Aliveni Animutyamaa


అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా
అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా

ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతివాన లేత ఎండలో జాలి నవ్వు జాజి దండలు

అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణ ముత్యమా

జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో జాజి మల్లి పూల దండలు

అలివేణి ఆణిముత్యమా

కుదురైన బొమ్మకి కులుకు మల్లె రెమ్మకి
కుదురైన బొమ్మకి కులుకు మల్లె రెమ్మకి
నుదుట ముద్దు పెట్టనా ముద్దుగా
వద్దంటే ఒట్టుగా

అందాల అమ్మకి కుందనాల కొమ్మకి
అందాల అమ్మకి కుందనాల కొమ్మకి
అడుగు మడుగులొత్తనా మెత్తగా
అవునంటే తప్పుగా

అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణ ముత్యమా

పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి
పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి
పొగడ దండలల్లుకోనా పూజలా
పులకింతల పూజగా

తొలిజన్మల నోముకి దొరనవ్వుల సామికి
తొలిజన్మల నోముకి దొరనవ్వుల సామికి
చెలిమై నేనుండిపోనా చల్లగా
మరుమల్లెలు చల్లగా

అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతివాన లేత ఎండలో జాలి నవ్వు జాజి దండలు

అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణ ముత్యమా

http://telugusongs.allindiansite.com/mudda_mandaram.html

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Eppudu oppukovaddura otami...