pillagaali allari


పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేన
కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేన
ఎల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికి మా కళ్ళలో, వాకిళ్ళలో
వేవేల వర్ణాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగ మెరిసే సమయాన
అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా

మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా గారంగ పిలిచేనా
ఝల్లు మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా
ఇంద్ర జాలమై వినోదాల సుడిలొ కాలాన్ని కరిగించగా
చంద్ర జాలమై తారంగాల వొడిలో యెల్లన్ని మురిపించగ

తారలన్ని తోరణాలై వారాల ముత్యాల హారలయ్యెన
చందనాలు చిలికేనా ముంగిల్లొ నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైన, మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

నవ్వుల్లొ హాయి రాగం మువ్వల్లొ వాయు వేగం
ఎమైందొ ఇంత కాలం ఇంతమంది బృంద గానం
ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం

పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతి ఝల్లుగా స్వరాలెన్నొ పలికె సరికొత్త రాగాలుగా
నింగి దాక పొంగి పోగా హోరెత్తి పొతున్న గానా బజాన
చెంగు మంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా
అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా

http://www.youtube.com/watch?v=QEcVhYMUUjk

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki