okkasaari cheppaleva


ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ

వెన్నేలేదో వేకువేదో నీకు తెలుసా మరి
నిదుర పొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని

చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని
చేయి చాచి పిలవద్దని చంటిపాపలకి చెబుతామా
లేని పోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని
జన్మలోనే నిదరోకు అని కంటిపాపలకి చెబుతామా

కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని

మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ

అందమైన హరివిల్లులతో వంతెనేసి విరిజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో అలుపు లేని తన అలజడితో
కెరటమెగిరి పడుతుంటే ఆకాశం తెగి పడుతుందా

మనసుంటే మార్గం ఉంది కదా
అనుకుంటే అందనిదుంటుందా

అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ

వెన్నేలేదో వేకువేదో నీకు తెలుసా మరి
నిదుర పొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి

http://www.youtube.com/watch?v=0G_y5dvxqAs

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Eppudu oppukovaddura otami...