Kallaloki kallu petti chudavenduku


కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు

మనం అన్నది ఒకే మాటని
నాకిన్నాళ్ళు తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే
నమ్మనంటు ఉంది మనసు

ఓ ఓ ఓ ఓ ఓఓఓహొ
ఓ ఓ ఓ ఓ ఓఓఓహొ

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు

ఈనాడే సరికొత్తగ మొదలైందా మన జీవితం
గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం

కనులు మూసుకుని ఏం లాభం
కలై పోదుగా ఈ సత్యం
ఎటు తేల్చని నీ మౌనం
ఎటో తెలియని ప్రయాణం

ప్రతి క్షణం ఎదురై నన్నే దాటగలదా

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు

గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
మోహ బయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా

నిన్నా మొన్నలన్ని నిలువెల్ల
నిత్యం నిన్ను తడిమే వేళ
తడే దాచుకున్న మేఘం లా
ఆకశాన్న నువ్వు ఎటు ఉన్నా

చినుకులా కరగక శిలై ఉండగలవా

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు

మనం అన్నది ఒకే మాటని
నాకిన్నాళ్ళు తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే
నమ్మనంటు ఉంది మనసు

ఓ ఓ ఓ ఓ ఓఓఓహొ
ఓ ఓ ఓ ఓ ఓఓఓహొ

http://youtube.com/watch?v=j2XWSeHGLTc

Comments

Popular posts from this blog

Eppudu oppukovaddura otami...

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki