Posts

Showing posts from February, 2008

నా ప్రేమ నవపారిజాతం..

Image
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నీ ఎద వీణపై మన కధ మీటగా నీ ఎద వీణపై మన కధ మీటగా అనురాగాల రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానా నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం వేదంలో స్వరంలా స్థిరంగా సాగాలి సుఖంగా శుభంగా స్నేహంలో యుగాలే క్షణాలై నిలవాలి వరాలై నిజాలై గతజన్మ బంధాలు నేడు జతకూడి రావాలి తోడు గగనాల పందిళ్ళలోన సగభాగమవుతాను నీకు ఇక సుముహుర్త మంత్రాలలోన శృతి చేయి అనురాగ వీణ నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం ఈనాడే ఫలించే తపస్సే ప్రేమించి వరించే వయస్సే లొకాలే జయించే మనస్సే నీ కోసం నిజంగా జపించే సరసాల సమయాలలోన మనసార పెనవేసుకోనా అణువైన నా గుండెలోన కడదాక నిను దాచుకోనా ఇక సిరిమల్లె తలంబ్రాలలోన నా పరువాలు పండించుకోనా నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నీ ఎద వీణపై మన కధ మీటగా నీ ఎద వీణపై మన కధ మీటగా అనురాగాల రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానా http://youtube.com/watch?v=krzeE2ZUipw

Kotta bangaaru lokam

Image
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం జంట నెలవంకలుండే నింగి కావాలి మాకు వెండి వెన్నెల్లలోనే వేయి కలలు పండాలి మాకు పువ్వులే నోరు తెరచి మధుర రాగాలు నేర్చి పాటలే పాడుకొవాలి అది చూసి నే పొంగిపోవాలి మనసనే ఒక సంపద ప్రతి మనిషిలోను ఉండని మమతలే ప్రతి మనసులో కొలువుండనీ మనుగడే ఒక పండగై కొనసాగనీ కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం ఓడిపోవాలి స్వార్ధం ఇల మరచిపోవాలి యుద్ధం మరణమేలేని మనవులే ఈ మహిని నిలవాలి కలకాలం ఆకలే సమసిపోనీ అమృతం పొంగిపోని శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడనీ ప్రతినిత్యం వేదనే ఇక తొలగనే వేడుకే ఇక వెలగనీ ఎల్లలా పొరాటమే ఇక తీరనీ ఎల్లరూ సుఖశాంతితో ఇక బ్రతకనీ కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం

Bhakti

Image
Sri venkateswara suprabhatam:: http://www.esnips.com/doc/e4b2e2b0-d0a1-44e0-9de0-00a61b242489/SRI-VENKATESWARA-SUPRABHATAM-IN-TELUGU-VIDEO sri vishnu sahasranamam:: http://www.esnips.com/doc/9f4634da-49d1-4842-8e8b-bf5dddcc7f03/VISHNU-SAHASRANAMA-STOTRAM-IN-TELUGU-VIDEO Mahishasura mardhini stotram:: http://www.esnips.com/doc/5c02a269-16bd-4275-bf11-e623224f4176/MAHISHASURA-MARDINI-STOTRAM-IN-TELUGU-VIDEO Gayatri mantram: http://www.esnips.com/doc/6f354693-9d14-42aa-a7d8-8ed7b4a9a431/Gayathri-Mantram Asta Lakshmi stotram: http://www.esnips.com/doc/2113baad-f1ad-4450-b1f3-ae4be67afc5b/Ashtalakshmi-Stotram sri Lalitha sahasra namam:: http://www.esnips.com/doc/39f12dfd-a5f2-4501-adaf-5c32e38f79a7/SREE-LALITHA-SHASRANAMAM

bugge bangaarama

Image
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా పట్టు చీరల్లో చందమామా ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాల కోనసీమా కోటి తారల్లొ ముద్దు గుమ్మా బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా ఎదురే నిలిచే అధర మధుర దరహాసం ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం వెలిగే అందం... చెలికే సొంతం వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలో జరిగే విహారమ్మ్ పుష్య మాసాన మంచు నీవో భోగి మంటల్లొ వేడి నీవో పూల గంధాల గాలి నీవో పాల నురుగల్లో తీపి నీవో బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులాగా సందె గాలి కొట్టగానే ఆరుబయట ఎన్నెలింట సర్దుకున్న కన్నె జంట సద్దులాయెరో ఎదలో జరిగే విరహ సెగల వనవాసం బదులే అడిగే మొదటి వలపు అభిషేకం వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో జతగా పిలిచే అగరు పొగల సవాసం జడతో జగడంజరిగే సరసం ఎపుదో అన్ని పువ్వుల్లో అమె నవ్వే అన్ని రంగుల్లో అమె రూపే అన్ని వేళల్లొ ఆమె ధ్యాసే నన్ను మొత్తంగా మాయ చెసే బుగ్గే బంగారమా

pacchani chilukalu todunte

Image
పచ్చని చిలుకలు తోడుంటే ....పాడే కోయిల వెంటుంటే భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు పచ్చని చిలకలు తోడుంటే.... పాడే కోయిల వెంటుంటే భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే... అరెచిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే సీతాకోకా చిలుకకు చీరలెందుకు... అరెప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట పచ్చని చిలుకలు........ అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం.. అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం... చెలియ వయసుడిగే స్వగతంలో అనుభందం అనందమానందం పచ్చని చిలుకలు..... నీ శ్వాసను నేనైతే...నా వయసే ఆనందం మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం... నాచెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం అందం ఓ ఆనందం బంధం పరమానందం... చెలియా ఇతరులకై కను జారే కన్నీరే అనంద మానందం పచ్చని చిలుకలు.....

sita ramula kalyanam chootamu raarandi

Image
సీతరాముల కల్యాణము చూతము రారండి శ్రీ సీతరాముల కల్యాణము చూతము రారండి సిరి కల్యాణపు బొట్టును పెట్టి...బొట్టును పెట్టి మణి బాసికమును నుదుటనుగట్టి ..నుదుటనుగట్టి పారాణిని పాదాలకు పెట్టి ...ఆ ఆ ఆ ఆ ఆ పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన సీత..కల్యాణము చూతము రారండి శ్రీ సీతరాముల కల్యాణము చూతము రారండి సంపెగి నూనెను కురులను దువ్వి...కురలను దువ్వి సొంపుగ కస్తూరి నామము దిద్ది..నామము దిద్ది చంపగ వాసి చుక్కను పెట్టి..పెళ్ళికొడుకై వెలసిన రాముని కల్యాణము చూతము రారండి శ్రీ సీతరాముల కల్యాణము చూతము రారండి జానకి దోసిట కెంపుల బ్రోవై రాముని దోసిట నీలపు రాసై ఆణిముత్యములు తలంబ్రాలుగా.....ఆ ఆ ఆ ఆ ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇదమున మెరసిన సీతరాముల..కల్యాణము చూతము రారండి శ్రీ సీతరాముల కల్యాణము చూతము రారండి http://www.youtube.com/watch?v=2O0FTnn6F_A

nammaka tappani nijamaina...

Image
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపుల నొదిలేనా ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా నువ్వొదిలిన ఈ ఏకాంతం లోనా కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయిన ఇప్పటికీ ఆ కలలో నే ఉన్నా నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా నా వెనువెంట నువ్వే లేకుండారోజూ చూసిన ఏ చోటైన నను గుర్తిస్తుందా నిలువున నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అల తడి కనులతో నిను వెతికేది అలా నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే వేదనలోఎన్నాళ్ళైన ఈ నడిరాతిరి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిచయమా సిరివెన్నెల పరిమళమాచేజారిన ఆశల తొలివరమా నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా http://youtube.com/watch?v=X6hDIs75Ygc

sirimalle neeve-virijallu kaave

Image
సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటె నీవే ఎన్నెల్లు తేవె ఎద మీటి పొవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఎలదేటి పాట చేలరేగే నాలో చెలరేగిపోవే మధుమాసమల్లే ఎల మావి తోట పలికింది నాలో పలికించుకొవే మది కొయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలి పూతలోనే వన దేవతల్లే పున్నాగ పూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవె ఎద మీటి పొవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే మరుమల్లె తొట మారాకు వేసే మారకు వేసే నీ రాక తోనే నీ పలుకు పాటై బ్రతుకైన వెళ బ్రతికించుకోవే నా పదము నీదే నీ పదము నాదే నా బ్రతుకు నీదే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవె ఎద మీటి పొవే సిరిమల్లె నీవె విరిజల్లు కావే http://youtube.com/watch?v=RxF-jon6LNg

mellagaa karagani

Image
మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లుని వంతెన వేసిన శుభవేళా ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ ఈ బంధం మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా ఆ ఉరుములు లోన నీ పిలుపులు వింటున్నా ఈ చిట పటలో చిటికెల తాళం నీదేనా మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా జత పడే స్నేహమై అనునయించనా చలి పిడుగుల సడి విని జడిసిన బిడియం తడబడి నిను విడదా ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ ఈ బంధం మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం ఈ పెనుమరుగైన ఈ చొరవను ఆపేనా నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా ఏ చిరు చినుకైన నీ సిరులను చూపేనా ఆ వరుణికే రుణపడిపోనా ఈ పైనా త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైన విడుదలే వద్దని ముద్దులియ్యనా మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపన

asalemi gurtuku raadhu

Image
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా అసలేం గుర్తుకురాదు గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ ఆకుపచ్చని ఆశతో నిన్ను కప్పుకు చిగురించనీ అల్లుకొమ్మని గిల్లుతున్నది చల్లచల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ అసలేం గుర్తుకురాదు కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం జంట మధ్యన సన్నజాజులు హాహాకారం మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి ఈ రోజు రమ్మన్నా రాదేమో నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం అసలేం గుర్తుకురాదు http://www.megavideo.com/?v=RUM1IR0P

Naalo uuhalaku

http://www.youtube.com/watch?v=4un6LSF9Yns

vennalave vennelave

Image
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం చెలి అందాల,చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం పిల్లా...పిల్లా ..భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పారేను కుసుమాలు పచ్చ గడ్డి మీనా ఏ పువ్వుల్లో తడి అందాలే అందాలి ఈ వేళ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా ఎత్తైనా గగనంలో నిలిపే వారెవరంట కౌగిలిలో చిక్కుపడే గాలికి అడ్డెవరంట ఇది గిల్లి గిల్లి వసంతమే ఆడించెయ్యి హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు పిల్లా...పిల్లా..పూదోటా నిదొరొమ్మని పూలే వరించు వేళ పూతీగ కల లోపల తేనే గ్రహించు వేళ ఆ వయసే రసాల విందయితే ప్రేమల్నే ప్రేమించు వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే.... http://www.youtube.com/watch?v=fQ9hpWHNm4s

kinnerasani vachindamma....

Image
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి విశ్వనాధ కవితై....అది విరుల తేనె చినుకై కూనలమ్మ కులుకై... అది కూచిపూడి నడకై పచ్చని చేల పావడ గట్టి... పచ్చని చేల పావడ గట్టి కొండ మల్లెలే కొప్పున పెట్టి...వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి ఎండల కన్నే సోకని రాణి పల్లెకు రాణి పల్లవ పాణి కోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి కనుల గంగా పొంగే వేళ ,నదిలా తానే సాగే వేళ రాగాల రాదారి పూదారి అవుతుంటే ఆ రాగాల రాదారి పూదరి అవుతుంటే కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి మాగానమ్మా చీరలు నేసే మలి సంధ్యమ్మా కుంకుమ పూసే మువ్వల బొమ్మా ముద్దుల గుమ్మా మువ్వల బొమ్మా ముద్దుల గుమ్మా గడప దాటి నడిచే వేళ అదుపే విడిచి ఎగిరే వేళ వయ్యరి అందాలు గోదారి చూస్తుంటే ఈ వయ్యరి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి http://youtube.com/watch?v=MPsVi3hZosc

aa toorupu ee paschimam

Image
ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే ఆకాశంలో తారా, సుడిగాలికారని దీపం గుడి లేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే సాగరంలో కెరటం ఉప్పొంగిన నా హృదయం .. అలిసేది కాదు అనురాగం..ఈ జన్మ సంగీతం గ్రహణాలు లేని ఆ తారలన్ని గగన కలిసే ఈ వేళలోనే కలిసింధి ఈ బంధం కలిసింధి ఈ బంధం ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే... చైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే మనసైన మాటల కోసం మౌనాల ఆశలు పూసే ఎడేడు రంగుల దీపం ఆ నింగిలో హరి చాపం అరుణాల రుధిరంతోనే రుణమైనదీ ప్రియబంధం ఏ దేశమైనా ఆకాశమొకటే ఏ జంటకైనా అనురాగమొకటే అపురూపమీ ప్రణయం అపురూపమీ ప్రణయం ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే... http://youtube.com/watch?v=lsQwV-aee7s

andaanike ardhaanive

Image
I like these two lines of this song.... కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా...... కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా...... ----------------------------------------------------------------------------------- అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే అమ్మాయికే అర్ధానివే మాటున్న మనసున్న ముత్యానివే ముద్దొచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉంది చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ ఒక్కట్టయేందుకే ఇద్దరం ఉన్నదీ నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవి నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నవి వెల వెల వెల వెల ఉప్పెన నేనై వస్తానే కల కల కల కల మోముని చూస్తూ ఉంటాగల గల గల గల మువ్వని నేనై వస్తా నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లొ చోటున్నది నీ వాడిగా

ekkada ekkada vundho...

Image
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక నాకోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది యే వూరే అందమా ఆచూకి అందుమా కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా కులుకులొ ఆ మెలికెలు మెఘాలలో మెరుపులు పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు పదునులు ఆ చూపులు చురుకైన చుర కత్తులు పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు నా గుండెలో అదోమాదిరి నింపేయకే సుధామాధురి నా కళ్ళలో కలల పందిరి అల్లేయకోయి మహాపోకిరి మబ్బులో దాగుంది తనవైపే లాగింది సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది ఒహూ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని ఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని యేతోటలో తనుందోనని యెటు పంపనూ నా మనసుని ఏ నాడు ఇంతిదిగా కంగారే ఎరుగనుగా అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా http://www.youtube.

alanaati ramachadrudu

Image
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రం కనిపెంచిన కూన శ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మ వెన్నేలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిరాలేవని వెల వెల బోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయానా కళ కళ జంటను పదిమంది చూడంది తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షతలేయండి సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపాన గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని వొళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్ళి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి వివరములడగక బంధువులంతా కదలండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా వెన్న

Apudo epudo yepudo....

Image
అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కధలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి తీపికన్నా ఇంకా తీయనైన పేరే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే హాయికన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి నన్ను నేనే చాల తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పక పొతుంటే నన్ను నేనే ఎంతో మెచ్చుకుంటా ఎదో చిన్నమాటే నాతో నువ్వు మాటాడావంటే నాతొనే నెనుంటా నీ తోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి http://www.youtube.com/watch?v=ti-Inr_jyX0

Ne tolisaarigaa

Image
నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా స్వప్నమా ,నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా మౌనమో ,మధుర గానమో తనది అడగవే హౄదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా రెక్కలు తొడిగిన తలపు నువే కాదా నేస్తమా ఎక్కడ వాలను చెప్పు నువే సహవాసమా హద్దులు చెరిపిన చెలిమి నువై నడిపే దీపమా వద్దకు రాకని ఆపకిలా అనురాగమా నడకలు నేర్పిన ఆశవు కదా తడబడనీయకు కదిలిన కధ వెతికే మనసుకు మమతే పంచుమా ప్రేమా నీతో పరిచయమే ఎదో పాపమా అమౄతమనుకొని నమ్మటమే ఒక శాపమా నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా పెదవులపై చిరునవ్వుల దగా కనపడనీయవు నిప్పుల సెగ నీటికి ఆరని మంటల రూపమా నీ ఆటెఏమిటో ఏనాటికి ఆపవు కదా నీ పాటేమిటో ఏ జంటకి చూపవు కదా తెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చెలగాటమా చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా, తీరులో ప్రళయమా పంతమా బంధమా నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా http://youtube.com/watch?v=gGanV2EMC2I

Manasuna manasai

Image
మనసున మనసై ,బ్రతుకున బ్రతుకై మనసున మనసై,బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో, ఆవేదనలో,చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము నిన్ను నిన్నుగ ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నిన్ను నిన్నుగ ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు.. నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము చెలిమియే కరువై వలపే అరుదై చెదరిన హృదయమే శిల అయిపోగా నీ వ్యధ తెలిసి నీడగ నిలిచి తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున http://youtube.com/watch?v=6tMWoOqCA6k

Madhura swapnam

Image
ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను మధుర స్వప్నం మన మధుర స్వప్నం మధుర స్వప్నం మన మధుర స్వప్నం తొలిముద్దున తొనికిన స్వప్నం నడిపొద్దున నలిగిన స్వప్నం కలురెప్పల కౌగిళ్ళలొ కలబోసిన కమ్మని స్వప్నం నీలోన సగము నాలోన సగము ఒకటైన రూపం మన ప్రేమ దీపం ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను మురిపాల ముద్దుల మూటై విరబూసిన నవ్వుల తోటై హృదయాల ఉయ్యాలలొ ఎదిగొచ్చే అల్లరి ఆశై తొలి జోల పాటై మన కంటి పాపై నడయాడు బాబు పుడతాడు రేపు ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను మధుర స్వప్నం మన మధుర స్వప్నం మధుర స్వప్నం మన మధుర స్వప్నం

Naa manasuki pranam posi

Image
నా మనసుకి ప్రాణం పోసి... నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి ఓ ఓ ఓ... నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి మది తెర తెరచి ముగ్గే పరచి ఉన్నావు లోకం మరచి నా మనసుకి ప్రాణం పోసి.. నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి నీ చూపుకి సూర్యుడు చలువాయే నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే నీ చొరవకి, నీ చెలిమికి మొదలాయే మాయే మాయే నీ అడుగుకి ఆకులు పువులాయే నీ కులుకుకి కాకులు కవులాయే నీ కలలకి,నీ కధలకి కదలాడే హాయే హాయే అందంగా నన్నే పొగిడి ,ఆ పైన ఏదో అడిగి.. నా మనసనే ఒక సరుసులో అలజడులే సృస్టించావే నా మనసుకి ప్రాణం పోసి... నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి ఒక మాట ప్రేమగ పలకాలే ఒక అడుగు జత పడి నడవాలే ఆ గురుతులు నా గుండెలొ ప్రతి జన్మకు పదిలం పదిలం ఒకసారి ఒడిలో ఒదగాలే ఎదపైన నిదరేపోవాలే తియతియని నీ స్మృతలతో బ్రతికేస్తా నిమిషం నిమిషం నీ ఆశలు గమనించాలే నీ అతృత గుర్తించాలే ఎటు తేలక బదులీయక మౌనంగా చూస్తున్నాలే.... http://youtube.com/watch?v=_cP1ScgWMFw

Brundaavanamadi andharidhi

Image
బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే ఎందుకె రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే ఎందుకె రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే పిల్లనగ్రోవిని పిలుపులు వింటే ఉల్లము జల్లున పొంగదటే పిల్లనగ్రోవిని పిలుపులు వింటే ఉల్లము జల్లున పొంగదటే రాగములో అనురాగము చిందిన జగమే ఊయలలూగదటే రాగములో అనురాగము చిందిన జగమే ఊయలలూగదటే బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే రాసక్రీడల రమణుల గాంచిన ఆశలు మూసలు వేయవటే రాసక్రీడల రమణుల గాంచిన ఆశలు మూసలు వేయవటే ఎందుకె రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే ఎందుకె రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే http://www.youtube.com/watch?v=iKVUCJByIWg

janaki kalaganaledhu

Image
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం... మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు చెలి మనసే శివధనుసయనది తొలి చూపుల వశమైనది వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముడికి ఇధియశమైనది శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే తుది దాకా నీవే మరు జన్మకు నీవే జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు సహవాసం మనకు నివాశం సరిహద్దు నీలాకాశం ప్రతి పొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం బ్రతుకంటే నీవే కధకానిది నీవే కలలన్ని నావే కలకాలం నీవే రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం ....మన జీవన పారాయణం http://youtube.com/watch?v=3_qdZdzRvvg

janaki ramula kalyananiki

Image
జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో కన్ను కన్ను కలవగనే ప్రణయం రాగం తీసెనులే పాదం పాదం కలపగనే హృదయం తాళం వేసెనులే ఒకటే మాట,ఒకటే బాణం ఒక పత్ని శ్రీరామ వ్రతం నాలో,నీలో రాగం తీసి వలపే పలకే త్యాగయ కీర్తనలెన్నో జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో జానకి మేను తాకగనే జళ్ళున వీణలు పొంగినవి జాణకు పూతలు పూయగనే జావళి అందెలు మ్రోగినవి ప్రేమే సత్యం ప్రేమే నిత్యం ప్రేమే లేదా మయ్యమతం నాలో నీలో నాత్యాలాడి లయలే చిలికే రమదాసు కృతులెన్నో జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో http://youtube.com/watch?v=4bvOTbWTBgw

Mona mona mona...

Image
మోనా మోనా మోనా...... మీనా కనుల సోనా నీ పలుకే నా వీణా నీదా digital టోనా సుకుమారా మాటలతో నీ వసమే నేనైతే మహవీరా చుపులతో నా తనువే నీదైతే నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరాలి నువ్వాడే సరదా ఆటేదో winner నేనే కావాలి మోనా మోనా మోనా.... మీనా కనుల సోనా నీ పలుకే నా వీణా నీదా digital టోనా హిమమేదో కురియాలి చెక్కిల్లు తడవాలి నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి వరనేదో చెయ్యాలి చిరుగాలి వియ్యాలి వలపేంటో అడిగిందంటూ కౌగిట్లో చేరాలి చలి గిలి చేసెను మోనా తొలి ముద్దులకై రానా జరిగేది ఏమైనా జరగాలి కలలాగ ఆనందం అంబరమై నను నేను మరవాలా మోనా మోనా మోనా.... మీనా కనుల సోనా నీ పలుకే నా వీణా నీదా digital టోనా జపమేదో చెయ్యాలి హృదయాలు కలవాలి గగనాన తారల తొడై గళము విప్పి పాడాలి జతలన్ని మురియాలి ఒకటైన మన చూసి కధ అల్లుకోవాలి గణ చరితై నిలవాలి భ్రమలే నిజమే అవునా బ్రతుకే నీవనుకోనా చింతేల ప్రియ భామ నీ చెంత నే లేనా కొంతైన ఓపిక ఉంటే మోనా మోనా మోనా ...మీనా కనుల సోనా నీ పలుకే నా వీణా నీదా digital టోనా http://youtube.com/watch?v=lRadp-Bwo84

Ye chota vunnaa

Image
ఏ చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా........ నువ్వే నువ్వే కావలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం నేల వైపు చూసే నేరం చేసావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ బంధిస్తుందా మల్లె పూవుని ఏమంత పాపం ప్రేమా ప్రేమించడం ఇకనైనా చాలించమ్మా వేదించడం చెలిమై కురిసె సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాప లా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటె నా ప్రతి కల కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా నాక్కూడ చోటేలేని నా మనసులో ..నిన్ను ఉంచగలనా ప్రేమ యీ జన్మలో వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే http://youtube.com/watch?v=q9Vr7C0fRGA

ఏదో ప్రియరాగం వింటున్నా..

Image
ఏదో ప్రియరాగం వింటున్నా... చిరునవుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా ఏదో నవ నాట్యం చూస్తున్నా... సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా....ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైన ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే.. నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదొ తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం పాట పాడదా మౌనం పురి విప్పి ఆడదా ప్రాణం అడవినైన పూదోట చేయదా ప్రేమబాటలొ పయనం దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమా నీ సావాసం .....నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిధ్యం.... నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం... నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతి మాట వేదం నువ్వుంటే ప్రతి పలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనె నిండెను ఈ లోకం ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానే ఈ ముచ్చటైన మురిపాన ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముం

Chinuku tadiki

Image
ఛినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా మువ్వలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగె అందాల సెలయేరమ్మా ఆమని మధువనమా ... ఆమని మధువనమా ఛినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా పసిడి వేకువలు పండు వెన్నెలలు, పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ పచ్చనైన వరి చేల సంపదలు ,అచ్చ తెలుగు మురిపాల సంగతులు కళ్ళ ముందు నిలిపావే ముద్దుగుమ్మా పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా ఆ... ఆగని సంబరమా ఆ... ఆగని సంబరమా వరములన్ని నిను వెంటబెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నదే కుందనాల బొమ్మ సిరులరాణి నీ చేయి పట్టి శ్రీహరిగ మారునని రాసిపెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా ఆ... రాముని సుమ శరమా ఆ... రాముని సుమ శరమా ఛినుకు..... http://youtube.com/watch?v=1yfR5dGenlk

Nuvvenaa naa nuvvenaa

Image
నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లే సూది గుచ్చే సుప్రభాతమేనా మాటలాడే చూపులన్నీ మౌన రాగమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా. ఆఆనందమేనా... ఆనందమేనా నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు కలలేనా కన్నీరేనా తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు పువ్వు లాంటి గుండెలోన దారమల్లె దాగుతావు నేనేనా నీ రూపేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా కోయిలల్లె వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటె నవ్వుతావు ఏ రాగం ఇది ఏ తాళం మసక వెన్నెలల్లె నీవు ఇసుక తిన్నె చేరుతావు గస గసాల కౌగిలింతగుస గుసల్లే మారుతవు ప్రేమంటే నీ ప్రేమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా http://www.youtube.com/watch?v=KUymGHSFLiw

seetamma andaalu

Image
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో ఏకమైనా చోటా వేద మంత్రాలు ఏకమైనా చోటా వేద మంత్రాలు సీతమ్మ..... హరివిల్లు మాయింటి ఆకాశ బంతి సిరులున్న ఆ చేయ్యి శ్రీవారి చేయి హరివిల్లు మాయింటి ఆకాశ బంతి ఒంపులెన్నో పోయి రంప మేయంగా చినుకు చినుకు గారాలే చిత్రవరణాలు సొంపులన్ని గుండె గంఫకెత్తంగా సిగ్గులలోనే పుట్టెనమ్మ చిలక తాపాలు తళుకులై రాలేను తరుణి అందాలు తళుకులై రాలేను తరుణి అందాలు ఒక్కలై మెరిసేను ఒనుకు ముత్యాలు సీతమ్మ...... http://youtube.com/watch?v=UXeH679qF6w http://youtube.com/watch?v=JWg9yQRbp68

Vachche vachche...

Image
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా....గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా......గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా కళ్ళలోన పొంగుతున్న బాధలేన్నో మాకున్నై గుండేలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నై తీరుస్తారా బాధ తీరుస్తారా గాలి వాన లాలి పడేస్తారా పిల్ల పాపల వాన......బుల్లి పడవల వాన చదువు బాధలే తీర్చి..... సెలవులిచ్చిన వాన గాలి వాన కబడ్డి......వేడి వేడి పకోడి ఈడు జోడు డి డి డి..... తోడుండాలి ఓ లేడి ఇంద్ర ధనస్సులో తళుకు మనె ఎన్ని రంగులో ఇంతి సొగసులే తడిసినవి నీటి కొంగులో శ్రావణ మాసాల జలతరంగం జీవన రాగాల కిది ఓ మృదంగం కళ్ళలోన పొంగుతున్న బాధలేన్నో మాకున్నై గుండేలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నై తీరుస్తారా బాధ తీరుస్తారా గాలి వాన లాలి పడేస్తారా వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా..... కోరి వచ్చినా ఈ వాన...గోరు వెచ్చనయి నాలోన ముగ్గుల సిగ్గు ముసిరేస్తే ముద్దు లాటిదే మురిపాలా...మెరిసే మెరిసే అందాలు తడిసే తడిసే పరువాలు గాలి వానలా పందిళ్ళు కౌగిలింతలా పెళ్ళిళ్ళు నెమలి ఈకలో ఉలికి పడే ఎవరి కన్నులో చినుకు చాటునా చిటికేలతో ఎదురు చూపులో నల్లని మేఘాల మెరుపులందం తీరని దాహాలా

Telusaa manasaa

Image
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా ప్రతి క్షణం నా కళ్ళల్లో నిలిచే నీ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో చెలిమితో తీగసాగె మల్లెగా అల్లుకో లోకమే మారినా కాలమే ఆగిన మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగా తెలుసా http://youtube.com/watch?v=Em7B6gYYgq4

Kannullo nee roopame

Image
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఊసుని తెలిపేందుకు నా బాష ఈ మౌనమే కన్నుల్లో నీ రూపమే మదిదాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా నీ నీలికన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం కన్నుల్లో నీ రూపమే అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నా మదిలోని మాటేదని తలవంచుకుని నేను తెగ ఎదురు చూసాను నీ తెగువ చూడాలని చూస్తూనే వేళంత తెలవారి పోతుందో ఏమో ఎల ఆపడం కనుల్లో నీ రూపమే http://youtube.com/watch?v=VUvH1paU7bE

Bapu bommalu-jandhyaala geyaalu

Image
http://youtube.com/watch?v=4PXWJynPwgc

Mallela vaana

Image
మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా తేనేల జలపాతంలా సరదాలే చెలరేగేనా విరిసే అరవిందాలే అనిపించేనా మైమరచే అనందాలే ప్రతి నిమిషానా మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా చిన్న చిన్న సంగతులే మల్లె పూల విరిజల్లు తుళ్ళుతున్న అల్లరులే ముల్లు లేని రోజాలు అందమైన ఆశలే ,చిందులాడు ఊహలే నందనాల పొదరిల్లు గుప్పెడంత గుండెలొ గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు ఓ.... వన్నెల పరవళ్ళు పున్నాగ పరిమళాలు వయసే తొలి చైత్రం పూసే సమయాన మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా కొమ్మ లేని కుసుమాలు కళ్ళలోని స్వప్నాలు మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే పారిజాత హారాలు ముద్దు గుమ్మ ఎదలో మొగ్గ విచ్చు కధలే ముద్దమందారాలు ఆ.... నిత్య వసంతాలు ఈ పులకింతల పూలు ఎపుడు వసివాడని వరమై హృదయాన మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరబూసేనా

Mellaga mellaga tatti...

Image
మెల్లగా మెల్లగా తట్టి ... మేలుకో మేలుకో అంటూ తూరుపు వెచ్చగా చేరంగా సందె సురీడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలపుల తలుపులు తీయంగా ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కల మేలుకున్నది ,ఇలనేలుతున్నది మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకో అంటూ తూరుపు వెచ్చగా చేరంగా చిక్ చిక్ చిక్ చిక్ చిటి పొటి చిలుకా చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు పట్ పట్ పట్ పట్ పరుగుల సీతాకోక పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు చిన్ని చిన్ని రేకుల పూలన్ని ఆడుకుందాం రమ్మన్నాయి తలలూపి కొమ్మ మీద కోయిలమ్మ నన్ను చూసి పాడుతుంది కాస్త గొంతు శృతి చేసి మధుమాసమే ఉంటే ఎద ..సంతోషమే కదా సదా అమ్మమ్మా మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటూంది నింగి లోగిలి మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకో అంటూ తూరుపువెచ్చగా చేరంగా తుళ్ళ్ తుళ్ళ్ తుళ్ళ్ తుళ్ళ్ తుళ్ళే ఉడత మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు ఝల్ ఝల్ ఝల్ ఝాల్ పారే ఏరా ఎవరమ్మా నీకీ రాగం నేర్పించారు కొండతల్లి కోనకిచ్చు పాలేమో ఉరుకుల పరుగుల జలపాతం వాగు మొత్తం తాగేదాక తగ్గదేమో ఆశగా ఎగిరే పిట్ట దాహం మధుమాసమే ఉంటే ఎద సంతోషమే కదా సదా అమ్మమ్మా మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటూంది నింగి లోగిలి మ

Snehaanikanna minna...

Image
స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా కడదాక జీవితాన నిను వీడి పోదురా నీ గుండెలో పూచేటిది..నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా.... తులతూగే సంపదలున్నా స్నేహానికి సరికావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరిరారన్నా మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని సంపద రా ఆ స్నేహమే నీ ఆస్థి రా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణనికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదము లేనిది నిర్మలమైనది స్నేహము రా ధ్రువ తారగా స్థిరమైనది ఈ జగతిలొ విలువైనది ఈ స్నేహమొకటేనురా స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా http://youtube.com/watch?v=xQl_gGzJVyQ

Evaro Okaru

Image
ఎవరో ఒకరు... ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు...... మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది .. ఎవరో ఒకరు !! కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా అనుకొని కోడి కూత నిదరపోదుగా.. జగతికి మేలుకొలుపు మానుకోదుగా.. మొదటి చినుకు సూటిగా దూకి రానిదే మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే.. వాన ధార రాదుగా నేల దారికి ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి.. ఎవరో ఒకరు!! చెదరక పోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి.. దానికి లెక్క లేదు కాళరాతిరి.. పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని రెప్ప వెనక ఆపని కంటి నీటిని సాగలేక ఆగితే దారి తరుగునా? జాలి చూపి తీరమే దరికి చేరునా..? ఎవరో ఒకరు!! యుగములు సాగిన నింగిని తాకక ఎగసిన అలల ఆశ అలసిపోదుగా ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా ఎంత వేడి ఎండకే ఒళ్ళు మండితే.. అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా?.. నల్ల మబ్బు కమ్మితే చల్లబడడా..? ఎవరో ఒకరు!!

Pilichina muraliki-Valachina muvvaki

Image
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం అది ఆనంద భైరవి రాగం మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలొ ప్రేమపరాగం అది ఆనంద భైరవి రాగం కులికే మువ్వల అలికిడి వింటే కలలే నిద్దుర లేచే మనసే మురళి ఆలాపనలో మధురా నగరిగా తోచె యమునా నదిలా పొంగినది స్వరమె వరమై సంగమమై పిలిచిన మురళికి!! ఎవరీ గోపిక పద లయ వింటే ఎదలో అందియ మ్రోగే పదమే సగమై మదిలో ఉంటే ప్రణయాలాపన సాగే హృదయం లయమై పొయినది.. లయలే ప్రియమై జీవితమై మురిసిన మురళికి!!పిలిచిన మువ్వకి !! http://youtube.com/watch?v=q6cuzT47U6M

Atisayame

Image
పూవుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం ఆ సీతకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిలపాటే అతిశయం అతిశయమే అచ్చెరువొందే నీవేనా అతిశయం ఆ గిరులు ఈ తరులు ఏఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ.. పదహారు ప్రాయాన పరువంలో అందరికిపుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ.. పూవుల్లొ.......... ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి పూలవాసన అతిశయమే ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా వాననీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల వెలిగేటి మిణుగురులతిశయమే తనువులో ప్రాణం ఏ చోటనున్నదో ప్రాణంలోనా ప్రేమ ఏ చోటనున్నదో ఆలోచిస్తే అతిశయమే ఆ గిరులు ఈ తరులు ఏఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ.. పదహారు ప్రాయాన పరువంలో అందరికిపుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ.. పూవుల్లొ....... అల వెన్నెలంటి ఒకతీని ఇరు కాళ్ళంటా నడిచొస్తే నీవేనా అతిశయము జగమున అతిశయాలు ఏడేనా ఓ మాట్లాడే పువ్వా నువు ఎనిమిదొవ అతిశయము నింగిలాటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు తేనెలూరే అధరాలు అతిశయమే మగువ చేతివేళ్ళు అతిశయమే మకుటాలంటి గోళ్ళు అతిశయమే కదిలే వంపులు అతిశయమే ఆ గిరులు ఈ తరులు ఏఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయ

Nee kosam

Image
ఎపుడు లేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం....... ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది నాలో ఈ ఇది ఏ రోజు లేనిది ఏదో అలజడి నీతోనే మొదలిది నువ్వే నాకని పుట్టుంటావని ఒంటిగా నీ జంటకే ఉన్నాను నే నిన్నాళ్ళుగా నీకోసం నీకోసం....... నాలో ప్రేమకి ఒక వింతే ప్రతీది వీణే పలుకని స్వరమే నీ గొంతుది మెరిసే నవ్వది మోనాలిసది ఈ నిజం ఇక కాదనే యే మాటనూ నే నమ్మనూ నీకోసం నీకోసం.....

Maate raani chinnadani...

Image
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని...... వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను చెంతచేరి ఆదమరచి ప్రేమను కొసరెను చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను చందమామ పట్టపగలె నింగిని పొడిచెను కన్నెపిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మొహనరాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే... మాటేరాని........ ముద్దబంతి లేతనవ్వులే చిందెను మధువులు ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు హరివిల్లు లోని రంగులు నా చెలి సొగసులు వేకువల మేలుకొలుపే నా చెలి పిలిపులు సందెవేళ పలికే నాలో పల్లవి సంతసాల సిరులే నావే అన్నవి ముసిముసి తలపులు కరగని వలపులు నా చెలి సొగసులు అన్ని ఇక నావే... మాటేరాని.... http://www.youtube.com/watch?v=y_nrLTeez8o http://www.ramaneeya.com/smilfiles/rampopup.php?FirstPass=1123

Naa cheli rojaave

Image
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేడే నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేడే కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలోనిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహ కధలు జ్ఞాపకం మనసులేకపోతె మనిషి ఎందుకంట నీవులేకపోతె బతుకు దండగంట కనిపించవో అందించవో తోడు నా చెలి చెలియ చెంత లేదులె చల్లగాలి ఆగిపో మమత దూరమాయెనె చందమామ దాగిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడులేదు గగనమా చుక్కలాగ రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు నా చెలి http://youtube.com/watch?v=ko6hCUWnWqI

Chinnari Sneham

Image
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కధగానే రాసుకో మనసైతే మళ్ళి చదువుకో.....మరుజన్మకైనా కలుసుకో ఏనాడు ఏమవుతున్నా ,ఏ గూడు నీదవుతున్నా హయిగానే పాడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కధగానే రాసుకో జీవితం నీకోసం స్వాగతం పలికింది ఆశాలే వెలిగించి హారతులు ఇస్తుంది ఆకాశమంత ఆలయం నీకోసం కట్టుకుంది కల్యాణ తొరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది స్నేహం పెంచుకుంటుంది,ప్రేమే పంచుకుంటుంది కాలం కరిగి పోతుంటే కలగా చెదిరి పోతుంది మాసిపోని గాయమల్లే గుండెలోనె వుంటుంది చిన్నారి స్నేహమా...... ఆశయం కావాలి ఆశలే తీరాలి మనిషిలో దేవుడిని మనస్సుతో గెలవాలి అందాల జీవితానికో అనుబంధం చూసుకో అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో లోకం చీకటవుతున్నా ,బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి మమతే వెలుగు చూపాలి మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కధగానే రాసుకో మనసైతే మళ్ళి చదువుకో మరుజన్మకైనా కలుసుకో ఏనాడు ఏమవుతున్నా ,ఏ గూడు నీదవుతున్నా హయిగానే పాడుకో

Nammaku nammaku-Rudraveena

Image
నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు రవికిరణం కనబడితే తెలియును తేడాలన్ని ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏనాటికి పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ ఏ హాయి రాదోయి నీవైపు మరువకు శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా మురిసే పువులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా ఆనాడు రాకంత గీతాలూ పలుకును కద http://www.youtube.com/watch?v=JEEEzRvE9lc

Vidhata talapuna-sirivennela

Image
This song is always top of my fav list విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం - ఓం ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం- ఓం కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకది భాష్యముగ విరించినై ... జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాదతరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై ... నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం http://www.youtube.com/watch?v=VW1p9c-buSY

chandamama raave-sirivennela

Image
చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే చలువ చందనములు పూయ చందమామ రావే జాజిపూలతావినీయ జాబిల్లి రావే కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే గగనపు విరితోటలోని గోగుపూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే మునిజన మానస మోహిని యోగిని బృందావనం మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం రాధా మాధవ గాధల రంజిల్లు బృందావనం గోపాలుని మృదుపద మంజీరము బృందావనం బృందావనం బృందావనం http://www.youtube.com/watch?v=6liHRvwLgWM

Srirasthu-subhamasthu

Image
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని మసకేయని పున్నమిలా మనికినింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం http://www.youtube.com/watch?v=dG8M-sl4ILk

Chirunavvutho

Image
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటు కాళ్ళు కడిగి స్వాగతించకు ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చెయ్యకు మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకద ముసురుకునే నిసి విలవిలలాడుతు పరుగులు తీయద నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి ఆశలు రేపినా అడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా ఆశలు రేపినా అడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా ఎంత మంచి స్వప్నమైన అందులోనె ఉంటూ లేవకుండ ఉండగలమా కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవె చిలకమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి http://www.youtube.com/watch?v=fHumHM7upbk

అందెల రవమిది పదములదా

Image
ఓం నమో నమో నమఃశివాయ మంగళ ప్రదాయ గోతురంగతే నమఃశివాయ గంగ యాతరంగితొత్తమాంగతే నమఃశివాయ ఓం నమో నమో నమఃశివాయ శూలినే నమో నమః కపాళినే నమఃశివాయ పాలినే విరంచితుండ మాలినే నమఃశివాయ ఆందెల రవమిది పదములదా అందెల రవమిది పదములదా అంబర మంటిన హృదయముదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై మేను హర్ష వర్ష మేఘమై వేణి విసురు వాయువేగమై అంగ భంగిమలు గంగ పొంగులై హావ భావములు నింగి రంగులై లాస్యం సాగే లీల రసఝరులు జాలువారేల జంగమమై జడ పాడగ జలపాత గీతముల తోడుగ పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ ఆందెల రవమిది పదములదా నయన తేజమె న కారమై మనో నిశ్చయం మ కారమై శ్వాస చలనమె శి కారమై వాంచితార్ధమె వా కారమై యోచన సకలము యః కారమై నాదం న కారం మంత్రం మ కారం స్తొత్రం శి కారం వేదం వా కారం యఙం య కారం ఓం నమఃశివాయ భావమె మౌనపు భవ్యము కాగ భరతమె నిరతము భాగ్యము కాగ పురిల గిరులు తరి