Repalliya eda jhalluna pongina ravali


రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి..మోహన మురళి
ఇదేనా ఆ మురళి

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి..మోహన మురళి
ఇదేనా ఆ మురళి

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆ బాల గోపాల మా బాల గోపాలుని

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆ బాల గోపాల మా బాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడా
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడా
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి

ఇదేనా..ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి..మరులే కురిపించి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి..మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమై
జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కలువల కన్నుల వెన్నెల దోచిన మురళి

ఇదేనా..ఇదేనా ఆ మురళి

వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళి ఆనందన మురళి
ఇదేనా ఆ మురళి..మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి

మధురానగరిలో యమున లహరిలో
ఆ రాధ ఆరాధన గీతి పలికించి

మధురానగరిలో యమున లహరిలో
ఆ రాధ ఆరాధన గీతి పలికించి
సంగీత నాత్యాల సంగమ శుక వేణువై
సంగీత నాత్యాల సంగమ శుక వేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి

ఇదేనా..ఇదేనా ఆ మురళి

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి..మోహన మురళి
ఇదేనా ఆ మురళి
http://youtube.com/watch?v=Do3XIo7sBh0

Comments

Blogger said…
Does anyone know what is the raga of this song ? It is very soothing to listne to.
Blogger said…
Does anyone know what is the raga of this song ? It is very soothing to listne to.

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki