Gama gama hungaama


గామగామ హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని కాలి చేద్దామా
గామగామ హంగామా కస్టం ఖర్చుపెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

నీ రాకతో రాయిలాంటి నా జీవితానికి జీవం వచ్చింది
నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది
చేయూతతో శిల్పం కాస్తా నడకలు నేర్చి కోవెల చేరింది
నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పం లోనే కోరిక పెరిగింది
ఆ కొరికేమిటో చెప్పనీ
నను వీది నువ్వు వెళ్ళొద్దని
మళ్ళీ రాయిని చేయ్యొద్దని

గామగామ హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని కాలి చేద్దామా

నీ మాటతో నాపై నాకే తెలియని నమ్మకమొచ్చింది
నీ స్పూర్తితో ఎంతో ఎంతో సాదించాలని తపనే పెరిగింది
నీ చెలిమితో ఊహల్లోనా ఊరిస్తున్నా గెలుపే అందింది
ఆ గెలుపుతో నిస్పృహ లోన నిదురిస్తున్న మనసే మురిసింది
ఆ మనసు అలసిపోదని
ఈ చెలిమి నిలిచిపోవాలని
ఇలా బ్రతుకుని గెలవాలని

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Eppudu oppukovaddura otami...

janaki ramula kalyananiki