Manasuna unnadi

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటకి రాదే ఎలా
అతనిని చూస్తే రెప్పలు వాలిపొయే బిదియం అపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపొయే తలపులు చూపేదెలా
ఒకసారే దరి చేరే ఎద గొడవేమిటో తెలపకపొతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా

చింత నిప్పైన చల్లంగ ఉందని
ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలుచుకునే వేడిలో

ప్రేమ అంటేనే తీయని బాధని
లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో

కనపడుతుందా నా ప్రియమైన నీకు నా ఎద కోత అని అడగాలని
అనుకుంటు తన చుట్టూ మది తిరిగిందని తెలపకపొతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా

నీలి కన్నుల్లో అతని బొమ్మని
చూసి నాకింక చోటెక్కడుందని
నిదరే కసురుకునే రేయిలో

మేలుకున్నాయి నువ్వింత కైపని
వేల ఊహల్లో ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో

వినపదుతుందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతే లేదని తెలపకపొతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటకి రాదే ఎలా
అతనిని చూస్తే రెప్పలు వాలిపొయే బిదియం అపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపొయే తలపులు చూపేదెలా
ఒకసారే దరి చేరే ఎద గొడవేమిటో తెలపకపొతే ఎలా

http://youtube.com/watch?v=jOw2IypDhXE

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu