Posts

Showing posts from March, 2008

Jallanta kavvinta kaavalile

Image
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరకలు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపుల ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే వాగులు వంకలు జలజల చిలిపిగా పిలిచినా గాలులు వానలు చిటపట చినుకులే చిలికినా మనసు ఆగదు ఇదేమి అల్లరో తనువు దాగదు అదేమి తాకిడో కోనచాటు కొండవల్లే లేనివంక ముద్దులాడి వెళ్ళడాయే కళ్ళులేని దేవుడెందుకో మరి జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరకలు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపుల ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలపగా తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా వాన దేవుడే కళ్ళాపి జల్లగా మాయ దేవుడే ముగ్గెసి వెళ్ళగా నీలిమంట గుండెలోఅని ఆశలన్ని తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరికోసమో జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరకలు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపుల ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే http://youtube.com/watch?v=NP6F9ApUZ2w

Ghallu ghallumani sirimuvvalle

Image
ఘల్లుఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా ఝల్లుఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లుఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా ఝల్లుఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ నిలువెల్ల మంచు వడగల్లు తాకి కడగల్లే తీరని జడి వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడి వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా ఘల్లుఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా ఝల్లుఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పనీ ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపని అన్నెం పున్నెం ఎరుగని మా సీమకి రా రమ్మని ఆహ్వానం అందించనీ మెరిసే చూపుని తొలగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వనీ చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లనీ ఆశా సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్ని అల్లనీ ఈ వేళ జడి వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకరా ఆకశాన్నె ఇల దించరాకురిసే వానగా మారని యాతన తీర్చగా మా తల రాతలు మార్చగా ఈ జల య

Raama chakkani seetaki

Image
నీల గగనా ఘనవిచలనా ధరణిజా శ్రీ రమణ మధుర వదనా నళిన నయనా మనవి వినరా రామా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకి ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటె చూడలేదని పెదవి చెప్పె చెప్పలేమని కనులు చెప్పే నల్లపూసైనాడు దేవుడు నల్లనీ రఘురాముడు రామ చక్కని సీతకి చుక్కనడిగా దిక్కునడిగా చేమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచె చూసుకోమని మనసు తెలిపె మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంక యెవరు మొగుడంట ఇందువదనా కుందరదనా మందగమనా భామా ఎందువలన ఇందువదనా ఇంతమదనా ప్రేమా

Oosulaade oka jaabilata

Image
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట అందాలే చిందె చెలి రూపం నా కోసం ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం అదే పేరు నేను జపించేను రొజూ ననే చూసేటి వేళ అలై పొంగుతాను మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట నాలోన రేగేనే పాట చెలి పాట నీడల్లే సాగే నీ వెంట తన వెంట స్వరాలై పొంగేనా వరాలే కోరేనా ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా ఒకటై ఆడు ఒకటై పాడు పండగ నాకు ఏనాడు ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట http://www.youtube.com/watch?v=u-7-kiecEBo

Allanta dooraala

Image
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలికా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా కన్యాదానం గా ఈ సంపద చేపట్టే వరుడు శ్రీహరి కాదా పొందాలనుకున్నా పొందే వీలుందా ' అందరికి అందనిది ఈ సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవదా అందానికే అందమనిపించగా దిగి వచ్చెనో ఏమొ దివి కానుక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీయక ఎన్నో వొంపుల్తో పొంగే ఈళ్ళని తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుక తొలి పరిచయమొక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా http://www.youtube.com/watch?v=__7Lvcd5kzE

Haayigaa undadhaa

Image
హాయిగా ఉండదా ప్రేమనే భావన మనసుతో మనసుకే వేయదా వంతెన కదిలే వెలుగుల వెంట మమతే వెలుగై రాదా కనుపాపకి రెప్పలా కాపలా కాయదా పెదవంచుపై నవ్వులా సంతకం చేయదా ఈ ప్రేమ లోతెంతని అడగద్దు ఓ మిత్రమా ఈ ప్రేమ ఘన చరితని వర్ణించటం సాధ్యమా హాయిగా ఉండదా ప్రేమనే భావన మనసుతో మనసుకే వేయదా వంతెన మనసంటూ నీకుంటే అది ఇచ్చేటందుకే ప్రేమంటు ఒకటుంది అది పంచేటందుకే ప్రేమించేందుకొక క్షణమే చాలు మొదలవుతుంధి తొలి సంబరం ప్రేమను మరచి పోదాము అంటే సరిపోదేమో ఈ జీవితం జత కలసి కనులు కనులు ప్రతిదినము కలలు మొదలు ఒక చినుకులాగ మొదలయిన ప్రేమ అంతలో సంద్రమై పొంగదా ఆపాలన్నా అనచాలన్నా వీలే కాదుగా హాయిగా ఉండదా ప్రేమనే భావన మనసుతో మనసుకే వేయదా వంతెన ఎదనిండా ప్రేముంటే ఏముంది కానిది కలకాలం తోడుండే గుణమేగా ప్రేమది చుట్టం లాగ వచ్చెళ్ళిపోయే మజిలి కాదు ప్రేమది గుండెల్లోకి ఓ సారి వస్తే గుమ్మం దాటి పోదే ఇది ఇక ఒకరినొకరు తలచి బ్రతికుండలేరు విడిచి అసలైన ప్రేమ రుజువైన చోట ఇక అనుదినం అద్భుతం జరగదా నీకేం కాదు నేనున్నానని హామి ఇవ్వదా హయీగా ఉండదా ప్రేమనే భావన మనసుతో మనసుకే వేయదా వంతెన నిజమైన ప్రేమంటే ఏ స్వార్ధం లేనిది కస్టాన్నే ఇస్టంగా భావిస్తానంటది పంచేకొ

Gama gama hungaama

Image
గామగామ హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని కాలి చేద్దామా గామగామ హంగామా కస్టం ఖర్చుపెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా నీ రాకతో రాయిలాంటి నా జీవితానికి జీవం వచ్చింది నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది చేయూతతో శిల్పం కాస్తా నడకలు నేర్చి కోవెల చేరింది నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పం లోనే కోరిక పెరిగింది ఆ కొరికేమిటో చెప్పనీ నను వీది నువ్వు వెళ్ళొద్దని మళ్ళీ రాయిని చేయ్యొద్దని గామగామ హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని కాలి చేద్దామా నీ మాటతో నాపై నాకే తెలియని నమ్మకమొచ్చింది నీ స్పూర్తితో ఎంతో ఎంతో సాదించాలని తపనే పెరిగింది నీ చెలిమితో ఊహల్లోనా ఊరిస్తున్నా గెలుపే అందింది ఆ గెలుపుతో నిస్పృహ లోన నిదురిస్తున్న మనసే మురిసింది ఆ మనసు అలసిపోదని ఈ చెలిమి నిలిచిపోవాలని ఇలా బ్రతుకుని గెలవాలని http://www.youtube.com/watch?v=UYRhWiJEyG8

Chitapata chinukulu

Image
చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే ఐతే తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే అడ్డు చెప్పదే umbrella ఎపుడు ఓ వాన నువ్వొస్తానంటే నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలిబాబా ఉంటే ఉంటే అడిగిన తరుణమే పరుగులు తీసే alladin genie ఉంటే చూపదా మరి ఆ మాయా దీపం మన fate యే flight అయ్యే runway నడి రాత్రే వస్తావే స్వప్నమా పగలంతా ఏం చేస్తావు మిత్రమా ఊరికినే ఊరిస్తే న్యాయమా సరదాగ నిజమైతే నష్టమా mona lisa మొహమ్మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా ఇలా రావా..... వేకువనే మురిపించే ఆశలు వెను వెంటే అంతా నిట్టూర్పులు లోకంలో లేవా ఏ రంగులు నలుపొకటే చూపాలా కన్నులు ఇలాగేనా ప్రతి రోజూ ఎలాగైనా ఏదో రోజు మనదై రాదా చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే ఐతే తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే అడ్డు చెప్పదే umbrella ఎపుడు ఓ వాన నువ్వొస్తానంటే http://youtube.com/watch?v=pgdJXeYazeQ

Emaindhi ee vela

Image
ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేల మిల మిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పొయెనేల ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత మోహం మరువలేని ఇంద్రజాలం వాన లోన ఇంత దాహం చినుకులలొ వాన విల్లు నేలకిలా జారెనే తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే తన సొగసే తీగ లాగ నా మనసే లాగెనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే నిశీధిలొ ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేల మిల మిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పొయెనేల ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసెనా తన నడుము వంపులోనే నెలవంక పూచెనా కనుల ఎదుటే కలగా నిలిచా కలలు నిజమై జగము మరిచా మొదటి సారి మెరుపు చూసా కడలి లాగే ఉరకలేసా ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేల మిల మిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పొయెనేల http://youtube.com/watch?v=kCuIE6rIUFQ

kokilamma badaayi chalinchu

Image
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల జిక్కి లోన వర్షించు పూలవాన అశా లత ల లోన జనించు తేనె సోన వినేసి తరించి తలొంచుకెళ్ళవమ్మా కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ ఒకే పదం ఒకే విధం కుహు కుహు అదే వ్రతం అదే మతం అనుక్షణం నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది చేరవమ్మా చరిత్ర మర్చుకోమ్మా శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మా ఖరీదు కాదు లేమ్మా కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ మావిళ్ళలో నీ గూటిలో ఎన్నాళ్ళిలా హా..ఆ మా ఊరిలొ కచేరిలో పడాలి గా హా ఆ... చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మా తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మా దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మా అదంతా తేలికెమి కాదులెమ్మా ఎత్తాలి కొత్త జన్మ కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ http://youtube.com/watch?v=5KQBcMLKWns

okkasaari cheppaleva

Image
ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ వెన్నేలేదో వేకువేదో నీకు తెలుసా మరి నిదుర పొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దని చంటిపాపలకి చెబుతామా లేని పోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని జన్మలోనే నిదరోకు అని కంటిపాపలకి చెబుతామా కలలన్నవి కలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ అందమైన హరివిల్లులతో వంతెనేసి విరిజల్లులతో చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా అంతులేని తన అల్లరితో అలుపు లేని తన అలజడితో కెరటమెగిరి పడుతుంటే ఆకాశం తెగి పడుతుందా మనసుంటే మార్గం ఉంది కదా అనుకుంటే అందనిదుంటుందా అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుక

Telusunaa telusunaa

Image
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగిందే తడిమి చూస్తే అతడి తలపే నిండి పొయిందే నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది కలవనా కలవనా నేస్తమా అలవాటుగా పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా http://www.youtube.com/watch?v=1j6nv6PeQW0

anaganaganagaa manasuna merupe

Image
అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలో మెరుపుల వెనుక చిరు చిరు చినుకే కురిసిన సమయంలో మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో తెరవని తలుపులు తెరిచిన క్షణమున ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనా కొత్త ప్రేమ తపన మొలకెత్తు ఇందువలన తెలిసిన కధలో కలసిన తిధిలో తిరగని మలపులు తిరిగిన క్షణమున ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనా పిచ్చి ప్రేమ తపన పురి విప్పే ఇందువలన కుంకుమ పువ్వుకు కాటుక రేఖవనా కోరిన ప్రియునికి కౌగిలి లేఖవనా నీలినింగినొదిలి తారలిటు కదిలి చేరుకున్నవి మజిలి నీ చెలిమి పెన్నిధి తగిలి జిలిబిలి తార ఎద గగనమున జాబిలి తీరుగ ఎదిగిన క్షణమున ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనా పిచ్చి ప్రేమ తపన పురివిప్పే ఇందు వలన నచ్చిన చేతికి గోరింటాకవనా నల్లని రేయికి వెన్నెల పడకవనా కొద్దిగ ఇటు జరిగి ముద్దులో మునిగి నవ్వవా అటు తిరిగి నేనివ్వలేనిది అడిగి అడుగు కలిపి నడుమును కొలిచి నడవని దారిన నదచిన క్షణమున ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనా పిచ్చి ప్రేమ తపన పురివిప్పే ఇందు వలన అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలో మెరుపుల వెనుక చిరు చిరు చినుకే కురిసిన సమయంలో మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో తెరవని తలుపులు తెరిచిన క్షణమున ధీంతార ధిరనా

chinni chinni ee navvulu choosi

Image
చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఏ బ్రహ్మ రాసాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్త బంధాలిలా ఈ రెండు దీపాలుగా ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలొ చోటు దక్కిందిలా ఏ తోడు కానంతగా రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా రొషాల ఈ లేత బుగ్గలో రోజాలు పూయించగా ఆ బంధం అనుబంధం మాదె కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఆ చెమ్మచెక్కల్లో చెలిమే ఇలా మారింది పంతాలుగా ఈ గూడ దిక్కుల్లో ఉడుకే ఇలా సాగింది పందాలుగా ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరులా ఈ తిట్టి పోతల్లో అర్ధాలనే విలిగించుకో వీలుగా కారాల మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా కల్యాణ తాంబూలమెప్పుడో కలలన్ని పండించగా ఆ అందం ఆనందం మాది కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ

lokaale gelavaga nilichina snehaala viluvalu telisina

Image
లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైన వెనకన నువ్వేగా ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన ఈ ఆనందం నీ చిరునవ్వేగా నీతోనే కలిసిన క్షణమున నాలోని అణువణువణువున నీవే నీవే నీవుగా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా ఈ పువ్వు కోరిందిగా ప్రేమాభిషేకాలనే నా చూపు పంపిందిగా పన్నీటి మేఘాలనే బుగ్గపై చిరు చుక్కవై ,జుట్టువై, సిరి బొట్టువై నాతోనే నువ్వుండిపో ఊపిరై ,ఎద తీపినై ,ఊపునై ,కనుచూపునై నీలోనే నేనుంటినే నీ రామచిలుకని నేనై నా రామచంద్రుడు నీవై కలిసే వుంటే అంతే చాలురా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైన వెనకన నువ్వేగా ఈ రాధ బృందావనం సుస్వాగతం అందిరా నా ప్రేమ సింహాసనం నీ గుండెలో ఉన్నదే పక్కగా రారమ్మని కమ్మగా ముద్దిమ్మని ఎన్నాళ్ళు కోరాలి రా ఎప్పుడు కనురెప్పలా చప్పుడై ఎద లోపల ఉంటూనే ఉన్నానుగా సన్నాయి స్వరముల మధురిమ పున్నాగ పువ్వుల ఘుమఘుమ అన్ని నీవై నన్నే చేరరా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైన వెనక

nallani mabbula chatu

Image
నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిల కిల నవ్వి ఈలే వేస్తావ్ ఏమలా సర్లే పోని అంటూ వెళ్తే నేనలా చిటపట లాడి చిందే వేస్తవేంటలా తెలుసా జడి వాన తొలి చినుకై నువు తాకేయగా తడిసే నెరజాన విరి నెమలై పురి విప్పేయదా ఘల్లుఘల్లుమని అందెలు ఆడెనులే అరె ఝల్లుఝల్లుమని చినుకే రాలెనులే జిల్లు జిల్లుమని ఆశలు రేగెనులే ఏడు రంగుల విల్లై ఊగెనులే ఎంత ధైర్యమే వాన మా ఇంటికొచ్చి నా పైనా చిటుకు చిటుకు అని జారే చల్లని చినుకై ఎద చేరే సరదాల వరదలో నేనుంటే పరువాల పొంగులను దోసే వెలుగైన చూడని ఒంపుల్లో తనువార జలకమే ఆడే చనువిస్తే తుంటరి వాన తొలి ప్రాయం దోచటమేనా సరికాదే కొంటె వాన ఎద మీటి పోకె సోనా నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిల కిల నవ్వి ఈలే వేస్తావ్ ఏమలా వింత చేసెనీ వాన కురిసింది కొంతసేపైనా తడిపి తడిపి నిలువెల్లా తపనై విరిసే హరివిల్లా చిరు జల్లు వలచిన ప్రాయానే మరుమల్లె కాజేస్తే సెలయేటి అద్దమును చూపించి మెరుపల్లె మేనిలో చేరే చనువిస్తే తుంటరి వాన తొలి ప్రాయం దోచటమేనా సరికాదే కొంటె వాన ఎద మీటి పోకె సోనా ఘల్లుఘల్లుమని అందెలు ఆడెనులే అరె ఝల్లుఝల్లుమని చినుకే రాలెనులే జిల్లు జిల్లుమని ఆశలు రేగెనులే ఏడు రంగుల విల్లై ఊగెనులే http

kanupaapaki idi telusaa

Image
మది తెలుపుతున్నది మనమొక్కటేనని ఈ దూరమన్నది అసలడ్డుకాదని కనుపాపకు ఇది తెలుసా నీ శ్వాసకు ఇది తెలుసా కనుగొందా ఈ వరసా గుర్తించిందా మనసా నిను చూస్తున్నా ఏం చేస్తున్నా నీడై గమనిస్తున్నా నీ వెనకే వస్తున్నా తనువులు విడిగా ఉన్నా హృదయం ఒకటే కాదా నిన్ను నన్ను ఏకం చేసే వంతెన వలపేగా నిన్న మొన్న ఎపుడైనా ఈ అనందమే చూసానా నిన్ను నన్ను కలిపింది ఆ దైవమే అనుకోనా కనుపాపకి ఇది తెలుసా కనుగొందా ఈ వరసా పెదవిప్పలేని మాటైనా కనురెప్పతోటె తెలిపైనా ఎవరొప్పుకోను అంటున్నా ఎద చప్పుడసలు ఆగేనా ఎదుటే కదలాడుతున్నది ప్రాణం విడిగా ఒకటై నడవాలి చివరికి నీడై ఒక జతగా ఇంతమందిలో ఒకడై ఉన్నా నిను వింతగా కనిపెడుతున్నా ఎంతమందితో నే కలిసున్నా నీ చెంతకే చేరగ కలగన్నా నిన్న మొన్న ఎపుడైనా ఈ అనందమే చూసానా నిన్ను నన్ను కలిపింది ఆ దైవమే అనుకోనా కనుపాపకి ఇది తెలుసా నీ శ్వాసకి ఇది తెలుసా చిరు పంజరాన నేనున్నా చిరునవ్వుతోనే చూస్తున్నా తొలిపొద్దు జాడ తెలిసున్నా సరిహద్దు దాటలేకున్నా కలలే మరి భారమైనవి నిజమై తెలుసా భారం ఎన్నాళ్ళో ఉండదు నను నమ్మే మనసా నమ్మి నిన్నే నీలొ సగమైన కద గుండెలోన నిన్ను దాచుకున్న ఇలా గుండె చాటు గుట్టు తెలిసున్నా అది విప్పి చెప

aakaasam digi vachi

Image
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరచిన తరుణం ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం మా ఇల్ల లేత మామిల్ల తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన దీర్ఘాలులే ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి చెంపలో విరబూసే అమ్మయి సిగ్గు దొంతరలు ఆ సొంపులకు ఎరవేసే అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో తన సరసన విరిసిన సిరి సిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా ధీంతక ధీంతక ధీంతక తకధీం ధీంతక ధీంతక ధీంతక తకధీం ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు సందు చూసి చకచక ఆడే జూద శిఖామనులు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు తమ నిగనిగనగలను పదుగురి ఎదుట ఇదిగిదిగో అని చూపెడుతు తెగ తిరిగే తరణుల తికమక పరుగులు చూ

Idhi paata kaane kaadhu

Image
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఒంటరిగా తిరుగాడు లేడిని ఒక మనిషి చూసినాడు చెంతకు చేరదీసినాడు అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది తన హృదయం పరిచింది ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్దపులని తను బలి అయిపోతినని ఆ లేడి గుండె కోత నా గాధకు శ్రీకారం నే పలికే ప్రతి మాట స్త్రీ జాతికి సందేశం ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు కామాంధులు ఉన్నారు వారి చేతిలో వందలు వేలు బలి అవుతున్నారు అబలలు బలి అవుతున్నారు నిప్పులు చేరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికి చల్లారేదెప్పటికి ఆ మంటలారుదాకా నా గానమాగిపోదు ఆ రోజు వచ్చు దాకా నా గొంతు మూగబోదూ ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు

Priyatamaa naa hrudayamaa

Image
ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులి వెచ్చనైనా ఒదార్పు నీవై శృతి లయ లాగ జత చేరినావు నువు లేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా నీ పెదవిపైనా వెలుగారనీకు నీ కనులలోనా తడి చేరనీకు నీ కన్నిటి చుక్కే మున్నీరు నాకు అది వెల్లువల్లే నను ముంచనీకు ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా మహా సాగరాలే నిను మింగుతున్నా ఈ జన్మలోనా ఎడబాటు లేదు పది జన్మలైనా ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా నా గుండెలో నిండిన గానమా నను మనిషిగా చేసిన త్యాగమా http://www.youtube.com/watch?v=970a8bUff-M

Nindu noorella saavasam

Image
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండు గుచ్చోను నా ప్రాణం వెండి ఎన్నెల్లో కల్యాణం ఈ రీతులు,గీతలు సెరిపేయాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాములే నిండు నూరేళ్ళ సావాసంస్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు పుచ్చ పూల పున్నమేనులే రెల్లు కప్పు నేసినా ఇంద్రధనసు ఊరిలో రేయి పగలు ఒక్కటేలే రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్ల గాలులా పల్లకీలో సుక్కసుక్కని సుట్టివద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు,గీతలు సెరిపేయాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాములే వర్జమంటూ లేదులే రాహుకాలమేదిలే రాసి లేదు వాసి లేదు తిధులు లేవులే అతిధులంటు లేరులే మనకి మనమే చాలులే మాసి పోని బాసలన్ని బాసికాలులే ఏ ఈడుపు దిగి రాడులే మన కూడికే మన తోడులే ఇసుక దోసిలే తలంబ్రాలుగా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం http://www.youtube.com/watch?v=ZeXfQjOkzFo

chinni chinni aasa

Image
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దులిడ ఆశ వెన్నలకు తోడై ఆడుకోను ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ పూవులా నేను నవ్వుకోవాలి గాలినే నేనై సాగిపోవాలి చింతలే లేక చిందులేయాలి వేడుకలలోనా తేలిపోవాలి తూరుపు రేఖ వెలుగుకావాలి చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ చేనులో నేనే పైరుకావాలి కొలనులో నేనే ఆలను కావాలి నింగి హరివిల్లు వంచి bచూడాలి మంచు తెరలోనె నిదురపోవాలి చైత్ర మాసంలో చినుకు కావాలి చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ http://youtube.com/watch?v=0zeq_1IIlYM

vennela vennela

Image
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పువ్వులా తేనెలే తేవే వెన్నెల వెన్నెల మెల్లగా రావే పువ్వులా తేనెలే తేవే కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ కనుల పైనా కలలే వాలి సోలిపొయే వేళ వెన్నెల వెన్నెల మెల్లగా రావే పువ్వులా తేనెలే తేవే ఆశ ఎన్నడు విడవక అడగరాదని తెలియదా నా ప్రాణం చెలి నీవేలే విరగబూసిన వెన్నెల వదిలివేయకే నన్నిలా రారాదా ఎద నీదే కాదా నిదుర ఇచ్చే జాబిలి నిదుర లేక ఇదే పాడినావా వెన్నెల వెన్నెల మెల్లగా రావే పువ్వులా తేనెలే తేవే మంచు తెరలో ఒదిగి పొయే మధన సంధ్య తూగేనా పుడమి ఒడిలో కలలు కంటూ పాపాయి నూ నిదురపో మల్లె అందం మగువకెరుక మనసు బాధ తెలియదా గుండె నిండా ఊసులే నీ ఎదుట ఉంటే మౌనమే జోల పాట పాడినానే నిదుర లేఖ పాడినా వెన్నెల వెన్నెల మెల్లగా రావే పువ్వులా తేనెలే తేవే http://www.raaga.com/channels/telugu/movie/A0000042.html

pillagaali allari

Image
పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేన కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేన ఎల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికి మా కళ్ళలో, వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగ మెరిసే సమయాన అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా గారంగ పిలిచేనా ఝల్లు మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా ఇంద్ర జాలమై వినోదాల సుడిలొ కాలాన్ని కరిగించగా చంద్ర జాలమై తారంగాల వొడిలో యెల్లన్ని మురిపించగ తారలన్ని తోరణాలై వారాల ముత్యాల హారలయ్యెన చందనాలు చిలికేనా ముంగిల్లొ నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైన, మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా నవ్వుల్లొ హాయి రాగం మువ్వల్లొ వాయు వేగం ఎమైందొ ఇంత కాలం ఇంతమంది బృంద గానం ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా స్వాతి ఝల్లుగా స్వరాలెన్నొ పలికె సరికొత్త రాగాలుగా నింగి దాక పొంగి పోగా హోరెత్తి పొతున్న గానా బజాన చెంగు మంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా http://www.youtube.com/watch?v=QEcVhYMUUjk

kammani geetaale

Image
కమ్మని గీతలే పాడి రమ్మని పిలిచానే మరి రావే ఇకనైనా కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే కనిపించవు కాస్తైనా నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే ఏది రామరి ఏ మూలున్న కమ్మని గీతలే పాడి రమ్మని పిలిచానే మరి రావే ఇకనైనా కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే కనిపించవు కాస్తైనా ఎవరైనా చూసారా ఎపుడైనా ఉదయానా కురిసే వెన్నెల వానా కరి మబ్బులాంటి నడి రేయి కరిగి కురిసింది కిరణాలుగా ఒక్కొక్క తార చినుకల్లె జారి వెలిసింది తొలి కాంతిగా కరి మబ్బులాంటి నడి రేయి కరిగి కురిసింది కిరణాలుగా ఒక్కొక్క తారా చినుకల్లే జారి వెలిసింది తొలి కాంతిగా నీలాకాశంలోన వెండి సముద్రంలా పొంగే కమ్మని గీతలే పాడి రమ్మని పిలిచానే మరి రావే ఇకనైనా కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే కనిపించవు కాస్తైనా నన్నేనా కోరుకుంది ఈ వరాల కూన ఏలుకోన కళ్ళ ముందు విందు ఈ క్షణానా సీతకోక చిలుక తీసుకుపో నీ వెనుక వనమంతా చూపించగా ఆ మొక్కా ఈ మొలకా అన్ని తెలుసు కనుకావివరించు ఇంచక్కగా సీతకోక చిలుక తీసుకుపో నీ వెనుకు వనమంతా చూపించగా ఆ మొక్కా ఈ మొలకా అన్ని తెలుసు కనుకావివరించు ఇంచక్కగా ఈ కారారణ్యంలో నీకే దిక్కై రానా కమ్మని గీతలే పాడి రమ్మని పిలిచానే మరి రావే ఇకనైనా

subhalekha raasukunaa

Image
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో అది నీకు పంపుకున్నా అపుడే కలలో పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో వొత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్నా కలయో నిజమో తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి కోయిలమ్మ కూసెనేమో గొంతు నిచ్చి కొమ్మకి మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి మల్లె మబ్బు లాడెనేమో బాల వీణ వేణికి మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు అంతేలే కధంతేలే అదంతేలే హంసలేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో వేసవల్లె వేచి ఉన్నా రేణు పూల తోటలో వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలు వొళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంచలు అంతేలే కధంతేలే అదంతేలే శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో అది నీకు పంపుకున్నా అపుడే కలలో http://youtube.com/watch?v=wPrDAW1LUYs

Nenunnanani

Image
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలలు సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని గుండేతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని.. ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని అందరు ఉన్నా ఆప్తుడు నువ్వై చేరువయ్యావని జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని http://www.raaga.com/channels/telugu/movie/A0000399.html

Tarali raada tane vasantham

Image
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కద తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం బ్రతుకున లేని శృతి కలదా యదసడిలోనే లయ లేదా బ్రతుకున లేని శృతి కలదా యదసడిలోనే లయ లేదా ఏ కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజాధనం కానీ కళావిలాసం ఏ ప్రయోజనం లేనీ సుధావికాసం కూసే కోయిల పోతే కాలం ఆగిందా పాడే ఏనే పాడే మరో పదం రాదామురళికి గల స్వరముల కళపెదవిని విడి పలకదు కద తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం http://youtube.com/watch?v=oO2kLCzuFg4

Aliveni Animutyamaa

Image
అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో స్వాతివాన లేత ఎండలో జాలి నవ్వు జాజి దండలు అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణ ముత్యమా జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో స్వాతివాన లేత ఎండలో జాజి మల్లి పూల దండలు అలివేణి ఆణిముత్యమా కుదురైన బొమ్మకి కులుకు మల్లె రెమ్మకి కుదురైన బొమ్మకి కులుకు మల్లె రెమ్మకి నుదుట ముద్దు పెట్టనా ముద్దుగా వద్దంటే ఒట్టుగా అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అడుగు మడుగులొత్తనా మెత్తగా అవునంటే తప్పుగా అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణ ముత్యమా పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి పొగడ దండలల్లుకోనా పూజలా పులకింతల పూజగా తొలిజన్మల నోముకి దొరనవ్వుల సామికి తొలిజన్మల నోముకి దొరనవ్వుల సామికి చెలిమై నేనుండిపోనా చల్లగా మరుమల్లెలు చల్లగా అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో స్వాతివాన లేత ఎండలో జాలి నవ్వు జాజి దండలు అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణ ముత్యమా http://telugusongs.allindiansite.com/mudda_mandaram.html

Teliyani raagam palikindi

Image
తెలియని రాగం పలికింది తీయని భావనలో తెలియని రాగం పలికింది తీయని భావనలో మనసే జ్యొతిగా వెలిగింది మమతల కోవెలలో ఈ మమతల కోవెలలలో తెలియని రాగం పలికింది తీయని భావనలో ఆకాశ దీపానివై నా కోసమే రమ్మని నా గుండె గుడిగంటలో నాధానివే నీవని గోరంత పసుపెట్టి ఊరంత కబురెట్టే శ్రీవారే రావాలని కుంకుమతో కుశలమని పారాణే పదిలమని దీవించు దేవుల్లే మా ఇంటివారని తెలియని రాగం పలికింది తీయని భావనలో మనసే జ్యొతిగా వెలిగింది మమతల కోవెలలో ఈ మమతల కోవెలలలో ఏ జన్మకే గమ్యమో తెలిసేది కాలానికే ఏ పువ్వు ఏ పూజకో తెలిసేది దైవానికే ఏ జన్మకేమైన ఈ జన్మలో నీకు ఖైదీనే అయ్యానుగా బ్రతుకైనా వెతలైనా జతగానే పంచుకునే శ్రీవారే కావాలి ఏ జన్మకైనా తెలియని రాగం పలికింది తీయని భావనలో మనసే జ్యొతిగా వెలిగింది మమతల కోవెలలో ఈ మమతల కోవెలలలో తెలియని రాగం పలికింది తీయని భావనలో http://ramaneeya.com/smilfiles/rampopup.php?FirstPass=1102

raagaala pallakilo koyilamma

Image
రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా రాలేదు ఈ వేళ కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకి మూగ తీగ పలికించే వీణలమ్మకి పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకి మూగ తీగ పలికించే వీణలమ్మకి బహుసా అది తెలుసో ఏమో ఉహు హు ఉహు హు హు బహుసా అది తెలుసో ఏమో జాణ కోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ అందుకేనా అందుకేనా........ గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు బహుసా తను ఎందుకనేమో ల ల ల లల లాలాలాలా బహుసా తను ఎందుకనేమో గడుసు కోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ రాగాల పల్లకిలో కోయిలమ్మా రానేలా నీవుంటే కూనలమ్మా రాగాల పల్లకిలో కోయిలమ్మా రానేలా నీవుంటే కూనలమ్మా http://youtube.com/watch?v=B1lj6ofbtnQ

sindura puvvaa..

Image
సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించ రావా కలలే విరిసెనే కధలే పాడెనే ఒక మదివోలే అనందం ఎద పొంగెనే ఓ సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించ రావా కమ్మని ఊహలు కలలకి అందం తీరని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరగాల తేలి సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించ రావా అందాలు సందడి చేసే రాగాలనేలి సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించ రావా మాటల చాటున నాధం నువ్వే తీయని పాట నేనే మధుమాస ఉల్లసాలే పులకించెనే మురిపాలు చిందే హృదయం కొరేను నిన్నే సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించ రావా అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ నా చెంత తోడై నీడై వెలిసావు నీవే రాగాలు ఆలపించి పిలిచావు నువ్వే సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించ రావా http://www.youtube.com/watch?v=ft9tWYto5JE

Raali poye puvva neeku...

Image
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే ,తొటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే ,లొకమెన్నడో చీకటాయెలే నీకిది తెలవారని రేయమ్మా,కలికి మాచిలక పాడకు నిన్నటి నీ రాగం రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే ,తొటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే ,లొకమెన్నడో చీకటాయెలే చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా ఆ ఆ ఆ ఆ తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా సింధుర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై కరిగే కర్పూరం నీవై ఆశలకే హారతివై రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే ,తొటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే ,లొకమెన్నడో చీకటాయెలే అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే హేమంత రాగాల చేమంతులే వాడిపోయే ఆ ఆ తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలు కొండెక్కి పోయే పగిలే ఆకశం నీవై జారిపదే జాబిలివై మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే ,తొటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే ,లొకమెన్నడో చీకటాయెలే http://www.youtube.c

Hrudayaanjali

Image
మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొలి భూపాళం మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొలి భూపాళం పచ్చదనాల పానుపుపైనా అమ్మై నేల జోకొడుతుంటే పచ్చదనాల పానుపుపైనా అమ్మై నేల జోకొడుతుంటే మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొలి భూపాళం పున్నమి నదిలో విహరించాలి పువ్వుల ఒళ్ళో పులకించాలి పావురమల్లే పైకెగరాలి తొలకరి జల్లై దిగి రావాలి\ తారల పొదరింట రాతిరి మజిలి వేకువ వెనువెంట నేలకు తరలి కొత్త స్వెచ్చకందించాలి నా హృదయాంజలి మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొలి భూపాళం వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇస్టం మనలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడు నా సొంతం వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇస్టం మనలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడు నా సొంతం ఊహలు నీవే ప్రాణం పోసి చూపవే దారి ఓ చిరుగాలి కలలకు సైతం సంకెల వేసి కలిమి ఎడారి దాటించాలి తుంటరి తూనిగవై తిరగాలి దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి పేద గరికపూలకు ఇస్తా నా హృదయాంజలి మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొలి భూపాళం మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొలి భూపాళం పచ్చదనాల పానుపుపైనా అమ్మై నేల జోకొడుతుంటే పచ్చదనాల పానుపుపైనా అమ్మై నేల జోకొడుతుంటే మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొల