E janda


ఈ జండా పసి బోసి చిరునవ్వు రా.. దాస్య సంకెళ్ళు తెంచింది రా
ఈ జండా అమరుల తుది శ్వాస రా..రక్త తిలకాలు దిద్దిందిరా

వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా
మన ఎనలేని త్యాగాల ఘన చరితరా
తన చనుబాలతో పోరు నేర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా

వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి తరం

ఈ జండా పసి బోసి చిరునవ్వు రా.. దాస్య సంకెళ్ళు తెంచింది రా
ఈ జండా అమరుల తుది శ్వాస రా..రక్త తిలకాలు దిద్దిందిరా

సూత్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశం
మనవాళికే వైతాలిక గీతం రా భారతం
ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం
ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం

ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం

ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లి రా
తన దేహాన్ని,ధైర్యన్ని పంచింది రా
మనమేమిస్తే తీరేను ఆ ఋణము రా
ఇక మనకేమి ఇచ్చింది అని అడగద్దు రా
భారతీయులుగ పుట్టాము ఈ జన్మకిది చాలు రా

వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి తరం

పిచ్చి కుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా
వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలాము రా
మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి జడిలో తడిసినా
చెక్కు చెదరని ఐకమత్యమొకటే సవాలు రా

మానవుడే మా వేదం మానవతే సందేశం

మా శతకోటి హృదయాలదొక మాట రా
మా పిడికిలితో అనిచేము మీ బలుపు రా
చావు ఎదురైన బయపడదు మా గుండె రా
శత్రువెవరైన తలవంచదీ జెండ రా
ఫిరంగుల్ని ఎదిరించి తొడ కొట్టి నిలిచిందిరా

వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి తరం

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu