Nee dharmam,nee sangham,nee desam nuvvu maravaddu
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
సత్యం కోసం సతినే అమ్మినదెవరు?
హరిశ్చంద్రుడు...
తండ్రి మాటకై కానలకేగినదెవరు?
శ్రీరామచంద్రుడు....
అన్నసేవకే అంకితమైనది ఎవరన్నా?
లక్ష్మన్న.........
పతియే దైవమని తరించి పొయినదెవరమ్మా?
సీతమ్మ...........
ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం
అనుసరించుటే నీ ధర్మం
నీ ధర్మం మరవద్దు

చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న
మేడిపండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్న
వితంతువుల తలరాతలు మార్చి బ్రతుకులు పండించె కందుకూరి
తెలుగు భారతిని ప్రజల గుండెలో తీరిచి దిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన సంఘం
నీవు నిలిచిన ఈ సంఘం
నీ సంఘం మరవద్దు

స్వతంత్ర భారత రధసారధి అయి సమరాన దూకే నేతాజి
సత్యాగ్రహమే సాధనగా స్వరాజ్యమే తెచ్చె బాపూజి
గుండుకెదురుగ గుండె నిలిపెను అంధ్రకేసరి టంగుటూరి
తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి అయేను అమరజీవి
ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం
నీవు పుట్టిన ఈ దేశం

http://youtube.com/watch?v=obOY43Dnis8

Comments