aa toorupu ee paschimam


ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే

ఆకాశంలో తారా, సుడిగాలికారని దీపం
గుడి లేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే

సాగరంలో కెరటం ఉప్పొంగిన నా హృదయం ..
అలిసేది కాదు అనురాగం..ఈ జన్మ సంగీతం

గ్రహణాలు లేని ఆ తారలన్ని
గగన కలిసే ఈ వేళలోనే
కలిసింధి ఈ బంధం కలిసింధి ఈ బంధం

ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే...

చైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే
మనసైన మాటల కోసం మౌనాల ఆశలు పూసే
ఎడేడు రంగుల దీపం ఆ నింగిలో హరి చాపం
అరుణాల రుధిరంతోనే రుణమైనదీ ప్రియబంధం

ఏ దేశమైనా ఆకాశమొకటే
ఏ జంటకైనా అనురాగమొకటే
అపురూపమీ ప్రణయం అపురూపమీ ప్రణయం

ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే...

http://youtube.com/watch?v=lsQwV-aee7s

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki