Nindu noorella saavasam
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం
దండు గుచ్చోను నా ప్రాణం
వెండి ఎన్నెల్లో కల్యాణం
ఈ రీతులు,గీతలు సెరిపేయాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాములే
నిండు నూరేళ్ళ సావాసంస్వర్గమవ్వాలి వనవాసం
సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో
అచ్చ తెలుగు పుచ్చ పూల పున్నమేనులే
రెల్లు కప్పు నేసినా ఇంద్రధనసు ఊరిలో రేయి పగలు ఒక్కటేలే రెప్ప పడదులే
ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు
సల్ల గాలులా పల్లకీలో సుక్కసుక్కని సుట్టివద్దమా
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం
ఈ రీతులు,గీతలు సెరిపేయాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాములే
వర్జమంటూ లేదులే రాహుకాలమేదిలే
రాసి లేదు వాసి లేదు తిధులు లేవులే
అతిధులంటు లేరులే మనకి మనమే చాలులే
మాసి పోని బాసలన్ని బాసికాలులే
ఏ ఈడుపు దిగి రాడులే
మన కూడికే మన తోడులే
ఇసుక దోసిలే తలంబ్రాలుగా
తలలు నింపగా మనువు జరిగెలే
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం
http://www.youtube.com/watch?v=ZeXfQjOkzFo
Comments