Idhi paata kaane kaadhu



ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు

వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది

ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు

ఒంటరిగా తిరుగాడు లేడిని ఒక మనిషి చూసినాడు
చెంతకు చేరదీసినాడు
అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది
తన హృదయం పరిచింది
ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్దపులని
తను బలి అయిపోతినని

ఆ లేడి గుండె కోత నా గాధకు శ్రీకారం
నే పలికే ప్రతి మాట స్త్రీ జాతికి సందేశం

ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు

ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు
కామాంధులు ఉన్నారు
వారి చేతిలో వందలు వేలు బలి అవుతున్నారు
అబలలు బలి అవుతున్నారు

నిప్పులు చేరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికి
చల్లారేదెప్పటికి
ఆ మంటలారుదాకా నా గానమాగిపోదు
ఆ రోజు వచ్చు దాకా నా గొంతు మూగబోదూ

ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు

వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది

ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki