aakaasam digi vachi

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరచిన తరుణం
ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం

మా ఇల్ల లేత మామిల్ల తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన దీర్ఘాలులే

చెంపలో విరబూసే అమ్మయి సిగ్గు దొంతరలు
ఆ సొంపులకు ఎరవేసే అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో

తన సరసన విరిసిన సిరి సిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా

ధీంతక ధీంతక ధీంతక తకధీం
ధీంతక ధీంతక ధీంతక తకధీం

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు
సందు చూసి చకచక ఆడే జూద శిఖామనులు
పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు

తమ నిగనిగనగలను పదుగురి ఎదుట ఇదిగిదిగో అని చూపెడుతు
తెగ తిరిగే తరణుల తికమక పరుగులు చూడగా

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరచిన తరుణం
ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం

మా ఇల్ల లేత మామిల్ల తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన దీర్ఘాలులే
http://www.youtube.com/watch?v=fBqmIbOwPLI

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki