Jallanta kavvinta kaavalile

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరకలు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపుల ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే వాగులు వంకలు జలజల చిలిపిగా పిలిచినా గాలులు వానలు చిటపట చినుకులే చిలికినా మనసు ఆగదు ఇదేమి అల్లరో తనువు దాగదు అదేమి తాకిడో కోనచాటు కొండవల్లే లేనివంక ముద్దులాడి వెళ్ళడాయే కళ్ళులేని దేవుడెందుకో మరి జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరకలు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపుల ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలపగా తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా వాన దేవుడే కళ్ళాపి జల్లగా మాయ దేవుడే ముగ్గెసి వెళ్ళగా నీలిమంట గుండెలోఅని ఆశలన్ని తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరికోసమో జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరకలు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపుల ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే http://youtube.com/watch?v=NP6F9ApUZ2w