Raali poye puvva neeku...

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే ,తొటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే ,లొకమెన్నడో చీకటాయెలే

నీకిది తెలవారని రేయమ్మా,కలికి మాచిలక పాడకు నిన్నటి నీ రాగం

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే ,తొటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే ,లొకమెన్నడో చీకటాయెలే

చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా ఆ ఆ ఆ ఆ
తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా
సింధుర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై ఆశలకే హారతివై

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే ,తొటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే ,లొకమెన్నడో చీకటాయెలే

అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే ఆ ఆ
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలు కొండెక్కి పోయే
పగిలే ఆకశం నీవై జారిపదే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే ,తొటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే ,లొకమెన్నడో చీకటాయెలే

http://www.youtube.com/watch?v=f1C32VqG32E

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Eppudu oppukovaddura otami...