Hrudayaanjali

మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొలి భూపాళం

పచ్చదనాల పానుపుపైనా అమ్మై నేల జోకొడుతుంటే

పున్నమి నదిలో విహరించాలి పువ్వుల ఒళ్ళో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి తొలకరి జల్లై దిగి రావాలి\
తారల పొదరింట రాతిరి మజిలి
వేకువ వెనువెంట నేలకు తరలి కొత్త స్వెచ్చకందించాలి నా హృదయాంజలి
మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొలి భూపాళం
వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇస్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడు నా సొంతం

ఊహలు నీవే ప్రాణం పోసి చూపవే దారి ఓ చిరుగాలి
కలలకు సైతం సంకెల వేసి కలిమి ఎడారి దాటించాలి
తుంటరి తూనిగవై తిరగాలి
దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి పేద గరికపూలకు ఇస్తా నా హృదయాంజలి
మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొలి భూపాళం
మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొలి భూపాళం
పచ్చదనాల పానుపుపైనా అమ్మై నేల జోకొడుతుంటే
పచ్చదనాల పానుపుపైనా అమ్మై నేల జోకొడుతుంటే
మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొలి భూపాళం
వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇస్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడు నా సొంతం
వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇస్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడు నా సొంతం

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki