ప్రణతి ప్రణతి ప్రణతి
ప మ ప మ గ మ స రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాధ జగతికి
మ ప మ ప మ ప ని
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రథమకళా సృష్టికీ
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాధ జగతికీ

పూల ఎదలలో పులకలు పొడిపించే
భ్రమరరవం ఓం కారమా
సుప్రభాత వేదికపై సుఖపిఖాతి
కలరవం ఐం కారమా (2)

పైరు పాపలకు జోలలు పాడే
గాలుల సవ్వడి గ్రీం కారమా
గ్రీం కారమా

గిరుల శిరస్సులను జారే
ఝరుల నడల అలజడి శ్రీం కారమా
శ్రీం కారమా

ఆ బీజాక్షర వితటికి అర్పించే జ్యోతలివే

ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాధ జగతికీ

పంచభూతముల పరిష్వంగమున
ప్రకృతి పొంగిన పదస్పందనా
అది కవనమా
మగమపపప మపపప నిపపప నిపపమమ మపపమమ
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ
సంచలన కేళనా అది నటనమా
అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన
రస వర్ణ లేఖనా అది చిత్రమా
అది చిత్రమా
మౌన శిలల చైతన్యమూర్తులుగా
మలచిన సజీవ కల్పనా అది శిల్పమా
అది శిల్పమా

అది శిల్పమా అది శిల్పమా

ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే

ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాధ జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రథమకళా సృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాధ జగతికి

http://www.youtube.com/watch?v=GWlC0wEz8UU

0 comments: