Chinnari Sneham


చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కధగానే రాసుకో
మనసైతే మళ్ళి చదువుకో.....మరుజన్మకైనా కలుసుకో
ఏనాడు ఏమవుతున్నా ,ఏ గూడు నీదవుతున్నా హయిగానే పాడుకో

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కధగానే రాసుకో

జీవితం నీకోసం స్వాగతం పలికింది
ఆశాలే వెలిగించి హారతులు ఇస్తుంది
ఆకాశమంత ఆలయం నీకోసం కట్టుకుంది
కల్యాణ తొరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది
స్నేహం పెంచుకుంటుంది,ప్రేమే పంచుకుంటుంది కాలం కరిగి పోతుంటే కలగా చెదిరి పోతుంది
మాసిపోని గాయమల్లే గుండెలోనె వుంటుంది

చిన్నారి స్నేహమా......

ఆశయం కావాలి ఆశలే తీరాలి
మనిషిలో దేవుడిని మనస్సుతో గెలవాలి
అందాల జీవితానికో అనుబంధం చూసుకో
అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో
లోకం చీకటవుతున్నా ,బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి మమతే వెలుగు చూపాలి
మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కధగానే రాసుకో
మనసైతే మళ్ళి చదువుకో
మరుజన్మకైనా కలుసుకో

ఏనాడు ఏమవుతున్నా ,ఏ గూడు నీదవుతున్నా హయిగానే పాడుకో

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu