Haayigaa undadhaa


హాయిగా ఉండదా ప్రేమనే భావన
మనసుతో మనసుకే వేయదా వంతెన

కదిలే వెలుగుల వెంట మమతే వెలుగై రాదా
కనుపాపకి రెప్పలా కాపలా కాయదా
పెదవంచుపై నవ్వులా సంతకం చేయదా

ఈ ప్రేమ లోతెంతని అడగద్దు ఓ మిత్రమా
ఈ ప్రేమ ఘన చరితని వర్ణించటం సాధ్యమా

హాయిగా ఉండదా ప్రేమనే భావన
మనసుతో మనసుకే వేయదా వంతెన

మనసంటూ నీకుంటే అది ఇచ్చేటందుకే
ప్రేమంటు ఒకటుంది అది పంచేటందుకే
ప్రేమించేందుకొక క్షణమే చాలు
మొదలవుతుంధి తొలి సంబరం
ప్రేమను మరచి పోదాము అంటే
సరిపోదేమో ఈ జీవితం

జత కలసి కనులు కనులు
ప్రతిదినము కలలు మొదలు
ఒక చినుకులాగ మొదలయిన ప్రేమ
అంతలో సంద్రమై పొంగదా

ఆపాలన్నా అనచాలన్నా వీలే కాదుగా

హాయిగా ఉండదా ప్రేమనే భావన
మనసుతో మనసుకే వేయదా వంతెన

ఎదనిండా ప్రేముంటే ఏముంది కానిది
కలకాలం తోడుండే గుణమేగా ప్రేమది
చుట్టం లాగ వచ్చెళ్ళిపోయే మజిలి కాదు ప్రేమది
గుండెల్లోకి ఓ సారి వస్తే గుమ్మం దాటి పోదే ఇది

ఇక ఒకరినొకరు తలచి
బ్రతికుండలేరు విడిచి
అసలైన ప్రేమ రుజువైన చోట
ఇక అనుదినం అద్భుతం జరగదా

నీకేం కాదు నేనున్నానని హామి ఇవ్వదా

హయీగా ఉండదా ప్రేమనే భావన
మనసుతో మనసుకే వేయదా వంతెన

నిజమైన ప్రేమంటే ఏ స్వార్ధం లేనిది
కస్టాన్నే ఇస్టంగా భావిస్తానంటది
పంచేకొద్ది పెరిగేది ప్రేమ అర్ధం కాని సూత్రం ఇది
కల్లోలాని ఎదురీదుకుంటు తీరం చేరు నావే ఇది

నీ దిగులు తనకి దిగులు
నీ గెలుపు తనకి గెలుపు
నీ సేవలోనే తలమునకలయ్యి
నీ తండ్రిగా అన్నగా మారగా

నీ వెనకాలే సైన్యం తానై నడిపించేనుగా

హయీగా ఉండదా ప్రేమనే భావన
మనసుతో మనసుకే వేయదా వంతెన



Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki