Jallanta kavvinta kaavalile


జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరకలు పరుగులు ఉడుకు వయసు
దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపుల ఉలికిపడిన కలికి సొగసు

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

వాగులు వంకలు జలజల చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపట చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండవల్లే లేనివంక ముద్దులాడి
వెళ్ళడాయే కళ్ళులేని దేవుడెందుకో మరి

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరకలు పరుగులు ఉడుకు వయసు
దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపుల ఉలికిపడిన కలికి సొగసు

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలపగా
తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా
వాన దేవుడే కళ్ళాపి జల్లగా
మాయ దేవుడే ముగ్గెసి వెళ్ళగా
నీలిమంట గుండెలోఅని ఆశలన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరికోసమో

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరకలు పరుగులు ఉడుకు వయసు
దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపుల ఉలికిపడిన కలికి సొగసు

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

http://youtube.com/watch?v=NP6F9ApUZ2w

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Eppudu oppukovaddura otami...