sindhuram


అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్రం అందామా... స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరచకాన్ని స్వరాజ్యం అందామా..దానికి సలాము చేద్దామా
శాంతి కపోతపు గుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ..ఈ నెత్తుటి సింధూరం. నీ పాపిటలొ భక్తిగా దిద్దిన ప్రజలను చుడమ్మా ...ఓ పవిత్ర భారతమా

ఆర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్రం అందామా... స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేఛ్ఛను చూద్దామా ....దాన్నే స్వరాజ్యమందామా
కులాల కోసం గుంపులు కడుతూ ,మతాల కోసం మంటలు పెడుతూ ,ఎక్కడ లేని తెగువుని చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే....సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతుందని నిజం తెలుసుకోరే... తెలిసి భుజం కలిపి రారే ...ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం ...జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ...ఓ అనాధ భారతమా
అన్యాయాన్ని సహించని సౌర్యం...దౌర్జన్యాన్ని దహించే దైర్యం ..కారడవుల్లొ క్రూర మ్రుగాల్లా దాక్కుని ఉండాలా ..వెలుగుని తప్పుకు తిరగాలా శత్రువుతో పొరాడే సైన్యం ..శాంతిని కాపాడే కర్తవ్యం ..స్వజాతి వీరులననచే విదిలో కవాతు చెయ్యాలా ..ఉల్లల చేతిలో చావాలా ....తనలొ దైర్యం అడవికి ఇచ్చి ..తన కర్తవ్యం చట్టానికి ఇచ్చి ..ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిల్చుంటే ..నడిచే శవాల సిగలొ తురిమిన నెత్తుటి మందారం ..ఈ సంధ్యా సింధూరం

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki