E Shwasalo Cherithe

వేణుమాధవా వేణుమాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో(2) ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై నిను చేరని మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువున నిలువున తొలిచిన గాయమునే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది వేణు మాధవా నీ సన్నిధి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలు వైపుల నడి రాతిరి ఎదురవదా అల్లన నీ అడుగులు సడి వినబడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా ఆ.. ఆ..ఆ ..ఆ...ఆ.. నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది నివాళిగా నా మది నివేదించు నిమిషమిది వేణు మాధవా నీ సన్నిధి గ గ రి గ రి స రి గ గ రి రి స రి గ ప ద సా స ద ప గ రి స రి గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా గ ప ద స స గ ప ద స స ద ప ద రి రి ద ప ద రి రి ద స రి గ రి స రి గ రి స రి గ రి గ రి స రి గా రి స ద ప గ గ గ పా పా ద ప ద ద ద గ స ద స స గ ప ద స రి స రి స రి స ద స రి గ ద స ప గ రి ప ద ప ద స రి స రి గ ప ద రి స గ ప ద ప స గ స ప ద ప స గ స ప ద ప రి స రి ప ద ప రి స రి ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ స రి గ ప ద రి గా రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి http://www.youtube.com/watch?v=baEukKPlr_U

Comments

Popular posts from this blog

Eppudu oppukovaddura otami...

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki