Monday, March 28, 2011

Desamate matham kaadoey


దేశమంటే దేశమంటే

మతం కాదోయ్ గతం కాదోయ్
అడవి కాదోయ్ గొడవ కాదోయ్
అన్న చేతి గన్ను కాదోయ్

క్షుధ్ర వేదం పాడుతున్న
ఉగ్రవాదం కాదు కాదోయ్
తీవ్రవ్యాధిగ మారుతున్న
తీవ్రవాదం కాదు కాదోయ్

దేశమంటే.....

గడ్డి నుండి గగనమంటిన
కుంభకోణం కాదు కాదోయ్
చట్ట సభలో పట్టుకున్న
జుట్టు జుట్టు కాదు కాదోయ్

రాజధానుల రాజభవనపు
రాసలీలలు కాదు కాదోయ్
అబలపై ఆంలాన్ని చల్లే
అరాచకమే కాదు కాదోయ్

పరిధి దాటిన గాలి వార్తల
ప్రసారాలు కాదు కాదోయ్
సందు దొరికితే మంది చేసే
సమ్మె కాదోయ్ బంధు కాదోయ్

ప్రాణ ధన మానాలు తీసే
పగల సెగల పొగలు కాదోయ్

దేశమంటే...
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్

ఝరన ఝరన తరన తరన
ఝరన ఝరన తరన తరన

ప్రేమించు ప్రేమపంచు ప్రేమగా జీవించు (2)

ద్వేషమెందుకు సాటి మనిషిని
సోదరునిగ ఆదరించు

ప్రేమించు ప్రేమపంచు ప్రేమగా జీవించు

హింసలెందుకు సమస్యలను
నవ్వుతో పరిష్కరించు

ప్రేమించు ప్రేమపంచు ప్రేమగా జీవించు

క్రోధమెందుకు కరుణపంచు
స్వార్ధమెందుకు సహకరించు
పంతమెందుకు పలకరించు
కక్షలెందుకు కౌగిలించు

ప్రేమించు ప్రేమపంచు ప్రేమగా జీవించు

మల్లెపూల వంటి బాలల
తెల్లకాగితమంటి బ్రతుకులు
రక్త చరితగ మారకుండ
రక్ష కలిగించు

కొత్త బంగరు భవిత నేడే కానుకందించు

ప్రేమించు ప్రేమపంచు ప్రేమగా జీవించు

దేశమంటే...
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
http://www.youtube.com/watch?v=cV-Akqt3pOw

0 comments: