Vachche vachche...


వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా....గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా......గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా

కళ్ళలోన పొంగుతున్న బాధలేన్నో మాకున్నై
గుండేలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నై
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పడేస్తారా

పిల్ల పాపల వాన......బుల్లి పడవల వాన
చదువు బాధలే తీర్చి..... సెలవులిచ్చిన వాన
గాలి వాన కబడ్డి......వేడి వేడి పకోడి
ఈడు జోడు డి డి డి..... తోడుండాలి ఓ లేడి

ఇంద్ర ధనస్సులో తళుకు మనె ఎన్ని రంగులో
ఇంతి సొగసులే తడిసినవి నీటి కొంగులో
శ్రావణ మాసాల జలతరంగం
జీవన రాగాల కిది ఓ మృదంగం

కళ్ళలోన పొంగుతున్న బాధలేన్నో మాకున్నై
గుండేలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నై
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పడేస్తారా

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా.....

కోరి వచ్చినా ఈ వాన...గోరు వెచ్చనయి నాలోన
ముగ్గుల సిగ్గు ముసిరేస్తే
ముద్దు లాటిదే మురిపాలా...మెరిసే మెరిసే అందాలు
తడిసే తడిసే పరువాలు
గాలి వానలా పందిళ్ళు
కౌగిలింతలా పెళ్ళిళ్ళు

నెమలి ఈకలో ఉలికి పడే ఎవరి కన్నులో
చినుకు చాటునా చిటికేలతో ఎదురు చూపులో
నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహాలా వలపు పందెం


కళ్ళలోన పొంగుతున్న బాధలేన్నో మాకున్నై
గుండేలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నై
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పడేస్తారా

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా.....

http://www.youtube.com/watch?v=sozYDHk7nK8

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu