bugge bangaarama

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా

పట్టు చీరల్లో చందమామా
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా
కన్నె రూపాల కోనసీమా
కోటి తారల్లొ ముద్దు గుమ్మా

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా

ఎదురే నిలిచే అధర మధుర దరహాసం
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం
వెలిగే అందం... చెలికే సొంతం

వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసే వరకు కలలో జరిగే విహారమ్మ్

పుష్య మాసాన మంచు నీవో
భోగి మంటల్లొ వేడి నీవో
పూల గంధాల గాలి నీవో
పాల నురుగల్లో తీపి నీవో

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా

నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులాగా
సందె గాలి కొట్టగానే ఆరుబయట ఎన్నెలింట
సర్దుకున్న కన్నె జంట సద్దులాయెరో

ఎదలో జరిగే విరహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో

జతగా పిలిచే అగరు పొగల సవాసం
జడతో జగడంజరిగే సరసం ఎపుదో

అన్ని పువ్వుల్లో అమె నవ్వే
అన్ని రంగుల్లో అమె రూపే
అన్ని వేళల్లొ ఆమె ధ్యాసే
నన్ను మొత్తంగా మాయ చెసే

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki