Kotta bangaaru lokam
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
జంట నెలవంకలుండే నింగి కావాలి మాకు
వెండి వెన్నెల్లలోనే వేయి కలలు పండాలి మాకు
పువ్వులే నోరు తెరచి మధుర రాగాలు నేర్చి
పాటలే పాడుకొవాలి అది చూసి నే పొంగిపోవాలి
మనసనే ఒక సంపద ప్రతి మనిషిలోను ఉండని
మనసనే ఒక సంపద ప్రతి మనిషిలోను ఉండని
మమతలే ప్రతి మనసులో కొలువుండనీ
మనుగడే ఒక పండగై కొనసాగనీ
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
ఓడిపోవాలి స్వార్ధం ఇల మరచిపోవాలి యుద్ధం
మరణమేలేని మనవులే ఈ మహిని నిలవాలి కలకాలం
ఆకలే సమసిపోనీ అమృతం పొంగిపోని
శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడనీ ప్రతినిత్యం
వేదనే ఇక తొలగనే వేడుకే ఇక వెలగనీ
వేదనే ఇక తొలగనే వేడుకే ఇక వెలగనీ
ఎల్లలా పొరాటమే ఇక తీరనీ
ఎల్లరూ సుఖశాంతితో ఇక బ్రతకనీ
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
Comments