Posts

Showing posts from 2008

ఏ రోజయితే చూసానో నిన్ను

Image
ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో నీ రూపే నా వేచే గుండెల్లో నిన్నటి నీ స్మృతులు నన్ను నడిపిస్తూ ఉంటే నీ నీడై వస్తాను ఎటువైపున్నా నీ కష్టంలో నేను ఉన్నాను కరిగే నీ కన్నీరవుతా నేను చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకంతంలో ఓదార్పవుతాను

జామురాతిరి జాబిలమ్మ

Image
జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా ఇలా జోరుగాలిలో జాజికొమ్మా జారనీయకే కలా వయారి వాలు కళ్ళలోనా వరాల వెండి పూల వాన స్వరాల ఊయలూగు వేళ జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా ఇలా కుహు కుహు సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా కునుకురాక బుట్టబొమ్మ గుబులుగుందని వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా ఇలా మనసులో భయాలన్ని మరచిపో మగతలో మరో లోకం తెరుచుకో కలలతో ఉషాతీరం వెతుకుతూ నిదురతో నిషారాణి నడిచిపో చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా ఇలా జోరుగాలిలో జాజికొమ్మా జారనీయకే కలా వయారి వాలు కళ్ళలోనా వరాల వెండి పూల వాన స్వరాల ఊయలూగు వేళ http://www.youtube.com/watch?v=ic0RSSIsAlY

నువ్వే నా శ్వాస

Image
నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష పువ్వుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు తారల్లో మెరుపులన్ని దోసిలిలో నింపావు మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా నీ జ్ఞాపకాలన్ని ఏ జన్మలోనైన నే మరవలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష సుర్యుడితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని దారులతో పంపిస్తున్న అలుపెరుగని హృదయ లయలని ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా http://www.youtube.com/watch?v=dEQhtEQub3E

మధురం మధురం

Image
మధురం మధురం మధురం మధురం మధురం మధురం మధురం మధురం ప్రణయం మధురం కలహం మధురం క్షణము సగము విరహం మధురం సరసం మధురం విరసం మధురం చికురం మధురం చుబుకం మధురం సరసం మధురం విరసం మధురం చికురం మధురం చుబుకం మధురం అందం అందం అని ఊరించే అందాలన్ని అసలే మధురం శ్రవణం మధురం నయనం మధురం కులుకే మధురం కురులే మధురం గమనం మధురం జగనం మధురం లయలో సాగే పయనం మధురం గమనం మధురం జగనం మధురం లయలో సాగే పయనం మధురం ఎదరే ఉంటే ప్రతిది మధురం చెదిరే జుట్టు చమటే మధురం సర్వం మధురం సకలం మధురం సంసారంలో సాగరమధనం సర్వం మధురం సకలం మధురం సంసారంలో సాగరమధనం అన్నీ మధురం అఖిలం మధురం ఆమే మధురం ప్రేమే మధురం అన్నీ మధురం అఖిలం మధురం ఆమే మధురం ప్రేమే మధురం కనులే మధురం కలలే మధురం కొంచం పెరిగే కొలతే మధురం కనులే మధురం కలలే మధురం కొంచం పెరిగే కొలతే మధురం మనసే మధురం సొగసే మధురం విరిసే పెదవుల వరసే మధురం ఉదయం దాచే మధురిమ గాని ఉదరం మధురం హృదయం మధురం తాపం మధురం శోపం మధురం అలకే చిలికే కోపం మధురం అలుపే మధురం సొలుపే మధురం అతిగా మరిగే పులుపే మధురం అధరం మధురం వ్యధనం మధురం వెలుగే చిలికే తిలకం మధురం బాల మధురం డోళ మధురం లీల మధురం హేళ మధురం బాల మధురం డోళ మధురం లీల మధురం

ఆకాశంలో ఆశల హరివిల్లు

Image
ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిళ్ళు అందమైన ఆ లోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిళ్ళు మబ్బుల్లో తూగుతున్న మెరుపైపోనా వయ్యారి వానజల్లై దిగిరానా సంద్రంలో పొంగుతున్న అలనైపోనా సందెల్లో రంగులెన్నో చిలికేనా పిల్లగాలే పల్లకీగా దిక్కులన్ని చుట్టి రానా నాకోసం నవరాగాలే నాట్యమాడెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిళ్ళు అందమైన ఆ లోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖద్వారం శోభలీనే సోయగాన చందమామ మందిరాన నాకోసం సురభోగాలే వేచి నిలిచెనురా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిళ్ళు అందమైన ఆ లోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిళ్ళు http://www.youtube.com/watch?v=NJS11KEUX4c

వస్తాడు నా రాజు ఈ రోజు

Image
వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు కార్తిక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన కార్తిక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నా రాజు ఈ రోజు వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను ఆతని పావన పాద ధూలికై అవని అనువనువు కలవరించేను అతని రాకకై అంతరంగమే పాల సంద్రమై పరవశించేను పాల సంద్రమై పరవశించేను వస్తాడు నా రాజు ఈ రోజు వెన్నెలెంతగ విరిసినగాని చంద్రున్ని విడిపోలేవు కెరటాలెంతగ పొంగినగాని కడలిని విడిపోలేవు కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే తనువులు వేరైన దారులు వేరైన తనువులు వేరైన దారులు వేరైన ఆ బంధాలే నిలిచేనులే ఆ బంధాలే నిలిచేనులే వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు కార్తిక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నా రాజు ఈ రోజు http://www.youtube.com/watch?v=Up7XvyDkwv8

సుందరము సుమదురము..

Image
సరిగమ పదని సప్తస్వరాలు మీకు అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు సరిగమ పదని సప్తస్వరాలు మీకు అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు మనసే ఒక మార్గము మమతే ఒక దీపము ఆ వెలుగే మాకు దైవము సరిగమ పదని సప్తస్వరాలు మీకు అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము మలయజ మారుత శీకరము మనసిజ రాగ వశీకరము సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము ఆనందాలే భోగాలైతే హంసా నంది రాగాలైతే నవవసంత గానాలేవో సాగేనులే సురవీణా నాదాలెన్నో మోగేనులే వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోనలలో వాన కొమ్మల ఊగిన కోయిల వెల్లువనూదిన గీతికలు సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము అందాలన్ని అందే వేళ బంధాలన్ని పొందే వేళ కన్నుల్లో గంగ యమున పొంగేనులే కౌగిట్లో సంగమమేదో సాగేనులే కోరికలే చారికలై ఆడిన పాడిన సవ్వడిలో మల్లెల తావుల పిల్లనగ్రోవులు పల్లవి పాడిన పందిరిలో సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము మలయజ మారుత శీకరము మనసిజ రాగ వశీకరము సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము

నువ్వంటే నాకిష్టమని

Image
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులొ శృతి కలిపి పాడగా నీ నీడలో అణువణువు ఆడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నువ్వు నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా నిన్నిలా చూస్తు ఉంటే మైమరుపు నన్నల్లుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగా సుదూరాల తారకా సమీపాన వాలగా లేనేలేదు ఇంకే కోరికా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం నిన్నగా సన సన్నగా చేజారిపోనీయక చూడు నా ఇంద్రజాలం వెను తిరిగి వస్తుంది కాలం రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా ఇలా ఉండి పోతే చాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులొ శృతి కలిపి పాడగా నీ నీడలో అణువణువు ఆడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వా

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి..

Image
చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి ఆశ దీపికలై మెరిసే తారకలు చూసే దీపికలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుంది ఓ ఓ ఓ...చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవా షికారులు కురిసే సుగంధాల హోళి ఓ చూపదా వసంతాలకేళీ కురిసే సుగంధాల హోళి ఓ చూపదా వసంతాలకేళీ యమునా తీరాల కధ వినిపించేలా రాధామాధవుల జత కనిపించేలా పాడనీ వెన్నెల్లో ఈ వేళ చెవిలో సన్నాయి రాగంలా ఓఓ ఓ ఓ...కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి ఏదని ఈదే వేళ జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళీ ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళీ చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి http://www.youtube.com/watch?v=_OFR0Yi5quA

మనసా వాచా నిన్నే వలచా

Image
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ మాట దాచా కాలాలు వేచా నడిచానే నీ నీడలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు కన్నీరైనా గౌతమికన్నా తెల్లారైనా పున్నమికన్నా మూగైపోయా నేనిలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా రాముని కోసం సీతలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ మాట దాచా కాలాలు వేచా నడిచానే నీ నీడలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా http://www.youtube.com/watch?v=YRJZEUVitcc

I wanna sing

Image
I wanna sing and sing and swing and swing till I tumble down I wanna fly like a bird with the wind in my face slowly soaring above the ground తరచి కొలవకు కొలవకు కాలాన్నిగుర్తుంచుకునేంతగ ఏమున్నది నీ నిన్నల్లో మొన్నల్లో Ticky Ticky Ticky Ticky clock goes round Tickety Ticky fun goes on Ticky Ticky Ticky Ticky come along When everybody is going round and roundand round and round and round and round. సాయంత్రం మనది ఒంటరి ఒంటరి జీవితం ఈ మంత్రం చెరుపుతున్నది దూరము దూరము If you wanna sing నాతో గీతం If you wanna do నాతో నాట్యం If you wanna spend నాతో సమయం This is the moment If you wanna do ఏదైనా కొంచెం Ticky Ticky Ticky Ticky clock goes round Tickety Ticky fun goes on Ticky Ticky Ticky Ticky come along When everybody is going round and roundand round and round and round and round. I wanna sing and sing and swing and swing till I tumble down I wanna fly like a bird with the wind in my face slowly soaring above the ground చూస్తావా సరిగమా విరిచిన హరివిల్లుని గీస్తావా అసలు హద్దుకి అవతల హద్దుని If y

ఎవరైనా చూసుంటారా..

Image
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే కొండవాగులై ఇలా నేను చిటికేస్తే క్షణాలన్ని వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంతే అది నిజమోకాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని http://www.youtube.com/watch?v=rMb5t_KMktE

ఓంకార నాదాలు సంధానమౌ గానమే...

Image
ఓం...ఓం... ఓంకార నాదాలు సంధానమౌ గానమే శంకరాభరణం ఓంకార నాదాలు సంధానమౌ గానమే శంకరాభరణం శంకరాభరణము... శంకర గళనిగళము శ్రీహరి పద కమలము శంకర గళనిగళము శ్రీహరి పద కమలము రాగ రత్న మాలికా సరళము శంకరాభరణము... శారద వీణ ..ఆ ఆ ఆ ఆ.. శారద వీణ రాగ చంద్రిక పులకిత శారద రాత్రము శారద వీణ రాగ చంద్రిక పులకిత శారద రాత్రము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము రసికులకనురాగమై రసగంగలో తానమై రసికులకనురాగమై రసగంగలో తానమై పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము.. అద్వైత సిద్దికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము అద్వైత సిద్దికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము సత్వ సాధనకు సత్య సోధనకు సంగీతమే ప్రాణము సత్వ సాధనకు సత్య సోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగ రాజ నిలయమై త్యాగరాజ హృదయమై రాగ రాజ నిలయమై ముక్తినొసగు భక్తి యోగ మార్గము మృతియేలేని సుధాలాప స్వర్గము శంకరాభరణము ఓంకార నాదాలు సంధానమౌ గానమే శంకరాభరణము ప ద ని శంకరాభరణము .... http://ramaneeya.com/smilfiles/rampopup.php?FirstPass=1186

నవ్వాలి నీతో నడవాలి నీతో

Image
నవ్వాలి నీతో ..నడవాలి నీతో నెలవంక మీద నిలవాలి నీతో ఆడాలి నీతో.. అలగాలి నీతో హరివిల్లు మీధ ఊగాలి నీతో తడవాలి నీతో.. ఆరాలి నీతో గడపాలి అనుక్షణం నేనే నీతో నవ్వాలి నీతో ..నడవాలి నీతో నెలవంక మీద నిలవాలి నీతో వస్తానని మాటిచ్చక కావాలని నే రాలేక నీలొ చాలా ఆరాటాన్నే పెంచాలి వేరే కన్యను నేనింక వంకర చూపులు చూసాకా నీలో కలిగే అక్రోశాన్నే కాచాలి నీ పైట గాలిని పీల్చాలి నీ మాట తేనెను తాగాలి నును లేత చివాట్లు తింటా నీతో నవ్వాలి నీతో ..నడవాలి నీతో నెలవంక మీద నిలవాలి నీతో ఆడాలి నీతో.. అలగాలి నీతో హరివిల్లు మీధ ఊగాలి నీతో చీటికి మాటికి ఊరించి చిలిపితనంతో ఉడికించి ముద్దుగ మూతిని ముడుచుకునుంటే చూడాలి అంతకు అంత లాలించి ఆపై నీపై తలవాల్చి బ్రతిమాలేస్తూ జతగా నీతో బ్రతకాలి నీ వేలి కొనలను నిమరాలి నీ కాలి ధూళిని తుడవాలి అరచేతి గీతల్లే ఉంటా నీతో నవ్వాలి నీతో ..నడవాలి నీతో నెలవంక మీద నిలవాలి నీతో ఆడాలి నీతో.. అలగాలి నీతో హరివిల్లు మీధ ఊగాలి నీతో తడవాలి నీతో.. ఆరాలి నీతో గడపాలి అనుక్షణం నేనే నీతో http://www.youtube.com/watch?v=v5dvPplbPRA

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు..

Image
ee song raasinadhi evaro kaani life ante ento oka song lo chepparu...hats off..music is also great...chaala chaala baagundhi...vinandi meeke telustundhi... ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరే ఒక్కొక్క అల పేరు మనకిల ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరూ సరిగ చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటూ అది నీ ఊపిరిలో లేదా గాలివెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరు అన్ని కలిపితే నువ్వే కాదా ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల స

Sasivadane sasivadane

Image
శశివదనే శశివదనే స్వర నీలంబరి నీవా అందెల వన్నెల వైకరితో నీ మది తెలపగ రావా అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా నవమధన నవమధన కలపకు కన్నుల మాట శ్వేతాశ్వముల వాహనుడా విడవకు మురిసిన బాట అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె గిచ్చే మోజు మోహనమే నీదా మదనమోహిని చూపులోన మాండురాగమేలా మదనమోహిని చూపులోన మాండురాగమేలా పడుచువాడినే కన్న వీక్షన పంచదార కాదా కల ఇల మేఘమాసం క్షణానికో తోడి రాగం చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కటిని గిల్లే శశివదనే శశివదనే స్వర నీలంబరి నీవా అందెల వన్నెల వైకరితో నీ మది తెలపగ రావా అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా నెయ్యం వియ్యం ఏదేమైన తనువు నిలవదేలా నెయ్యం వియ్యం ఏదేమైన తనువు నిలవదేలా నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేల ఒకేఒక చైత్రవేళ పురెవిడి పూతలాయే ఒకేఒక చైత్రవేళ పురెవిడి పూతలాయే అమృతం కురిసిన రాతిరి ఓ జాబి

Mukunda mukunda

Image
ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగ బృందావనంలో వరంగ ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగ బృందావనంలో వరంగ వెన్నదొంగవైన మన్ను తింటివా కన్నె గుండె ప్రేమ లయల మృదంగానివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగ బృందావనంలో వరంగ జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగ బృందావనంలో వరంగ మత్స్యమల్లే నీటిని తేలి వేదములను కాచి కూర్మ రూపధారివి నీవై భువిని మోసినావే వామునుడై పాదమునెత్తి నింగి కొలిచినావే నరసింహుడి అంశే నీవై హిరణ్యుడి చీల్చావు రావణుడు తలలను కూల్చి రాముడివై నిలిచావు కృష్ణుడల్లే వేణువునూది ప్రేమను పంచావు ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం మేమే నీ ఒరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైన నేనే మదిలోన ప్రేమ నీదే మాధవుడా మందార పువ్వే నేను మనువాడరా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగ బృందావనంలో వరంగ http://www.youtube.com/watch?v=Aq95Le3Z1kM

Adigadigo aasalu reputhu

Image
అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగ వాలే ఎన్నో వర్ణాలు ఇదిగిదిగో కలలను చూపుతూ ఎదలను ఏలే ఏవో వైనాలు ఎగిరొచ్చే ఆ గువ్వలో చిగురించే ఈ నవ్వులా సాగే సావాసం... ప్రతి హృదయంలో ఆ కల నిజమైతే ఆపేదెలా పొంగే ఆనందం... కలైనా ఇదివో కధైనా రచించే ఏవో రాగాలే ఈ సమయం ఏ తలపులనో తన గురుతుగ విడిచెళ్తుందో ఈ మనసుకు జత ఏదంటే తను ఏమని బదులిస్తుందో వరమనుకో దొరికిన జీవితం ఋతువులు వేసే రంగుల ఓ చిత్రం ఈ పయనం ఏ మలుపులో తన గమ్యం నే చేరునో చూపే దారేది.... వరించే ప్రతి క్షణాన్ని జయించే స్నేహం తోడవనీ తన గూటిని వెదికే కళ్ళు గమనించవు ఎద లోగిళ్ళు తలవంచిన మలి సంధ్యల్లో సెలవడిగెను తొలి సందళ్ళు

Siri siri muvvalu

Image
సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు కలబోసి చేసినవి కిలకిల నవ్వులు వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు అల్లరంత సిరిమువ్వలై ఘల్లుఘల్లు మంటే నిలువలేక నిశబ్దమే విసుగు పుట్టి పోదా సంతోషము కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది తెగ నవ్వే మన కళ్ళని ఈ మణికాంతి వెలుగుతు ఉంటే ఈ మణికాంతి వెలుగుతు ఉంటే చీకటి రాదే కన్నులకెదురుగ సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు కలబోసి చేసినవి కిలకిల నవ్వులు వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు

Raagaala saraagaala

Image
రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా సాగే సంసారం హాయ్ సుఖ జీవనసారం రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా సాగే సంసారం హాయ్ సుఖ జీవనసారం పతి పద సేవయే యోగముగా నాతికి పతియే దైవముగా పతి పద సేవయే యోగముగా నాతికి పతియే దైవముగా సతి సౌబాగ్యాలే తన భాగ్యమని భావమే పతి ధర్మముగా సతి సౌబాగ్యాలే తన భాగ్యమని భావమే పతి ధర్మముగా రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా సాగే సంసారం హాయ్ సుఖ జీవనసారం మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా సాగే సంసారం హాయ్ సుఖ జీవనసారం http://www.youtube.com/watch?v=p_QJSHecWls

Toli sandhya velalo

Image
తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాళం ఎగిరొచ్చే కెరటం సింధూరం తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాళం ఎగిరొచ్చే కెరటం సింధూరం జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతినిమిషం ఎదిగే ప్రతిబింబం గడిచే ప్రతినిమిషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ ఉదయం సంధ్యారాగం మేలుకొలుపే అనురాగం తొలి సంధ్య వేళలో సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్య సమయం సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్య సమయం వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలుపే అనురాగం తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాళం ఎగిరొచ్చే కెరటం సింధూరం http://www.youtube.com/watch?v=A8amkzaRTKY

Nee kougilio tala daachi

Image
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ నీ కౌగిలిలో తల దాచి చల్లగ కాసే పాల వెన్నెల నా మనసేదో వివరించు అల్లరి చేసే ఓ చిరుగాలి నా కోరికలే వినిపించు నా కోవెలలో స్వామివి నీవై వలపే దివ్వెగ వెలిగించు నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ నీ కౌగిలిలో తల దాచి నింగి సాక్షి నేల సాక్షి నిను వలచిన నా మనసే సాక్షి మనసులోన మనుగడలోన నువ్వే నాకు సగపాలు వేడుకలోను వేదనలోను పాలు తేనెగ ఉందాము నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ నీ కౌగిలిలో తల దాచి http://www.youtube.com/watch?v=ORoZYwo1NT4

Yamuna enduke nuvvu

Image
హొయి రేరీరే హొయ్యారెహొయి యమున తీరే హొయ్యారెహొయి యమున ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు రేయి కిట్టయతోటి కూడావా యమున ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు రేయి కిట్టయతోటి కూడావా నల్లా నల్లని వాడు నిన్ను కవ్వించెనా వలపు సయ్యాటలోన నలుపు నీకంటెనా హొయి రేరీరే హొయ్యారెహొయి యమున తీరే హొయ్యారెహొయి వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చు కన్నట్టి గీటేసి పెడతాడే చిచ్చు వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చు కన్నట్టి గీటేసి పెడతాడే చిచ్చు చల్లమ్మబోతుంటే చెంగట్తుకుంటాడే చల్లమ్మబోతుంటే చెంగట్తుకుంటాడే దారివ్వకే చుట్టూ తారాడతాడే పిల్ల పోనివ్వనంటు చల్లా తాగెస్తడే అల్లా రల్లడి వాడు అబ్బో ఏం పిల్లడే హొయి రేరీరే హొయ్యారెహొయి యమున తీరే హొయ్యారెహొయి సిగిపించ మౌలన్న పేరున్నవాడే శృంగార రంగాన కడతేరినాడే సిగిపించ మౌలన్న పేరున్నవాడే శృంగార రంగాన కడతేరినాడే రేపల్లెలోకెల్ల రూపైన మొనగాడే రేపల్లెలోకెల్ల రూపైన మొనగాడే ఈ రాధకీడైన జతగాడు వాడే మురళి లోలుడు వాడే ముద్దు గోపాలుడే వలపే దోచేసినాడే చిలిపి శ్రీ క్రిష్ణుడు హొయి రేరీరే హొయ్యారెహొయి యమున తీరే హొయ్యారెహొయి యమున ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు రేయి కిట్టయతోటి కూడావా నల్లా నల్లని వాడు ని

E divilo velasina

Image
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో నా మదిలో నీవై నిండి పోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంసలా రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే పదము పదములో మధువులూరగ కావ్య కన్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో http://www.youtube.com/watch?v=_ypnwyX-SJk

Malli malli idi raani roju

Image
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో... వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అదుపేది సండెమబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది రేవులో నావలా నీ జతే కోరగ జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు http://www.youtube.com/watch?v=JDzbdghrrXQ

Nijamga nenenaa

Image
నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరె హరెహరె హరెహరె రామా మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా ఏమ్మా ... హరె హరెహరె హరెహరె రామా మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా ఏమ్మా ... నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఈ వయస్సులో ఒక్కోక్షణం ఒక్కో వసంతం నా మనస్సుకే ప్రతిక్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగులలోనా అడుగులు వేస్తూ నదిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడిచిన కాలం ఇంతని నమ్మదుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే నా గతాలనే కవ్వింతలే పిలుస్తు ఉంటే నీ వరాలుగ ఉల్లాసమే కురుస్తు ఉంటే పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనం లోన తారలు చేరెనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరె హరెహరె హరె

Nenani neevani

Image
నేనని నీవని వేరుగా లేమని చెప్పిన వినరా ఒక్కరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాల స్వప్నం... ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే ...... అడ్డుకోగలదా వేగం ..కొత్త బంగారు లోకం పిలిస్తే ..... మొదటిసారి మదిని చేరి నిదుర లేపిన ఉదయమా వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా మరీ కొత్తగా మరో గుట్టుగా అనేటట్టుగా ఇది నీ మాయేనా నేనని నీవని వేరుగా లేమని చెప్పిన వినరా ఒక్కరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాల స్వప్నం ..ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే ...... అడ్డుకోగలదా వేగం... కొత్త బంగారు లోకం పిలిస్తే ..... పదము నాది పరువు నీది ప్రధము నీవే ప్రియతమా తనువు నాది తెగువ నీది గెలుచుకో పురుషొత్తమా నువ్వే దారిగా నేనే చేరగాఎటు చూడక వెనువెంటే రాగా.. నేనని నీవని వేరుగా లేమని చెప్పిన వినరా ఒక్కరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాల స్వప్నం... ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే ...... అడ్డుకోగలదా వేగం.... కొత్త బంగారు లోకం పిలిస్తే ..... http://www.youtube.com/watch?v=SwlLQNgkjCo

Naa pedavulu nuvvayithe

Image
నా పెదవులు నువ్వయితే నీ నవ్వులు నేనవుతా నా కన్నులు నువ్వయితే కల నేనవుతా నా పాదం నువ్వయితే నీ అడుగులు నేనవుతా నా చూపులు నువ్వయితే వెలుగే అవుతా చెరోసగం అయ్యాం కదా ఒకే పదానికి ఇలా మనం జతై సగం శిలాక్షరం అవ్వాలి ప్రేమకి నా పెదవులు నువ్వయితే నీ నవ్వులు నేనవుతా నా కన్నులు నువ్వయితే కల నేనవుతా నా పాదం నువ్వయితే నీ అడుగులు నేనవుతా నా చూపులు నువ్వయితే వెలుగే అవుతా కనిపించని బాణం నేనయితే... తియ తియని గాయం నేనవుతా వెంటాడే వేగం నేనయితే... నేనెదురవుతా వినిపించని గానం నేనయితే... కవి రాయని గేయం నేనవుతా శ్రుతిమించే రాగం నేనయితే... జతి నేనవుతా దివి తాకే నిచ్చెన నేనయితే... దిగివచే నెచ్చెలి నేనవుతా నిను మలిచే ఉలినే నేనయితే... నీ ఊహలు ఊపిరి పోసే చక్కని బొమ్మను నేనవుతా నా పెదవులు నువ్వయితే నీ నవ్వులు నేనవుతా నా కన్నులు నువ్వయితే కల నేనవుతా నా పాదం నువ్వయితే నీ అడుగులు నేనవుతా నా చూపులు నువ్వయితే వెలుగే అవుతా వేదించే వేసవి నేనయితే... లాలించే వెన్నెల నేనవుతా ముంచెత్తే మత్తుని నేనయితే ... మైమరపవుతా నువ్వోపని భారం నేనయితే... నిన్నాపని గారం నేనవుతా నిను కమ్మే కోరిక నేనయితే... రారమ్మంటా వణికించే మంటను నేనయితే...

Poota vesina leta maavini

Image
పూత వేసిన లేత మావిని చూసినట్టుంది నువ్వు నవ్వుతూ ఉంటే... పాత పాటలు కొకిలమ్మే పాడినట్టుంది నీ పలుకు వింటుంటే... మాటలే వరదలై ఉరకలేస్తున్నాయి చెంత నువ్వుంటే...ఉంటే పూత వేసిన లేత మావిని చూసినట్టుంది మునుపు కలగని మురిపెమేదో ముద్దుగా నా ముందరుంది అలుపు తెలియని వలపు నాలో హద్దులే చెరిపేయమంది లేనిదేది నాకు లేదని తలపు ఉండేది ఇంతలో నీ పరిచయం ఒక లోటు తెలిపింది నువ్వే కావాలని,కలవాలని,కలగాలని ప్రియా నా ప్రాణమే మారాము చేసింది సగపసగరినిసగపనిసనిదపగమదపసగరిగ.. అంటూ.... పోత పోసిన పసిడి బొమ్మే కదిలినట్టుంది నువ్వు నడచి వస్తుంటే.... కోత కోసిన గుండె నాలో మిగిలి ఉంటుంది నను విడిచి వెళుతుంటే... మాటలే మౌనమై ఉసురు తీస్తున్నవి ఒంటరై ఉంటే..... పూత వేసిన లేత మావిని చూసినట్టుంది కుదురు దొరకని ఎదురు చూపే కొంటెగ వెంటాడమంది నిదుర కుదరని కంటిపాపే వెంటనే నిను చూడమంది ఏమిటో నా తీరు నాకే కొత్తగ ఉంది ప్రేమ ఊసులు మానలేని మత్తులో ఉంది నిరీక్షణ చాలని ఇక చాలని అడగాలని చెలి నా ఊపిరి నిను చేరుకుంటుంది ననననననననన.......... అంటూ..... చేతికందని చందమామే అందినట్టుంది నువ్వు తాకుతూ ఉంటే... చోటు ఇమ్మని చుక్కలేవొ అడిగినట్టుంది నువ్వు తోడు

Kallaloki kallu petti chudavenduku

Image
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనసు ఓ ఓ ఓ ఓ ఓఓఓహొ ఓ ఓ ఓ ఓ ఓఓఓహొ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు ఈనాడే సరికొత్తగ మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం కనులు మూసుకుని ఏం లాభం కలై పోదుగా ఈ సత్యం ఎటు తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయాణం ప్రతి క్షణం ఎదురై నన్నే దాటగలదా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా మోహ బయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా నిన్నా మొన్నలన్ని నిలువెల్ల నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘం లా ఆకశాన్న నువ్వు ఎటు ఉన్నా చినుకులా కరగక శిలై ఉండగలవా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనస

Palike gorinka

Image
పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక అహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేదే పూయులే పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక పగలే ఇక వెన్నెల.. పగలే ఇక వెన్నెల వస్తే పాపమా రేయిలో హరివిల్లులే వస్తే నేరమా బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియుంచు కలలే దరీ చేరవా.. పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక నా పేరే పాటగ కోయిలే పాడని నే కోరినట్టుగ పరువం మారని అరె తంతంతం మదిలో తోంతోంధీం అరె తంతంతం మదిలో తోంతోంధీం చిరుగాలి కొంచం వచ్చి నా మోమంత నిమరని రేపు అన్నది దేవుడికి నేడు అన్నది మనుషులకు బ్రతుకే బ్రతికేందుకు పలికేగోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక అహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేదే పూయులే http://www.youtube.com/watch?v=fGQF5Av4eu4

Manasuna unnadi

Image
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటకి రాదే ఎలా అతనిని చూస్తే రెప్పలు వాలిపొయే బిదియం అపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపొయే తలపులు చూపేదెలా ఒకసారే దరి చేరే ఎద గొడవేమిటో తెలపకపొతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా చింత నిప్పైన చల్లంగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని తననే తలుచుకునే వేడిలో ప్రేమ అంటేనే తీయని బాధని లేత గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనపడుతుందా నా ప్రియమైన నీకు నా ఎద కోత అని అడగాలని అనుకుంటు తన చుట్టూ మది తిరిగిందని తెలపకపొతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని నిదరే కసురుకునే రేయిలో మేలుకున్నాయి నువ్వింత కైపని వేల ఊహల్లో ఊరేగు చూపుని కలలే ముసురుకునే హాయిలో వినపదుతుందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలని పగలేదో రేయేదో గురుతే లేదని తెలపకపొతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటకి రాదే ఎలా అతనిని చూస్తే రెప్పలు వాలిపొయే బిదియం అపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపొయే తలపులు చూపేదెలా ఒకసారే దరి చేరే ఎద గొడవేమిటో తెల

E janda

Image
ఈ జండా పసి బోసి చిరునవ్వు రా.. దాస్య సంకెళ్ళు తెంచింది రా ఈ జండా అమరుల తుది శ్వాస రా..రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన ఎనలేని త్యాగాల ఘన చరితరా తన చనుబాలతో పోరు నేర్పిందిరా ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి తరం ఈ జండా పసి బోసి చిరునవ్వు రా.. దాస్య సంకెళ్ళు తెంచింది రా ఈ జండా అమరుల తుది శ్వాస రా..రక్త తిలకాలు దిద్దిందిరా సూత్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశం మనవాళికే వైతాలిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లి రా తన దేహాన్ని,ధైర్యన్ని పంచింది రా మనమేమిస్తే తీరేను ఆ ఋణము రా ఇక మనకేమి ఇచ్చింది అని అడగద్దు రా భారతీయులుగ పుట్టాము ఈ జన్మకిది చాలు రా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి తరం పిచ్చి కుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలాము రా మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి జడిలో తడిసినా చెక్కు చెదరని ఐకమత్యమొకటే సవాలు రా మానవుడే మా వే

I love my India

Image
జనని జన్మభూమిని స్వర్గమన్నదొక కవి కులం ఏది అది ఎక్కడో వెదకమంటుంది గురుకులం గుండె పిండుకుని తాగిన గుక్కెడు పాలు గురుతు లేనప్పుడు పోత పాల సీసాల కోసం పరుగులాటలే ఎపుడు ఆకాశంలో ఆ సుర్యుడొక్కడే అభ్యుదయంలో నా దేశమొక్కటే ఆ సూర్యుడెప్పుదు తూర్పు దిక్కునే ఎందుకు పుడతాడు కల్యాణ తిలకమై కన్నతల్లి ఒడిలోనే ఉంటాడు అలాంటిదేరా నా భారతదేశం సనాతనంలో సమిష్టి దేశం ఆ సనాతనం తన పునాదిలోనే సంకలమవుతుంటే నా అభ్యుదయానికి సభ్య సమాజమే సమాధి కడుతుంటే తరతరాల దాస్యం తెంచుకున్న ఈ స్వరాజ్య దేశంలో యువతరాలు మళ్ళీ పరాయి బిచ్చకు పరుగులు తగునా పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశి జ్ఞానం సవారి కడుతుంటే ఆ కూలి డబ్బు డాలర్ల లోనే సుఖ జీవనముందంటే ఆ పాలి కాపు మీ పాలి శత్రువై తిరిగి వెళ్ళమంటే కడుపు తీపికే కన్నీటి రోదనై కన్న తండ్రికే అది మూగ వేదనై నారు పోసి నీరెట్టినోళ్ళకు ఫలితం ఏముంది ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ప్రతిష్ట ఏముంది ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి దురాగతాల తురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా ధర్మమా

Preamantaara...Kaadantaara

Image
ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెలుతుంటే అడిగినవన్ని ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటే ప్రేమంటారా కాదంటారా.... దిగులే పుట్టిన సమయంలో దైర్యం చెబుతుంటే గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనె వేడుకుంటే కష్టం కలిగిన ప్రతి పనిలొ సాయం చేస్తుంటే విజయం పొందిన వేళలలో వెనుతట్టి మెచ్చుకుంటే దాపరికాలే లేకుంటే లోపాలని సరి చేస్తుంటే ఆట పాట ఆనందం అన్నీ చెరి సగమౌతుంటే ప్రేమంటారా కాదంటారా... ఓ మనోహరి చెలి సఖి ఓ స్వయం వర దొర సఖా మనసు నీదని మనవి సేయని సఖి బ్రతుకు నీదని ప్రతిన బూనన సఖా నిను చూడలేక నిమిషమైన నిలువజాలనే సఖి …సఖి … నీ చెలిమి లేని క్షణములోన జగతిని జీవింప జాలనొయ్ సఖా …. సఖా … నటనకు జీవం పోస్తుంటే ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే మనసే కలవర పడుతుంటే ప్రేమంటారా అవునంటాను...

దేవతలారా రండి..

Image
దేవతలారా రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతిరాడనిపించె వరున్నే వరముగ ఇవ్వండి కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతిరాడనిపించె వరున్నే వరముగ ఇవ్వండి కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి శివ పార్వుతులేమో ఈ దంపతులనిపించాలి ప్రతి సంసారంలోను మా కధలే వినిపించాలి ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి మా ముంగిళిలోన పున్నమి పూల వెన్నెల విరియాలి మా చక్కని జంటచుక్కల తోట పరిపాలించాలి కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతిరాడనిపించె వరున్నే వరముగ ఇవ్వండి కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి తన ఎదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు నీ వగలే నగలంటు గారాలే కురిపిస్తాడు తన ఇంటికి కళ తెచ్చే మహలక్ష్మిగ పూజిస్తాడు తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోట నిధి నిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతిరాడనిపించె వరున్నే వరముగ ఇవ్వండి కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి దేవతలారా రండి మీ దీవెనలందించండి నో

Nanne nanne choosthu

Image
ఇరువురి పరిచయం తెలియని పరవశం తొలి తొలి అనుభవం పరువపు పరుగులే నన్నేనన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే చూపుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే నీకో నిజమే చెప్పనా నీకో నిజమే చెప్పనా నా మదిలో మాటే చెప్పనా ఎదలో ఏదో తుంటరి తిళ్ళానా నాలో ఏదో అల్లరి అది నిన్న మొన్న లేనిది మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా ఓహువొహ ఒహువొహ ఎమిటంటారో ఈ మాయనీ ఓహువొహ ఒహువొహ ఎవరినడగాలో ప్రేమేనా అని నన్నేనన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే చూపుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే ఇదివరకెరుగని స్వరములు పలికెను పగడపు జిలుగులు పెదాల మీద బిడియములెరుగని గడసరి సొగసుకు తమకములెగసెను నరాలలోన ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో నా వాటం మొత్తం ఎంతో మారింది ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో నా ప్రాయం మాత్రం నిన్నే కోరింది ఓఉ వఓఉవవ నన్నేనన్నే మార్చి నీ మాటల్తో ఏమార్చి ప్రేమించే దైర్యం నాలో పెంచావోయి కన్ను కన్ను చేర్చి నా కల్లోకే నువ్వొచ్చి ఏకంగా బరిలోకే దించావోయి చెలిమను పరిమళం మనిషికి తొలివరం ఇరువురి పరిచయం తెలియని పరవశం తొలి తొలి అనుభవం పర

E chilipi kallalona kalavo

Image
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వు అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో నువ్వు అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో కరిమబ్బుల్లోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా బొండుమల్లెపువ్వు కన్న తేలుకగు నీ సోకు రెండు కళ్ళు మూసుకున్న లాగు మరి నీ వైపు సొగసును చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా హలా వింతల్లోన కొత్త వింత నువ్వేనాఆ అందం అంటే అచ్చంగా నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఆ పలుకులలో పరవళ్ళు తూలే కులుకులలో కొడవల్లు నిన్ను చూసి వంగుతుంది ఆశపడి ఆకాశం ఆ మబ్బుచీర పంపుతుంది మోజు పడి నీకోసం స్వరముల తీపి కోయిల ఇలా పరుగులు తీయకే అల అలా నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వు అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో నువ్వు అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో కరిమబ్బుల్లోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూ

Gundello emundo

Image
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది నిలవదు కద హృదయం నువ్వు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసాహొ మనసా హొ మనసా పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఇపుడన్నది నేనెప్పుడు విననిది నిన్నిలా చూసి పైనుంచి వెన్నెలే చిన్నబోతుంది కన్నులే దాటి కలలన్ని ఎదురుగా వచ్చినట్టుంది ఏమో ఇదంత నిజంగా కలలగానే ఉంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది ఎక్కడ జరగని వింతేమి కాదే ఇది పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతుంది పరిణయం దాక నడిపించే పరిచయం తోడు కోరింది దూరం తొలొంచే ముహుర్తం ఇంకెపుడొస్తుంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది నిలవదు కద హృదయం నువ్వు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా హొ మనసా హొ మనస

Kannulaku choopandham

Image
కన్నులకు చూపందం కవితలకు ఊహందం చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం కన్నులకు చూపందం కవితలకు ఊహందం కన్నులకు చూపందం కవితలకు ఊహందం చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం కిరణాలు రవికందం సెలయేరు భువికందం మగువలకు కురులందం మమతలకు మనసందం పుత్తడికి మెరుపందం పున్నమికి శశి అందం పుత్తడికి మెరుపందం పున్నమికి శశి అందం నాధాలు శృతికందం రాగాలు కృతికందం కన్నులకు చూపందం కవితలకు ఊహందం చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం కన్నులకు చూపందం కవితలకు ఊహందం చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం వేకువకు వెలుగందం రేయంత అతివందం వేసవికి వెన్నెలందం ఆశలకు వలపందం తలపులే మదికందం వయసుకే ప్రేమందం తలపులే మదికందం వయసుకే ప్రేమందం పాటకే తెలుగందం శ్రీమతికి నేనందం కన్నులకు చూపందం కవితలకు ఊహందం చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం కన్నులకు చూపందం కవితలకు ఊహందం చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం http://www.youtube.com/watch?v=mh2g_fa95yw

Madhura murali

Image
మధుర మురళి హృదయ రవళి అధర సుధల యమున పొరలి పొంగే ఎద పొంగే... ఈ బృందవిహారాలలోన నా అందాలు నీవేరా కన్నా ఈ బృందవిహారాలలోన నా అందాలు నీవేరా కన్నా మధుర మురళి హృదయ రవళి ఎదలు పలుకు ప్రణయ కడలి సాగే సుడి రేగే... ఈ బృందవిహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా ఈ బృందవిహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో లేలేత వన్నె చిన్నె దోచే వేళల్లో పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో నాజూకులన్ని నాకే దక్కే వేళల్లో పగలో అవతారం రాత్రో శృంగారం ఎదలో తారంగం శ్రీవారికి రాగలెన్నైనా వేణువు ఒకటేలే రూపాలెన్నైనా హృదయం ఒకటేలే నాదే నీ గీతము.... నీదే ఈ సరసాల సంగీతం మధుర మురళి హృదయ రవళి ఎదలు పలుకు ప్రణయ కడలి సాగే సుడి రేగే... ఈ బృందవిహారాలలోన నా అందాలు నీవేరా కన్నా ఈ బృందవిహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా హేమంత వేళల్లో లేమంచు పందిట్లో నా వీణ ఉయ్యాలూగే నాలో ఈనాడు కార్తీక వెన్నెల్లో ఏకంత సీమల్లో ఆరాధనేదో సాగే అన్ని నీవాయే బుగ్గే మందారం మనసే మకరందం సిగ్గే సింధూరం శ్రీదేవికి అందాలెన్నైన అందేదొకటేలే ఆరురుతువుల్లో ఆమని మనదేలే పాటే అనురాగము... మన బాటే ఒక అందాల అనుబంధం మధుర మురళి హృదయ రవళి అధర సుధల యమున పొరలి పొంగే

Vaana megham

Image
వాన మేఘం మైమరపించే జీవం దేహమంత మోహం ఏమి మాయ దాహం మహా సుఖం తడి స్వరం ఇదో రకం చలి జ్వరం ఫలించెలే స్వయంవరం జ్వలించెలే నరం నరం నింగే నీలాలు జల్లే కన్నె ప్రేమలో ప్రేమ యాత్రలో వాన జల్లుగ పూలు రాలిన మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా వాన మేఘం మైమరపించే జీవం దేహమంత మోహం ఏమి మాయ దాహం నింగి నా ముంగిలై నీటి తోరణాలతో హొ వంగి నా పొంగులే వూగే చుంబనాలతో కన్ను కన్ను కవ్వింతలోతడిపొడి తుళ్ళింతలో కసికసి రెట్టింతలో అది ఇది అంటింతలో సయ్యాటాడే ఒయ్యారాలేమో లేత లేతగా చేతికందగ జాజి తీగలే నీటి వీణలై మీటుకున్న పాట చినుకులేరి చీర కట్టగా వాన మేఘం మైమరపించే జీవం దేహమంత మోహం ఏమి మాయ దాహం మహా సుఖం తడి స్వరం ఇదో రకం చలి జ్వరం ఫలించెలే స్వయంవరం జ్వలించెలే నరం నరం నింగే నీలాలు జల్లే కన్నె ప్రేమలో ప్రేమ యాత్రలో వాన జల్లుగ పూలు రాలిన మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా వాన మేఘం మైమరపించే జీవం దేహమంత మోహం ఏమి మాయ దాహం http://youtube.com/watch?v=nHV3UwO2K1g

Merupai saagaraa

Image
మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందినా ఏ మెరుపులు ఆపినా వెనకడుగేయక ముందుకు సాగరా నలుదిక్కులు నవ్వుతు ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కలనే ఇల దించెయ్ నీ శక్తిని యుక్తిగ చూపెయ్ నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండనే ఢీకొట్టరా అది ఎంత కస్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు విందుగా మురిసేనుగా మీ అమ్మ ఎక్కడున్నా చేయుతే ఇస్తుంటే ఓ స్నేహబంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం లేరా అడుగేయిరా వెనకడుగే లేక మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా కిందపడుతూ ఉన్న పైపైకి పరుగు తీసి అలలతో పోటి పడి చేరాలి కలల కడలి పందెమేది అయిన నీ పట్టుదలను చూసి ఒంటరై వణకాలిరా ఆ ఓటమైన హడలి అందరికి చేతుల్లో ఉంటుంది గీత నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత నీ కాళ్ళ అడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత వెయ్ రా చిందెయ్ రా విజయం నీదే మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా

Poosindi poosindi punnaga

Image
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేల లాగేసే సల్లంగ దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేల లాగేసే సల్లంగ దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా కలిసొచ్చేటి కాలాల కౌగిల్లలో కలలొచ్చాయిలే కలలొచేటి నీ కంటి పాపయిలే కధ చెప్పాయిలే అనుకోని రాగమే అనురాగ గీతమై వలపన్న గానమే ఒక వాయులీనమై పాడే మది పాడే పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేల లాగేసే సల్లంగ దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా కట్టుకుంది నా కవితే నీ కళలే కల్యాణిగా అరవిచ్చేటి ఆభేరి రాగాలకే స్వరమిచ్చావులే ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే అల ఎంకి పాటలే ఇల పూల తోటలై పసిమొగ్గ రేకులే పరువాల చూపులై పూసే విరబూసే పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేల లాగేసే సల్లంగ దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేల లాగేసే సల్లంగ దాని సన్న

Nee dharmam,nee sangham,nee desam nuvvu maravaddu

Image
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు సత్యం కోసం సతినే అమ్మినదెవరు? హరిశ్చంద్రుడు... తండ్రి మాటకై కానలకేగినదెవరు? శ్రీరామచంద్రుడు.... అన్నసేవకే అంకితమైనది ఎవరన్నా? లక్ష్మన్న......... పతియే దైవమని తరించి పొయినదెవరమ్మా? సీతమ్మ........... ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే నీ ధర్మం నీ ధర్మం మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న మేడిపండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్న వితంతువుల తలరాతలు మార్చి బ్రతుకులు పండించె కందుకూరి తెలుగు భారతిని ప్రజల గుండెలో తీరిచి దిద్దెను గురజాడ ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన సంఘం నీవు నిలిచిన ఈ సంఘం నీ సంఘం మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు స్వతంత్ర భారత రధసారధి అయి సమరాన దూకే నేతాజి సత్యాగ్రహమే సాధనగా స్వరాజ్యమే తెచ్చె బాపూజి గుండుకెదురుగ గుండె నిలిపెను అంధ్రకేసరి టంగుటూరి తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి అయేను అమరజీవి ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం నీవు పుట్టిన ఈ దేశం నీ ధర్మం నీ స

Eruvaka sagaloyi

Image
కల్లా కపటం కానని వాడా లోకం పోకడ తెలియని వాడా కల్లా కపటం కానని వాడా లోకం పోకడ తెలియని వాడా ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని ముళ్ళుగర్రను చేతబట్టుకునిఇల్లాలును నీ వెంట బెట్టుకుని ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా పడమటి దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలుగురిసే పడమటి దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలుగురిసే వాగులు వంకలు ఉరవడిజేసే ఎండిన బీళ్ళు ఇగుర్లు వేసే ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా కోటేరును సరిజూసి పన్నుకో ఎనపట దాపట ఎడ్లు దున్నుతూ కోటేరును సరిజూసి పన్నుకో ఎనపట దాపట ఎడ్లు దున్నుతూ సాలుతప్పక పంట వేసుకో విత్తనాలు విసిరిసిరి జల్లుకో ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా పొలలమ్ముకుని పోయేవాళ్ళు town లో మేడలు కట్టే వాళ్ళు bank లో డబ్బు దాచే వారు నీ శక్తిని గమనించరు వారు ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా పల్లేటూళ్ళలో చెల్లనివాళ్ళు po

car lo shikarukelle

Image
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపొతే నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపొతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకొవే కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో నిజా నిజాలు చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన మేడ గట్టిన చలువ రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా కడుపుకాలే కష్ట జీవులు ఒడలు విరిచి గనులు తొలచి కడుపుకాలే కష్ట జీవులు ఒడలు విరిచి గనులు తొలచి చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో నిజా నిజాలు గాలిలోన తేలిపొయే చీరగట్టిన చిన్నదాన గాలిలోన తేలిపొయే చీరగట్టిన చిన్నదాన జిలుగువెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా చిరుగు పాకల బడుగు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు చిరుగు పాకల బడుగు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో కారులో షికా

Padaveala radhika..

Image
పాడవేల రాధిక ప్రణయ సుధ గీతిక పాడవేల రాధిక ప్రణయ సుధ గీతిక పాడవేల రాధిక... ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో జీవితమే పులకించగ జీవితమే పులకించగ నీ వీణను సవరించి పాడవేల రాధిక... గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి ఏ మూలను పొంచి పొంచి వినుచున్నాడని ఎంచి పాడవేల రాధిక... వేణుగాన లోలుడు నీ వీణ మృధురవము విని వేణుగాన లోలుడు నీ వీణ మృధురవము విని ప్రియమారగ నిను చేరగ దయచేసెడి శుభవేళ పాడవేల రాధిక ప్రణయ సుధ గీతిక పాడవేల రాధిక... http://youtube.com/watch?v=ilg-YM6B0jk