Dorakunaa ituvanti Seva


దొరకునా ఇటువంటి సేవ

నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమదిరోహనము ఛేయు త్రోవ

దొరకునా ఇటువంటి సేవ

రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగ తిమిరాల ఓదార్చు దీపాలు
రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగతిమిరాల ఓదార్చు దీపాలు

నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే నిను కొల్చువేళ దేవాది దేవ

దొరకునా ఇటువంటి సేవ

ఉఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలు ఎదలోనె కడులే మృదంగాలు

నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వెళ మహనుభావా మహానుభావా

దొరకునా ఇటువంటి సేవ

http://youtube.com/watch?v=BWnbNK5662Q

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu