Eruvaka sagaloyi


కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా
కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా

ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా

నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని
నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని
ముళ్ళుగర్రను చేతబట్టుకునిఇల్లాలును నీ వెంట బెట్టుకుని

ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా

పడమటి దిక్కున వరద గుడేసే
ఉరుముల మెరుపుల వానలుగురిసే
పడమటి దిక్కున వరద గుడేసే
ఉరుముల మెరుపుల వానలుగురిసే
వాగులు వంకలు ఉరవడిజేసే
ఎండిన బీళ్ళు ఇగుర్లు వేసే

ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా

కోటేరును సరిజూసి పన్నుకో
ఎనపట దాపట ఎడ్లు దున్నుతూ
కోటేరును సరిజూసి పన్నుకో
ఎనపట దాపట ఎడ్లు దున్నుతూ
సాలుతప్పక పంట వేసుకో
విత్తనాలు విసిరిసిరి జల్లుకో

ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా

పొలలమ్ముకుని పోయేవాళ్ళు
town లో మేడలు కట్టే వాళ్ళు
bank లో డబ్బు దాచే వారు
నీ శక్తిని గమనించరు వారు

ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా

పల్లేటూళ్ళలో చెల్లనివాళ్ళు
politics తో బ్రతికే వాళ్ళు
ప్రజాసేవయని అరచే వాళ్ళు
ప్రజాసేవయని అరచే వాళ్ళు
ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు

ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా

పదవులు స్థిరమని బ్రమసే వాళ్ళే
ఓట్లు గుంజి నిను వగచే వళ్ళే
నీవే దిక్కని వత్తురు త్వరలో

రోజులు మారాయ్ రోజులు మారాయ్
మారాయ్ మారాయ్ రోజులు మారాయ్

ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా

http://youtube.com/watch?v=k7ilPsEGq5Y

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki