Allanta dooraala


అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా

అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా
గుండెల్లో కొలువుండగా

భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
ఈమెలా ఉన్న ఏ పోలికా

అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా
గుండెల్లో కొలువుండగా

అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా

కన్యాదానం గా ఈ సంపద
చేపట్టే వరుడు శ్రీహరి కాదా
పొందాలనుకున్నా పొందే వీలుందా '
అందరికి అందనిది ఈ సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత
పచ్చగ పెంచిన పూలత
నిత్యం విరిసే నందనమవదా

అందానికే అందమనిపించగా
దిగి వచ్చెనో ఏమొ దివి కానుక

అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా
గుండెల్లో కొలువుండగా

తన వయ్యారంతో ఈ చిన్నది
లాగిందో ఎందరిని నిలబడనీయక
ఎన్నో వొంపుల్తో పొంగే ఈళ్ళని
తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుక

తొలి పరిచయమొక తీయని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా
చెలి జీవితం వెలిగించగా

అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
http://www.youtube.com/watch?v=__7Lvcd5kzE

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki