Neevu leka veena


నీవు లేక వీణ పలుకలేనన్నది
నీవు రాక రాధ నిలువలేనన్నది

నీవు లేక వీణ...

జాజిపూలు నీకై రోజు రోజు పూచే
చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే
చందమామ నీకై తొంగి తొంగి చూచి
చందమామ నీకై తొంగి తొంగి చూచి
సరసను లేవని అలుకలు బోయే

నీవు లేక వీణ...

కలనైన నిన్ను కనులచూదమన్నా
నిదుర రాని నాకు కలలు కూడా రావే
కదలలేని కాలం విరహ గీతి రేపి
కదలలేని కాలం విరహ గీతి రేపి
పరువము వృధగా బరువుగ సాగే

నీవు లేక వీణ...

తలుపులన్ని నీకై తెరచి ఉంచినాను
తలపులన్ని నీకై దాచి వేచినాను
తాపమింక నేను ఓపలేను స్వామి
తాపమింక నేను ఓపలేను స్వామి
తరుణిని కరుణను ఏలగ రావా

నీవు లేక వీణ పలుకలేనన్నది
నీవు రాక రాధ నిలువలేనన్నది

నీవు లేక వీణ...

http://youtube.com/watch?v=oGIHGO9wYN0

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu