Muddabanti navvulo


ముద్దబంతి నవ్వులో మూగ బాసలు

ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు

చదువుకునే మనసుంటే ఓ కొయిలా
చదువుకునే మనసుంటే ఓ కొయిలా
మధుమాసమే అవుతుంది అన్ని వేళల
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు

బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత

ఇంత చోటు లోనే అంత మనసు ఉంచి
ఇంత చోటు లోనే అంత మనసు ఉంచి
నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు

ముద్దబంతి నవ్వులో మూగ బాసలు

అందమైన తొలిరేయి స్వాగతానికి
మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు
ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును
గుడిలోనికి రమ్మంది ఈ దైవము

మాటనోచుకోని ఒక పేదరాలిని
మాటనోచుకోని ఒక పేదరాలిని
నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు

చదువుకునే మనసుంటే ఓ కొయిలా
మధుమాసమే అవుతుంది అన్ని వేళల
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు

ముద్దబంతి నవ్వులో మూగ బాసలు

http://youtube.com/watch?v=I2hiCrgmmbc

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu