Preamantaara...Kaadantaara


ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెలుతుంటే
అడిగినవన్ని ఇస్తుంటే
అవసరమే తీరుస్తుంటే

ప్రేమంటారా
కాదంటారా....

దిగులే పుట్టిన సమయంలో దైర్యం చెబుతుంటే
గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనె వేడుకుంటే
కష్టం కలిగిన ప్రతి పనిలొ సాయం చేస్తుంటే
విజయం పొందిన వేళలలో వెనుతట్టి మెచ్చుకుంటే

దాపరికాలే లేకుంటే లోపాలని సరి చేస్తుంటే
ఆట పాట ఆనందం అన్నీ చెరి సగమౌతుంటే

ప్రేమంటారా
కాదంటారా...

ఓ మనోహరి చెలి సఖి
ఓ స్వయం వర దొర సఖా
మనసు నీదని మనవి సేయని సఖి
బ్రతుకు నీదని ప్రతిన బూనన సఖా

నిను చూడలేక నిమిషమైన నిలువజాలనే సఖి …సఖి …
నీ చెలిమి లేని క్షణములోన జగతిని జీవింప జాలనొయ్ సఖా …. సఖా …

నటనకు జీవం పోస్తుంటే
ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే
మనసే కలవర పడుతుంటే

ప్రేమంటారా
అవునంటాను...

Comments

sai said…
keeravani pataku pranam postadu

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu