Gundello emundo


గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది
నిలవదు కద హృదయం నువ్వు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే

కలవరమో తొలివరమో తెలియని తరుణమిది

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది

మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా మనసా
మనసాహొ మనసా హొ మనసా

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడు విననిది
నిన్నిలా చూసి పైనుంచి వెన్నెలే చిన్నబోతుంది
కన్నులే దాటి కలలన్ని ఎదురుగా వచ్చినట్టుంది

ఏమో ఇదంత నిజంగా కలలగానే ఉంది

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది

ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది
ఎక్కడ జరగని వింతేమి కాదే ఇది
పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతుంది
పరిణయం దాక నడిపించే పరిచయం తోడు కోరింది

దూరం తొలొంచే ముహుర్తం ఇంకెపుడొస్తుంది

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది
నిలవదు కద హృదయం నువ్వు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే

కలవరమో తొలివరమో తెలియని తరుణమిది

మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా మనసా
మనసా హొ మనసా హొ మనసా

http://youtube.com/watch?v=QnNiLneQ_Ms

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu