Ghallu ghallumani sirimuvvalle


ఘల్లుఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా
ఝల్లుఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా

ఘల్లుఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా
ఝల్లుఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా
హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగల్లు తాకి కడగల్లే తీరని

జడి వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా

జడి వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా

ఘల్లుఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా
ఝల్లుఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా

రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పనీ
ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపని
అన్నెం పున్నెం ఎరుగని మా సీమకి రా రమ్మని
ఆహ్వానం అందించనీ మెరిసే చూపుని

తొలగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వనీ
చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లనీ
ఆశా సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా
శాంతి మంత్రమై గాలంతా దిశలన్ని అల్లనీ ఈ వేళ

జడి వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా

భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకరా
ఆకశాన్నె ఇల దించరాకురిసే వానగా
మారని యాతన తీర్చగా మా తల రాతలు మార్చగా
ఈ జల యజ్ఞం సాక్షిగాతలనే వంచరా

మహరాజు తానే సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా
భొగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా
జన క్షేమమే తన సంకల్పంగా తన ఊపిరే హోమ జ్వాలలుగా
స్వర్గాన్నే శాసించెనుగా అమృతాన్ని ఆహ్వానించెనుగా

జడి వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా

ఘల్లుఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా
ఝల్లుఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా
హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగల్లు తాకి కడగల్లే తీరని

జడి వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా

http://www.youtube.com/watch?v=8MZHmV0wtug

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki