అహొ ఒక మనసుకు నేడే పుట్టిన రోజు


అహొ ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహొ తన పల్లవి పాడే చల్లని రొజు

ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు

అహొ ఒక మనసు కు నేడే పుట్టినరోజు
అహొ తన పల్లవి పాడే చల్లని రొజు

మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగ మది
కమ్మని తలపుల కావ్యమయి కవితలు రాసే మౌనమది
రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది
శృతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది

ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం
బ్రతుకును పాటగ మలిచేదిమనసున కదిలిన మృదునాదం
కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది
అదే కదా వారధి క్షణాలకే సారధి మనస్సనేది

అహొ ఒక మనసు కు నేడే పుట్టినరోజు
అహొ తన పల్లవి పాడే చల్లని రొజు

చూపులకెన్నడు దొరకనిది రంగురూపు లేని మది
రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది
వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల తరగల నిండు మది
కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది

చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం
కొమ్మల చాటున కొయిలలా కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి అమృత వర్షిని అనిపించే
అముల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది

అహొ ఒక మనసు కు నేడే పుట్టినరోజు
అహొ తన పల్లవి పాడే చల్లని రొజు
ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu