lokaale gelavaga nilichina snehaala viluvalu telisina


లోకాలే గెలవగ నిలిచిన
స్నేహాల విలువలు తెలిసిన
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

కాలాన్నే కదలక నిలిపిన
ఆకాశం భూమిని కలిపిన
ఏదైన వెనకన నువ్వేగా

ఎన్నెన్నో వరములు కురిసిన
గుండెల్లో వలపై ఎగసిన
ఈ ఆనందం నీ చిరునవ్వేగా

నీతోనే కలిసిన క్షణమున
నాలోని అణువణువణువున
నీవే నీవే నీవుగా

లోకాలే గెలవగ నిలిచిన
స్నేహాల విలువలు తెలిసిన
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

ఈ పువ్వు కోరిందిగా
ప్రేమాభిషేకాలనే
నా చూపు పంపిందిగా
పన్నీటి మేఘాలనే

బుగ్గపై చిరు చుక్కవై ,జుట్టువై, సిరి బొట్టువై
నాతోనే నువ్వుండిపో
ఊపిరై ,ఎద తీపినై ,ఊపునై ,కనుచూపునై
నీలోనే నేనుంటినే

నీ రామచిలుకని నేనై నా రామచంద్రుడు నీవై
కలిసే వుంటే అంతే చాలురా

లోకాలే గెలవగ నిలిచిన
స్నేహాల విలువలు తెలిసిన
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

కాలాన్నే కదలక నిలిపిన
ఆకాశం భూమిని కలిపిన
ఏదైన వెనకన నువ్వేగా

ఈ రాధ బృందావనం
సుస్వాగతం అందిరా

నా ప్రేమ సింహాసనం
నీ గుండెలో ఉన్నదే

పక్కగా రారమ్మని కమ్మగా ముద్దిమ్మని
ఎన్నాళ్ళు కోరాలి రా
ఎప్పుడు కనురెప్పలా చప్పుడై ఎద లోపల
ఉంటూనే ఉన్నానుగా

సన్నాయి స్వరముల మధురిమ
పున్నాగ పువ్వుల ఘుమఘుమ
అన్ని నీవై నన్నే చేరరా

కాలాన్నే కదలక నిలిపిన
ఆకాశం భూమిని కలిపిన
ఏదైన వెనకన నువ్వేగా

http://www.youtube.com/watch?v=lUta0FkMArs

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Eppudu oppukovaddura otami...