I love my India


జనని జన్మభూమిని స్వర్గమన్నదొక కవి కులం
ఏది అది ఎక్కడో వెదకమంటుంది గురుకులం

గుండె పిండుకుని తాగిన గుక్కెడు పాలు గురుతు లేనప్పుడు
పోత పాల సీసాల కోసం పరుగులాటలే ఎపుడు

ఆకాశంలో ఆ సుర్యుడొక్కడే
అభ్యుదయంలో నా దేశమొక్కటే

ఆ సూర్యుడెప్పుదు తూర్పు దిక్కునే ఎందుకు పుడతాడు
కల్యాణ తిలకమై కన్నతల్లి ఒడిలోనే ఉంటాడు

అలాంటిదేరా నా భారతదేశం
సనాతనంలో సమిష్టి దేశం

ఆ సనాతనం తన పునాదిలోనే సంకలమవుతుంటే
నా అభ్యుదయానికి సభ్య సమాజమే సమాధి కడుతుంటే
తరతరాల దాస్యం తెంచుకున్న ఈ స్వరాజ్య దేశంలో
యువతరాలు మళ్ళీ పరాయి బిచ్చకు పరుగులు తగునా
పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశి జ్ఞానం సవారి కడుతుంటే
ఆ కూలి డబ్బు డాలర్ల లోనే సుఖ జీవనముందంటే
ఆ పాలి కాపు మీ పాలి శత్రువై తిరిగి వెళ్ళమంటే

కడుపు తీపికే కన్నీటి రోదనై
కన్న తండ్రికే అది మూగ వేదనై
నారు పోసి నీరెట్టినోళ్ళకు ఫలితం ఏముంది
ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ప్రతిష్ట ఏముంది

ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి
దురాగతాల తురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా ధర్మమా

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki